హెల్త్

గొంతులో పేరుకున్న క‌ఫం తగ్గడానికి సూపర్ చిట్కా..!

Share

 

చాలా మందికి గొంతులో క‌ఫం పేరుకుపోయి ఒక్కోసారి ఊపిరి ఆడడం కూడా కష్టంగా అనిపిస్తుంది.గొంతులో క‌ఫం పేరుకుపోవడం అనేది పిల్ల‌లు, పెద్ద‌లుకు సర్వ సాధారణం అనే చెప్పాలి.ముఖ్యంగా వ‌ర్షాకాలంలో అయితే ఈ స‌మ‌స్య మ‌రింత తీవ్రం అవుతుంది అనే చెప్పాలి. నిజానికి ఈ వ‌ర్షాకాలంలోనే ఎక్కువగా సీజ‌న‌ల్ వ్యాధులు సంభ‌విస్తుంటాయి. అందులో గొంతులో క‌ఫం పేరుకుపోవడం అనేది కూడా ఒక స‌మ‌స్యగా చెప్పవచ్చు. గొంతులో క‌ఫం పేరుకుపోవ‌డం వ‌ల్ల ద‌గ్గు, శ్వాస స‌రిగ్గా తీసుకోలేక‌పోవ‌డం, చికాకు,ఏదైనా మింగ‌డానికి తీవ్ర‌మైన ఇబ్బంది, ఛాతినొప్పి వంటి స‌మ‌స్య‌లు వస్తాయి.

కఫం తగ్గడానికి ఇంటి చిట్కా :

మరి ఈ క‌ఫాన్ని త‌గ్గించుకోవ‌డానికి రకరకాల మందులు వాడవలిసి వస్తుంది.ఈథర్ మందులతో పని లేకుండా ఈ సింపుల్ టిప్స్ ప్ర‌య‌త్నిస్తే సుల‌భంగా మీ గొంతులోని క‌ఫాన్ని నివారించుకోవ‌చ్చు. మరి ఆ చిట్కా గురించి తెలుసుకుందాం. ఇప్పుడు చెప్పబోయే చిట్కాకు సంబందించిన అన్ని పదార్ధాలు మన వంట గదిలోనే అందుబాటులో ఉంటాయి.. ముందుగా ఐదు మిరియాలు, రెండు యాల‌కులు, చిన్న దాల్చిన చెక్క ముక్క తీసుకొని అన్నిటిని కలిపి మెత్త‌ని పొడిగా దంచుకోవాలి.

దాల్చిన చెక్క, మిరియాలు :

ఆ త‌రువాత స్ట‌వ్ మీద గిన్నె పెట్టుకుని అందులో గ్లాస్ నీళ్లు పోసి వేడి చేయాలి. వాట‌ర్ బాగా మ‌రిగిన త‌రువాత ముందు దంచి పెట్టుకున్న పొడిని వేసి మళ్ళీ ఒక 5 నిమిషాల పాటు మ‌రిగించాలి.అలా మ‌రిగించిన త‌రువాత ఆ నీటిని వడకొట్టి ఆ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె క‌లిపుకొని తాగాలి. ప్ర‌తిరోజు ఉద‌యం ఇలా ఉదయం పూట తాగడం వలన గొంతులో పేరుకు పోయిన క‌ఫం తగ్గుతుంది.ఈ పొడిలో యాంటీ బ్యాక్టిరియ‌ల్‌, యాంటి మైక్ర‌బ‌య‌ల్ వంటి ల‌క్ష‌ణాలు ఉంటాయి. కఫంతో పాటుగా దగ్గు, జ‌లుబు, గొంతునొప్పి, గొంతు ఇన్‌పెక్ష‌న్ వంటి స‌మ‌స్య‌లు కూడా తగ్గుతాయి.

 


Share

Related posts

వేడి నీళ్లు ఇలా మాత్రం అస్సలు తాగకండి !!

siddhu

Banyan Tree: మానసిక సమస్యలతో బాధపడుతున్నారా..!? ఈ చెట్టు ఆకులతో చెక్ పెట్టండి..!!

bharani jella

ఇవి తింటే ఇక మీరు మన్మథుడే…!!

Kumar