Health Tips: గ్యాస్, అసిడిటీ, గుండెల్లో మంట.. ఈ సమస్యలతో చాలా మంది సతమత మవుతున్నారు. దీని నివారణ గా ఇంగ్లిష్ మెడిసిన్లను కాకుండా మన ఇంట్లో ఉండే సహజ సిద్ధమైన పదార్థాలతో ఈ సమస్యల నుంచి ఎలా బయట పడవచ్చో తెలుసుకుందాం.
1. గుండెల్లో మంట గ్యాస్, అసిడిటీ సమస్య ఏదైనా కూడా నీటిని బాగా తాగుతుంటే జీర్ణాశయంలో అధికంగా ఉత్పత్తి అయ్యే యాసిడ్ల ప్రభావం కొంత వరకు తగ్గి ఈ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. కాక పొతే ఈ సమస్యలు తగ్గే వరకు నీటిని బాగా తాగుతుండాలి.
2. పైనాపిల్ జ్యూస్ తాగడం వలన కూడా ఆ సమస్య నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది.
3. గ్యాస్, గుండెల్లో మంటగా ఉన్నప్పుడు ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ బేకింగ్ సోడాను వేసి కలుపుకుని తాగితే తక్షణమే ఉపశమనంగా అనిపిస్తుంది.
4. ఒక గ్లాస్ నీరు తీసుకుని అందులో 1 టీస్పూన్ యాపిల్ సైడర్ వెనిగర్‌ను వేసుకుని తాగినా గ్యాస్ సమస్య నుంచి విముక్తి కలుగుతుంది.
5. గ్యాస్, అసిడిటీ సమస్య ఉన్నవారు పడుకోకుండా ఎంత సేపు ఉండగలిగితే అంత సేపు కూర్చుని ఉండాలి. ఇలా చేయడం వలన గ్యాస్ పైకి రాకుండా ఉంటుంది.అలా కాకుండా పడుకుంటే మాత్రం గ్యాస్ పైకి వస్తుంది. దీంతో సమస్య మరింత ఎక్కువవుతుందే కానీ తగ్గదు.
6. గుండెల్లో మంటగా అనిపిస్తున్నప్పుడు అరటి పండు,యాపిల్, ద్రాక్ష ను తింటే సమస్య వెంటనే పరిష్కారం అవుతుంది.
7. ఒక గ్లాస్ నీరు తీసుకుని అందులో ఒక టీస్పూన్ పుదీనా రసం కలుపుకుని తాగినా పైన చెప్పిన మూడు సమస్యల నుంచి ఉపశమనం కలుగుతుంది.
8. ఒక గ్లాస్ నీరు తీసుకుని ఒక నిమ్మకాయ రసాన్ని పూర్తిగా అందులో పిండి తాగితే గ్యాస్ సమస్య వెంటనే తగ్గుతుంది.
9. గుండెల్లో మంట,అసిడిటీ, ఉన్నవారు ఒక గ్లాస్ చల్లని మజ్జిగ తాగిన కూడా సమస్య తగ్గుతుంది.
10. అలోవెరా జ్యూస్ తాగినా కూడా పై మూడు సమస్యల నుంచి బయట పడవచ్చు.