Growth : సూర్యోదయం తర్వాత
ఒక ఇల్లు సిరి సంపదలు ,సుఖ సంతోషాలతో ఉండాలంటే ఆ ఇంటిలో ఉండే గృహిణి దే ప్రధాన పాత్రగా చెప్పుకోవచ్చు. మన శాస్త్రాలు తెలియ చేసిన దాని ప్రకారం గృహిణులు కొన్ని నియమాలు తప్పసరిగా పాటించాలి. అవి పాటించడం వలన ఇంట్లో సుఖ శాంతులు కలుగుతాయి. ఆ నియమాలు గురించి తెలుసుకుందాం.
సూర్యోదయానికి ముందే స్త్రీ తన ఇంటిని శుభ్రం చేసుకోవాలి. సూర్యోదయం తర్వాత ఇంటిని శుభ్రం చేస్తే పేదరికానికి అది పేదరికానికి కారణం అవుతుంది.
ఇంటిని శుభ్రం చేసిన వెంటనే స్నానం చేసేయాలి తప్ప పిల్లలకు బాక్స్ లో కి వంట చేసి వారిని స్కూల్ కి పంపి నెమ్మదిగా స్నానం చేయడం వంటివి చేస్తే పేదరికంతోపాటు దు:ఖానికి కూడా కారణమవుతుంది.
Growth : జుట్టు విరబోసుకుని
కుటుంబం కోసం వంట చేయడం అంటే దేవుడికి నైవేథ్యం వండటం తో సమానం. కాబట్టి స్నానం చేసిన తర్వాత మాత్రమే వంట దగ్గరకు రావాలి.
పొద్దున్న పూజ చేసుకున్న తర్వాతే ఆహారం తీసుకోవాలి. అలా కాకుండా ముందుగా తాన తిని తర్వాత దేవుడి పూజ చేయడం మంచి పద్దతి కాదు. ఇలా చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం పొందలేరు. అంతే కాదు ఈ రోజుల్లో ఎక్కడ చుసిన జుట్టు విరబోసుకుని వంటలు ,పూజ , గుడికి వెళ్లడం వంటివి చేస్తున్నారు. వెంట్రుకలు ఆహారం లో వచ్చిన గుడిలో పడిన పూజలో ఉన్న చాలా చెడు ఫలితాల్ని పొందుతారు. కాబట్టి జుట్టును జడ లేదా ముడి వేసుకుని ఉండడం ఉత్తమం.
ఎవరైనా కోపం తో ఉన్న
సూర్యాస్తమయం తర్వాత తల దువ్వుకోవడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం ఉండదు. సాధ్యమైనంత వరకు సాయంత్రం తలదువ్వకపోవడమే అన్నిటికన్నా మంచిది. ఇంట్లో ఉండే స్త్రీ ఎప్పుడూ చిరాకు, కోపంతో ఉంటే ఆ ఇంట్లో సంతోషం అనేదే ఉండదు. చిన్న వాటికి చిరాకు పడటం, కోపగించుకోవడం చిన్న దానికి పెద్ద దానికి పిల్లల మీద ఇంట్లో పెద్దవారి మీద అరవడం కోప్పడడం ,అమంగళకర మాటలు మాట్లాడడం లాంటివి చేయకూడదు.మీరు ఓపికతో ఉండడం వలన కుటుంబంలో ప్రశాంతత వచ్చి చేరుతుంది.ఒక వేళా మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కోపం తో ఉన్న మీ ప్రసన్నం గా ఉన్న ముఖం చూసి వారు కోపం తగ్గించుకుంటారు. మీరు ఎలా ఉంటే మీ పిల్లకు కూడా అలాగే తయారవుతారు అని గుర్తు పెట్టుకోండి. వారిని ఓర్పు ఉన్నవారిగా తీర్చి దిద్దడం మీ బాధ్యత ఎందుకంటే ఓర్పు కలిగినవారు జీవితం లో ఎప్పుడు ఓటమిని చూడరు.