Thyroid: కొంత మంది ఏమీ తినకపోయినా లావైపోతుంటారు. కేజీల కొద్దీ బరువు పెరుగుతుంటారు. మరి కొందకు ఎంత తిన్నా లావు కారు, బరువు పెరగరు. వెయిట్ లాస్ కోసం చాలా మంది చేస్తున్న ప్రయోగాల వల్ల ఫలితం ఉండటం లేదని భాదపడుతుంటారు. అలాంటి సమస్యలు ఉన్న వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే..వెంటనే థైరాయిడ్ సమస్య ఏమైనా ఉందా తేలేందుకు పరీక్ష చేయించుకోవాలి.
థైరాయిడ్ సమస్య వచ్చిన వారు తక్షణం వైద్యులను సంప్రదించినా, కొన్ని ఆహార పదార్ధాలకు దూరంగా ఉన్నా, అవన్నీ తాత్కాలిక ఫలితాలను ఇస్తాయి. సొంత వైద్యం మంచిదికాదు.
Thyroid: థైరాయిడ్ అంటే ఏమిటి..
గొంతు భాగంలో శ్వాసనాళాలకు ఇరువైపులా నిర్మితమైన వినాళ గ్రంధినే థైరాయిడ్ గ్రంధి అంటారు. థైరాక్సిన్ అనే హార్మోన్లను ఈ గ్రంధి విడుదల చేస్తుంది. అయితే ఈ థైరాక్సిన్ ఆనే హార్మన్ సక్రమంగా విడుదల కాక, హెచ్చుతగ్గుల వల్ల థైరాయిడ్ సమస్య వస్తుంది. శరీరంలోని అవయవాలు తమ పనిని కచ్ఛితంగా చేయడంలో థైరాయిడ్ గ్రంధి ప్రాముఖ్యత ఎక్కువ. ఇటువంటి థైరాయిడ్ గ్రంధి వ్యవస్థ దెబ్బతినడం వల్ల గొంతు వాపు వస్తుంది. థైరాయిడ్ హార్మోన్ ఎక్కువ విడుదల అయితే అనూహ్యాంగా బరువు పెరిగిపోవడం, థైరాక్సిన్ హార్మోన్ తక్కువ విడుదల అయితే శరీరం సన్నబడి పీలగా మారిపోవడం జరుగుతుంది. అయితే థైరాయిడ్ సమస్య పరిష్కారానికి ఆరోగ్యవంతమైన పద్ధతిలో పరిష్కరించుకోవడానికి ఆయుర్వేదంలో అసనాలు చక్కని పరిష్కారాన్ని ఇస్తాయి.
ఈ ఆసనాలు ఉపయోగం
సర్వాంగాసనం, మత్సాసానం, భుజంగాసనం, వీరభద్రాసనం, చక్రాసనం థైరాయిడ్ సమస్య పరిష్కారానికి చక్కడి పరిష్కారాన్ని ఇస్తాయి. ప్రతి రోజు వీటిని ఆచరించడం వల్ల థైరాయిడ్ సమస్య పరిష్కారం అవ్వడమే కాక శరీరానికి చక్కటి వ్యాయామం అవుతుంది. అంతే కాకుండా ప్రతి రోజు ఉదయం సాయంత్రం ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో పద్మాసనంలో లేదా వజ్రాసనంలో నిటారుగా కూర్చుని గుండె నిండా గాలి పీల్చుకుని తిరిగి గాలిని వదిలేటప్పుడు హాం అనే అక్షరాన్నిమన గొంతు నుండి అఛ్చరించాలి. ఈ హాం అనే అక్షరం బీజాక్షరం. ఇది కల్గించే వైబ్రేషన్ వల్ల గొంతు భాగంలో ఉన్న థైరాయిడ్ గ్రంథి ఉత్తేజితమై అస్తవ్యస్తంగా ఉన్నదానిని సక్రమైన దారిలోకి తెస్తుంది. రోజు ఉదయం సాయంత్రం ఈ అక్షరాన్ని కనీసం 24 సార్లు ఉచ్చరించినట్లైయితే చక్కడి ఫలితం కలుగుతుంది.