ట్రెండింగ్ హెల్త్

Badam Milk: ఇన్స్టెంట్ బాదంపాలు తయారు చేసుకోండిలా..! 

Share

Badam Milk: సమ్మర్ లో చల్లగా తాగాలని అందరికీ ఉంటుంది.. కూల్ డ్రింక్స్ తాగడానికి చాలా మంది మక్కువ చూపిస్తారు.. కూల్ డ్రింక్స్ కంటే కూడా ఇంట్లోనే చల్లచల్లగా శీతల పానీయాలు తయారు చేసుకుని తాగడం బెస్ట్.. అటువంటి వాటిలో బాదంపాలు ముందు వరుసలో ఉంటాయి.. బాదంపాలు చేయడానికి కాస్త సమయం పడుతుంది.. అందుకని ఇన్ స్టెంట్ బాదంపాలు ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

Instant Badam Milk: Powder Preparation
Instant Badam Milk: Powder Preparation

బాదంపాల పొడి తయారీ..

బాదం పప్పు ఒక కప్పు, పిస్తా పప్పు పావు కప్పు, యాలకులు పది, పటిక బెల్లం 150 గ్రాములు, పసుపు హాఫ్ స్పూన్, కుంకుమ పువ్వు చిటికెడు అవసరం.ముందుగా ఒక కళాయిలో బాదంపప్పు, పిస్తా, యాలకులు వేసి మూడు నిమిషాల పాటు వేయించాలి. తరువాత వీటిని మిక్సీ పట్టి పొడి చేసుకోవాలి. ఇందులోనే పటిక బెల్లం, పసుపు, కుంకుమ పువ్వు వేసి మెత్తగా పొడిలా చేసుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న బాదం పాల పొడిని ఒక సీసాలో పక్కన ఉంచుకోవాలి. ఈ పొడి రెండు నెలల పాటు నిల్వ ఉంటుంది.

Instant Badam Milk: Powder Preparation
Instant Badam Milk: Powder Preparation

ఒక గ్లాస్ గోరు వెచ్చని పాలలో ఒకటి స్పూన్ బాదం పాల పొడి కలుపుకోవాలి. మీకు ఇంకా కావాలి అనుకుంటే రెండు టీ స్పూన్ల బాదం పొడి వేసి కలుపుకోవాలి. మీరు కావాలి అనుకుంటే వేడివేడిగా తాగవచ్చు లేదు అంటే ఒక అర గంట పాటు ఫ్రిజ్ లో ఉంచుకొని చల్లచల్లగా కూడా తాగవచ్చు. ఇలా బాదంపాల పొడి రెడీగా పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగచ్చు.


Share

Related posts

ఇలా  చేయండి ఐశ్వర్య వంతులుగా బ్రతకండి  ??

Kumar

సాగు చట్టాలపై కేంద్రం కీలక ప్రతిపాదన..సమయం కోరిన రైతు సంఘాలు

somaraju sharma

Blood Clots: రక్తనాళాల్లో బ్లడ్ క్లాట్స్ తగ్గించడానికి ఇవి తీసుకుంటే చాలు..! 

bharani jella
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar