నేటి తరం ఫ్రెష్ గా కొత్త కొత్త హెయిర్ స్టైల్స్ తో డ్రెస్సులతో స్టయిలిష్ గా అందం గా కనిపించాలి అని కోరుకుంటారు.వాటికోసం రక రకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు.ముఖ్యంగా హెయిర్ కోసమయితే రకరకాల హెయిర్ ప్రొడక్ట్స్ ఉపయోగిస్తూ ఉంటారు. వాటితో ప్రతి రోజు తలస్నానం చేస్తుంటారు. కళాకారులు, ఆతిథ్య రంగంలో పనిచేసే మహిళలు సాధారణంగా రోజూ తలస్నానం చేయవలిసి ఉంటుంది. అయితే కొందరు జిడ్డు చర్మం కారణంగా తలస్నానం చేస్తే మరికొందరు చుండ్రు సమస్య కారణంగా చేస్తూ ఉంటారు.
అయితే ఇలా రోజు తలా స్నానం చేస్తే షాంపుల ప్రభావం కారణంగా మాడుపై ఉండే సహజనూనెలు పోయి జుట్టు ఎండుగడ్డిలా నిర్జీవం గా తయారవుతుంది. అయితే ఈ పరిస్థిని అధిగమించాలి అంటే తక్కువ గాఢత లేదా పీహెచ్ 5.5. ఉన్న నాణ్యమైన షాంపూతో అది కూడా రోజు విడిచి రోజూ లేదా రెండు రోజులకోసారి తలస్నానం చెయ్యాలి. కనీసం వారానికి ఒకసారి అయినా గోరువెచ్చని స్వచ్ఛమైన కొబ్బరి నూనెతో తలకు మర్దన చేసుకోవాలి.
అంతేకాదు స్టయిలింగ్ కోసం తడిగా ఉన్నప్పుడే జెల్స్ వాడటం, ఆ జెల్స్ రాసేటప్పుడు కుదుళ్ల కు తగిలే లా రాయటం సరైన విధానం కాదు. జుట్టును శుభ్రంగా తుడుచుకొని ఆరిన తర్వాత వెడల్పాటి పళ్లున్న దువ్వెనతో నెమ్మదిగా దువ్వుకోవాలి. అపుడపుడు మాత్రమే జుట్టుకు షాంపూను వాడటం వలన, వెంట్రుకలకు కలిగే ప్రమాదాలను తగ్గించి, జుట్టు ఆరోగ్యాన్ని పెంచుకొని మరియు మంచి పోషణని పొందవచ్చు. రోజు రాత్రి పడుకునే సమయంలో ఎక్కువ ఖాళీలు గల దువ్వెనతో జుట్టు దువ్వటం వలన సీబం పూర్తి జుట్టుకు విస్తరింపచేసినట్టవుతుంది ఆ తర్వాతే జెల్స్ రాయాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటేనే జుట్టు రాలడం, చుండ్రు తగ్గడం వంటివి తగ్గుతాయి.