న్యూస్ హెల్త్

మటన్ కంటే టేస్ట్ గా మీల్ మేకర్ కర్రీ ఇలా చేసుకోండి..!

Share

సోయా ఉత్పత్తుల్లో మిల్ మేకర్ కూడా ఒకటి.. ఇందులో ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది.. మన శరీరానికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు ఇందులో మనకు లభిస్తాయి.. నాన్ వెజ్ తినని వారు మిల్ మేకర్ తింటే అందులో లభించిన పోషకాలు అంటే ఇందులో ఎక్కువగా లభిస్తాయి.. మిల్ మేకర్ కర్రీని టేస్టీగా ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం..!

మిల్ మేకర్ కర్రీ కి కావలసిన పదార్థాలు..

ఒక కప్పు మిల్ మేకర్, ఒక కప్పు సన్నగా తరిగిన ఉల్లిపాయలు, సన్నగా తరిగిన టమాట రెండు, తరిగిన పచ్చిమిర్చి నాలుగు, చిన్న అల్లం ముక్క ఒకటి వెల్లుల్లి రెబ్బలు 10 దాల్చిన చెక్క చిన్న ముక్క ఒక చెంచా ధనియాలు, ఒక అర చెంచా లవంగాలు, ఒక స్పూన్ చొప్పున ఉప్పు, కారం, పసుపు కొద్దిగా, నూనె రెండు కప్పులు, నీళ్లు అర కప్పు, కొత్తిమీర కొద్దిగా, పుదీనా కొద్దిగా, కొబ్బరి చిన్న ముక్క ..

ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో అల్లం, చిన్న ఉల్లిపాయలు, కొబ్బరి, ధనియాలు, లవంగాలు వేసి బాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి.. ముందుగా ఒక కప్పు వేడి నీటిలో మీల్ మేకర్ వేసి ఐదు నిమిషాల పాటు నానబెట్టుకోవాలి..

స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని నూనె వేసి రెండు లవంగలు వేయాలి. అందులో కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి దోరగా వేయించుకోవాలి.. ఇందులో ముందుగా సిద్ధం చేసుకుని పెట్టుకున్న మసాలా వేసి రెండు నిమిషాలు వేయించాలి. ఆ తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసి మరో రెండు నిమిషాలు వేగనివ్వాలి. ఇందులో పసుపు ఉప్పు కారం వేసి ఇందులోనే మీల్ మేకర్ కూడా వేసి అరకప్పు నీళ్లు పోసి ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి.. మిల్ మేకర్ ఉడికిన తర్వాత చివరగా కొత్తిమీర, పుదీనా వేసుకొని స్టవ్ ఆఫ్ చేయాలి అంతే.. మిల్ మేకర్ మసాలా తినడానికి రెడీ. ఈ కర్రీని అన్నం, చపాతీ, రోటీ, పుల్కా, బిర్యానీ, కిచిడి వంటి వాటిలోకి తినడానికి రుచికరంగా చాలా బాగుంటుంది..


Share

Related posts

AC: ఎండ వేడి తట్టుకో లేక ఏసీ ఎక్కువగా వాడుతున్నారా??

Kumar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినిమా తక్కువ టైం లో కంప్లీట్ చేయటం కోసం హరీష్ శంకర్ సరికొత్త ప్లాన్..??

sekhar

రేవంత్ కొత్త గేమ్ … కాంగ్రెస్ పార్టీలో చీలిక ?

sridhar