Tamarid: చింతపండు ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుందనే విషయం చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. కేవలం కూరల్లో రుచిని పెంచడానికి మాత్రమే కాకుండా ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా చింతపండు ప్రత్యేక పాత్ర పోషిస్తుంది. చింతపండులో విటమిన్-సి, విటమిన్-ఎ, ఫాస్పరస్, పొటాషియం, కాల్షియం, ఐరన్, ఫైబర్ అధిక సంఖ్యలో ఉంటాయి.
Bigg Boss Telugu OTT: బిగ్ బాస్ ఓటిటి ఎలిమినేషన్ ఎపిసోడ్ లో బిగ్ ట్విస్ట్..!!
Tamarid: చింతపండు వలన కలిగే లాభాలు :
వీటితో పాటు అదనంగా యాంటీ బాక్టీరియల్, యాంటీ డయాబెటిక్ లక్షణాలను కూడా కలిగి ఉంటుంది. మరి చింతపండు వలన మనకు ఎలాంటి ఉపయోగాలు కల్గుతాయో తెలుసుకుందామా.. అసలే వచ్చేది వేసవికాలం ఎండలు కూడా బాగా మండుతాయి కాబట్టి వేసవిలో చింతపండు తీసుకోవడం వలన శరీరం చల్లబడుతుంది. అలాగే చింతపండులో ఉండే ఇనము వలన త్వరగా రక్తహీనత రాదు.
Health insurance: ఎక్కువ కాలం ఆరోగ్య బీమా వలన ఇవే ఉపయోగాలు.. రెన్యువల్ భారం తగ్గించుకోండి!
రోగనిరోధక శక్తిని పెంచడంలో చింతపండు పాత్ర :
ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే మన శరీరంలో రోగనిరోధక శక్తీ ఎక్కువగా ఉంటాలంటే విటమిన్ ‘సి’ అనేది చాలా ముఖ్యం. చింతపండులో విటమిన్ ‘సి’ పుష్కలంగా ఉంటుంది కాబట్టి రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది. అలాగే చింతపండులో టాడ్పోల్స్లో హైడ్రాక్సిల్ ఆమ్లం అధికంగా ఉంటుంది. ఈ ఆమ్లం శరీర కొవ్వును తగ్గించడానికి ఉపయోగపడుతుంది ఫలితంగా త్వరగా బరువు తగ్గుతారు.
చింతపండు ఎవరు తినవచ్చు.. ఎవరు తినకూడదో తెలుసా..?
జ్వరం, జలుబు వచ్చినప్పుడు చింతపండు సూప్‌లో కొద్దిగా మిరియాలు పొడి వేసుకుని తాగితే ఉపశమనం లభిస్తుంది. గర్భిణీ స్త్రీలు కూడా చింతపండుతో చెసిన మిఠాయిని తినవచ్చు. ఇది జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంతో పాటు గర్భిణీ సమయంలో వచ్చే వాంతులు, వికారాన్ని తగ్గిస్తుంది. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అలెర్జీ ఉన్నవారు చింతపండును అసలు తినకూడదు. అలాగే గొంతు నొప్పి ఉన్నవారు కూడా తక్కువ మోతాదులో చింతపండు తీసుకోవాలి. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా చింతపండును సరైన మోతాదులో తీసుకోవాలి.