వ్యాయామం అనగానే ఎక్కువగా కండరాల పైనే దృష్టి పెడతాం నిజానికి వ్యాయామం అంటే కేవలం భౌతిక శరీరాన్ని బలపేతం చేయడమే కాదు.. మానసిక ఆరోగ్యాన్ని కూడా కాపాడుకోవడం. చాలామందికి చదువుల మీద.. చేసే పని మీద ఎక్కువగా దృష్టి ఉండదు. ప్రస్తుతం చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పనులు చక్కబెడుతూ ఉన్నారు. కావున ఈ సమయంలో వారిపై మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది. వాటిని తగ్గించుకోవాలంటే మానసికంగా దృఢత్వాన్ని పెంచే వాయమాల మీద ఫోకస్ పెట్టాలి. ఇంట్లో చేసుకునే తోట పనుల వంటివితో పాటు ఏరోబిక్స్ జాగింగ్ లాంటివి మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడుతాయి. వయసు పెరుగుతున్న కొద్ది చాలా మందిలో మతిమరుపు కూడా పెరిగిపోతోంది.
ప్రస్తుతం ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్యలు తల నొప్పి, ఆందోళన, అలసట, కోపం ఇలాంటి మానసిక సమస్యలను తట్టుకోవాలంటే రోజువారి దినచర్యలో కొన్ని మార్పులు చేయాలి. ముఖ్యంగా నిద్ర మానసిక వ్యాధుల నుంచి దూరం చేస్తోంది. ప్రస్తుత జీవన శైలిలో పని ఒత్తిడి వల్ల చాలామంది నిద్రలేమి ఎదుర్కొంటున్నారు. దీనివల్ల మానసిక ఒత్తిడి పెరిగి అనారోగ్య గురవుతున్నారు.
వ్యాయామంతో పాటు మెడిటేషన్ మానసిక ఒత్తిడి తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఎక్కువ మొత్తంలో మంచి నీరు తీసుకోవడం వల్ల మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. తీసుకునే ఆహారంలో కూడా పోషకాలు ఎక్కువగా ఉండే వాటిని తీసుకోవడం మంచిది. యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ b2 ,విటమిన్ బీ , మాంసకృత్తులు ఎక్కువ మొత్తంలో తీసుకోవడం వల్ల మెదడు ఆరోగ్యంగా ఉంటుంది. ప్రతి విషయాన్ని పాజిటివ్‌గా ఆలోచించాలి. అలాగే సేహ్నితులతో తరుచూ మాట్లాడుతుండడం,ప్రకృతి మమేకావడం, పార్కులో ఎక్కువ సేపు గడపడం మంచిది. కాఫీలు టీలు ఎక్కువగా తాగేవారు వీటిని తగ్గిస్తే మంచిది. పై నియమాలను పాటించి ఆర్యోగవంతమైన జీవనశైలిని కొనసాగించండి.