NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Village Secretariat: ప్రభుత్వానికి షాక్ ఇచ్చిన కాంట్రాక్టర్..! గ్రామ సచివాలయానికి తాళం..!!

Village Secretariat: ఇటీవల కాలంలో పలు మున్సిపాలిటీల్లో బకాయిలు చెల్లించని వాళ్ల ఇళ్లకు వెళ్లి అధికారులు తాళాలు వేసిన సంగతి గుర్తు ఉండే ఉంటుంది. అదే విధంగా పలు ప్రాంతాల్లో అద్దెకు ఉన్న వాళ్లు నెలలు తరబడి అద్దె బకాయిలు పెడితే ఇంటి యజమాని వెళ్లి ఇళ్లకు తాళం వేయడం అక్కడక్కడా చూసే ఉంటాం. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఓ ప్రభుత్వ కార్యాలయానికి కాంట్రాక్టర్ తాళం వేయడం. గత ప్రభుత్వ హయాంలో జరిగిన పలు పనులకు ఇప్పటికీ కాంట్రాక్టర్లు బిల్లులు చెల్లించలేదు. కొందరు కోర్టును సైతం ఆశ్రయించిన సంగతి తెలిసిందే. కాంట్రాక్టర్ లకు ప్రభుత్వం సరిగా బిల్లులు చెల్లించకపోవడంతో రాష్ట్రంలో వివిధ పనులకు టెండర్లు పిలిచినా ఎవరూ టెండర్లు వేయడానికి ముందుకు రాని పరిస్థితి ఉంది. గత ప్రభుత్వ హయాంలోని బకాయిల సంగతి పక్కన పెడితే ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులకు కూడా బిల్లులు చెల్లింపులు జరగడం లేదు. దీంతో కాంట్రాక్టర్లు పనుల కోసం తీసుకున్న అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు.

Village Secretariat building locked by contractor
Village Secretariat building locked by contractor

Village Secretariat: పసుపుగల్లు గ్రామ సచివాలయ భవనానికి తాళం

ఈ తరుణంలో ప్రకాశం జిల్లాలో ఓ కాంట్రాక్టర్ తనకు బిల్లులు మంజూరు చేయడం లేదన్న కోపంతో ఏకంగా గ్రామ సచివాలయ భవనానికే తాళం వేసి అధికార యంత్రానికి షాక్ ఇచ్చాడు. భవనం నిర్మించి రెండేళ్లు అవుతున్నా ప్రభుత్వం నుండి బిల్లులు రాకపోవడంతో ఆ కాంట్రాక్టర్ విసుగెత్తిపోయాడు. ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలం పసుపుగల్లు గ్రామ సచివాలయ భవనాన్ని అంజిరెడ్డి అనే కాంట్రాక్టర్ నిర్మించారు. ఈ భవనానికి 2020 ఫిబ్రవరి 10న భూమి పూజ చేశారు. అధికారుల ఆదేశాలతో యుద్దప్రాతిపదికన ఆ ఏడాది సెప్టెంబర్ నాటికి భవన నిర్మాణం పూర్తి చేశారు. 2020 సెప్టెంబర్ 17న దర్శి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఈ సచివాలయ భవనాన్ని ప్రారంభించారు.

అధికారులకు తన బాధ తెలియజేసేందుకే

ఈ గ్రామ సచివాలయ భవన నిర్మాణానికి రూ.40 లక్షలు ఖర్చు చేసినట్లు కాంట్రాక్టర్ అంజిరెడ్డి తెలిపారు. భవన నిర్మాణానికి తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు చెల్లించలేకపోతున్నానని వాపోయాడు కాంట్రాక్టర్ అంజిరెడ్డి. రెండేళ్లు అవుతున్నా బిల్లులు రాకపోవడంతో తన బాధ అధికారులకు తెలియజేయాలన్న ఉద్దేశంతో కార్యాలయానికి తాళం వేసినట్లు కాంట్రాక్టర్ అంజిరెడ్డి చెప్పారు. గ్రామంలోని ఆర్‌బీకే ఇతర కార్యాలయాలు అద్దె ఇళ్లలో కొనసాగుతున్నాయనీ, అదే విధంగా గ్రామ సచివాలయంలోని సామాను తీసుకువెళ్లి అద్దె భవనంలో పెట్టుకోవాలని ఆయన సూచించారు. దీనిపై అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి. గత ఏడాది ఇటువంటి సంఘటనే గుంటూరు జిల్లా గురజాల మండలంలోనూ జరిగింది. జంగమహేశ్వరపురంలో గ్రామ సచివాలయ భవనాన్ని నిర్మించిన కాంట్రాక్టర్ వెంకటరెడ్డి సచివాలయ భవనానికి తాళం వేయడంతో సిబ్బంది అవాక్కయ్యారు. తర్వాత ఉద్యోగులు త్వరగా బిల్లులు వచ్చేలా చేస్తామని  కాంట్రాక్టర్ కు హామీ ఇవ్వడంతో వివాదం తాళం ఇచ్చినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju