short persons: జీన్స్ లేదా ఇతర మోడరన్ బట్టలు వేసుకునేటప్పుడు పెన్సిల్ కట్ లాంటివి వేసుకోవాలి.ఎందుకంటే పాదం దగ్గర ఫ్యాంటు లూజుగా ఉంటే పొట్టిగా కనపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది.పొట్టిగా ఉన్నారని తక్కువగా భావించకండి. ముందుగా పొట్టిగా ఉన్నామనే భావన మనసులోంచి బయటకు పంపాలి . ఆభావనని తల దాన్నే ఎదో ఒక టాలెంట్ మీలో ఉండే ఉంటుంది. దానికి పదును పెట్టండి. దాని ముందు పొట్టిగా ఉన్నామన్న భావన చిన్నదై పోతుంది. తల నిటారుగా పెట్టి నడవడం వల్ల కూడా ఎత్తుగా ఉన్నామనే భావన ఎదుటి వారిలో తీసుకోగలుగుతారు.
వీటన్నిటి కంటే మంచి ఆప్షన్ హై హీల్స్ వాడడం కూడా అని గుర్తు పెట్టుకోండి.
కాకపోతే హైహీల్స్ వాడకం అనేది పాదాలకు నడుముకు అంత మంచిది కాదు. అప్పుడప్పుడు అయితే పర్వాలేదు కానీ రోజువారీ వీటిని వాడకపోవడం మంచిది.
చీరలు,లంగా ఓణీలు మీద వేసుకునే జాకెట్ కు పొట్టి చేతులు కుట్టించుకోవాలి. మోచేతి వరకు చేతులు ఉండే జాకెట్ వేసుకుంటే పొట్టిగా కనిపిస్తారు. అలాగే మెడ మొత్తం కవర్ చేసే జాకెట్లకు అంటే హై నెక్ జాకెట్లకు వాడకపోవడం మంచిది. కాస్త డీప్ కట్ బ్లౌజ్‌లను వాడడం వలన పొడవుగా కనిపించే అవకాశం ఉంది.
చీరల విషయానికి వస్తే బరువైన, ఎక్కువ వర్క్ చేసిన చీరలను కాకుండా జార్జెట్, సిల్క్,ఇక్కత్ చీరలు సెలెక్ట్ చేసుకోవాలి.
ఏ రకం చీర అయినా కూడా కుచ్చిళ్లు తక్కువగా వచ్చేలా చూసుకోవాలి . అలాగే పల్లు కూడా జాలువారే విధం గా పెట్టుకోవడం వలన కూడా ఎత్తుగా కనిపిస్తారు.అన్నిటికన్నా ముఖ్యమైనది కాన్ఫిడెన్స్ అని మరువకండి…అది ఉంటే ఎన్ని లోపాలు ఉన్న బాధ అనేది ఉండదు.దాని ముందు పొట్టి,పొడుగు,లావు సన్నం ఇలాంటివి ఏవి పనిచేయవు అని గుర్తు పెట్టుకోండి.