మన భారతీయ వంటకాల్లో పసుపుకు ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంది. పసుపును పురాతన కాలం నుండి వంటల్లో ఉపయోగిస్తున్నారు.మనకు ఏదన్నా గాయం. అయితే ఏదో ఒక ఆయింట్మెంట్ రాసుకుంటున్నాం కానీ పూర్వకాలంలో గాయమైనా, కాలిన గాయాలు అయినా అక్కడ పసుపు రాసుకునే వారు. ఎటువంటి గాయం అయినాసరే పసుపు రాస్తే ఇట్టే మాయమైపోవాల్సిందే.అలాగే పసుపులో విటమిన్స్,లవణాలతో పాటు శరీరారోగ్యానికి తోడ్పడే ఫైటిన్ ఫాస్ఫరస్ గూడా అధికంగానే ఉంటుంది.ఇవే కాకుండా పసుపు వలన ఇంకా చాలా రకాల ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం..
పసుపు వలన కలిగే ఉపయోగాలు :
ప్రతి రోజు ఉదయం ఒక గ్లాసు పాలలో అర టీస్పూన్ పసుపు వేసుకుని త్రాగడం వలన శరీర ఆరోగ్యంతో. పాటుగా శరీర సౌందర్యం కూడా పెరుగుతుంది. పసుపు పాలు తాగడం వల్ల క్రమంగా శరీరంలో నిల్వ ఉన్న కొవ్వు కరిగిపోతుంది.దాని వాడకంతో రక్తంలోని మలినాలు తొలగిపోయి రక్త ప్రసరణ మెరుగుపడుతుంది. అంతేగాక గుండె సమస్యలు రాకుండా పసుపు.దూరం చేస్తుంది.
అందాన్ని కాపాడంలో పసుపు పాత్ర :
పసుపు బాహ్యంగాను, అంతరంగంగాను శరీర అందానికి తోడ్పడుతుంది. చర్మాన్ని శుభ్రపరచి అందంగా కనిపించేలా చేస్తుంది. క్రీములు వాడే బదులుగా కాస్త నువ్వులనూనె, సున్నిపిండి, పసుపు కలిపి స్నానానికి ముందు శరీరానికి పట్టిస్తే మీ చర్మం మెరిసిపోతుంది..అలాగే బాదాంనూనె, మీగడ, తేనెను పసుపుతో కలిపి వంటికి రాసుకొని స్నానం చేస్తే మీ సౌందర్యం రెట్టింపు అవుతుంది.ప్రతిరోజూ ఉదయం స్నానం చేయటానికి అరగంట ముందు పసుపు ఒంటికి బాగా పట్టించి తర్వాత స్నానం చేస్తే ఆరోగ్యంతో పాటు శరీర సౌందర్యం కూడా రెట్టింపు అవుతుంది.
కాలిన గాయలకు తగ్గించడంలో :
వంటిమీద నొప్పి ఉన్నచోట, దెబ్బలు లేదా గాయాలు తగిలినచోట, వాపులవద్ద పసుపు రాస్తే ఆ గాయాలు కొన్ని రోజుల్లోనే మానిపోతాయి..నిజానికి పసుపులో యాంటీమైక్రోబయల్ గుణాలు అధిక మోతాదులో ఉన్నాయి.అందుకకె పసుపు వివిధ రకాల ఇన్ఫెక్షన్లతో పోరాడే శక్తిని కలిగి ఉంటుంది.