మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్ల కారణంగా ఈ కాలంలో చాలామంది అధిక బరువు సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు.ఈ రోజుల్లో అధిక బరువు అనేది ప్రతి ఒక్కరిని వేధించే ప్రధాన సమస్యగా మారింది అధిక బరువు కారణంగా చాలా రకాల అనారోగ్యాలు వస్తాయి.బరువు పెరగడానికి చాలా రకాల కారణాలు ఉండొచ్చు కారణం ఏదయినా ఒకసారి బరువు పెరిగితే తగ్గాలంటే చాలా కష్టం అనే చెప్పాలి. బరువు తగ్గడం కోసం రకరకాల వ్యాయామాలు చేయడం, డైటింగ్ చేయడం లాంటి ఎన్నో రకాల పద్ధతులు పాటిస్తూ ఉంటాము. అయితే ఇంట్లో దొరికే కొన్ని పదార్ధాలను. ఉపయోగించి కూడా మన బెల్లీఫ్యాట్ని త్వరగా, సులభంగా తగ్గించుకోవచ్చు. మరి ఆ చిట్కాలు ఏంటో ఒక లుక్ వేద్దామా.
గ్రీన్ టీ:
చాలా మందికి టీ తాగే అలవాటు ఉంటుంది. అయితే బెల్లీ ఫ్యాట్ తగ్గాలంటే మాములు టీ బదులుగా ఉదయం, సాయంత్రం గ్రీన్ టీ తాగితే మంచి ఫలితం కనిపిస్తుంది.గ్రీన్ టీలో కొవ్వును కరిగించే గుణాలు ఎన్నో ఉంటాయి.అంతేకాకుండా ఇది షుగర్, డయాబెటిస్, హై బిపి వంటి అనేక వ్యాధుల నుంచి కాపాడుతుంది.
జీలకర్ర నీరు:
బెల్లీఫ్యాట్ని తగ్గించుకోవాలంటే జీలకర్ర వాటర్ బెస్ట్ ఆప్షన్ అనే చెప్పాలి.ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర గాని. లేదంటే జీలకర్రను గాని వేసి బాగా మరిగించి తాగాలి. ఇలా ప్రతిరోజు ఉదయం పూట జీలకర్ర నీరును తాగితే బెల్లీ ఫ్యాట్ వేగంగా కరగడంతో పాటుగా శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.పైన చెప్పిన చిట్కాలు పాటిస్తూ కొవ్వు అధికంగా ఉండే ఆహారపు పదార్ధాలు తినకుండా, వ్యాయామం చేస్తూ ఉంటే బరువు తగ్గడం చాలా సులభం అవుతుంది.