Child: తలలో పేలు ఉంటే ఇంకా ఆ మనిషికి ప్రత్యక్ష నరకమే అని చెప్పక తప్పదు. ఈ సమస్య ఎక్కువగా స్కూల్ కి వెళ్లి వయస్సు పిల్లలకు ఉంటుంది.పేలు ఎక్కువగా ఉన్నవారు దేనిమీద ద్యాస పెట్టలేరు.. చేయి ఎప్పుడు తలలోనే ఉంటుంది. రాత్రి పూట సరయిన నిద్రకూడా ఉండదు. తగిన జాగ్రత్త తీసుకోక పొతే ఇవి తలలో కురుపులు రావడానికి కూడా కారణం అవుతాయి.
పేల నివారణ మార్గాలు తెలుసుకుందాం…
పేల ను వదిలించుకోవడానికి మార్కెట్లో చాలా రకాల షాంఫూలు అందుబాటులో ఉన్నాయి. కానీ అవి రసాయనాలతో తయారు చేయబడినవి. కాబట్టి అవి వాడకుండా ఉండడం మంచిది. సహజ సిద్ధంగా దొరికే కొన్ని పదార్థాలతో పేల బాధ ఎలా వదిలించుకోవాలో తెలుసుకుందాం.రెండు టేబుల్ స్పూన్ల వెనిగర్ తీసుకుని అంతే పరిమాణం లో నీరు కలిపి ఆ మిశ్రమాన్ని తలకు పట్టించి సరిగ్గా గంట తర్వాత కుంకుడు కాయ రసంతో తలస్నానం చేయాలి.ఒక కప్పు కొబ్బరి నూనెలో, టీ స్పూన్ కర్పూరం పొడి వేసి ఆ పొడి కరిగిపోయే దాకా కొబ్బరి నూనెను వేడి చేయండి. నూనె గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మాడుకు అంటేలా శుభ్రంగా మర్ధనా చేసి ఒక గంట తర్వాత కుంకుడు కాయల రసం తో తల స్నానం చేసేయాలి. గుప్పెడు తులసి ఆకులు తీసుకుని నూరి రాత్రి నిద్రపోయేముందు కుదుళ్లకు బాగా పట్టేలా రాసుకోండి. వెంట్రుకలు కనిపించకుండా తలకు మెత్తని టవల్ కట్టుకొని పడుకుని తెల్లారి లేచిన తర్వాత పేల దువ్వెన తో తల అంత దువ్వండి.
ఆలివ్ నూనెను రాత్రి పడుకోబోయే ముందు తలకు బాగా పట్టించి తర్వాత ఒక ప్లాస్టిక్ కవర్ తలకు చుట్టుకొని పడుకొని తెల్లారిన తర్వాత పేల దువ్వెన తో శుభ్రంగా దువ్వుకోవాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే పేలు వదిలి పోతాయి.
పేలు చాలా ఎక్కువగా ఉంటే మాత్రం పైన చెప్పిన చిట్కాల లో ఏదైనా ఒకటి తీసుకుని రెండు రోజులకు ఒకసారి చేస్తూ … ప్రతి రోజు తలకు నూనె రాసుకుని పేల దువ్వెన తో కనీసం పది నిమిషాలు పాటు దువ్వుతుండాలి… పేలు మొత్తం పోయేవరకు ఇలా ప్రతి రోజు దువ్వుతూనే ఉండాలి.. స్కూల్ కి వెళ్లే పిల్లలకు ప్రతి రోజు పేలు దువ్విన తర్వాతే జడ వేయాలి. అప్పుడు మాత్రమే పేలు పూర్తిగా పోతాయి.