Today Horoscope: ఆగస్టు 18 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

Today Horoscope
Share

Today Horoscope: ఆగస్టు 18 – బుధవారం – శ్రావణమాసం

మేషం

చిన్ననాటి మిత్రులతో కలహా సూచనలున్నవి అనారోగ్యం సమస్యలు ఇబ్బంది కలిగిస్తాయి. వృథాఖర్చులు పెరుగుతాయి. విద్యార్థుల ఫలితాలు  నిరుత్సాహ పరుస్తాయి  దైవ అనుగ్రహంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. దూరప్రయాణ సూచనలున్నవి. వ్యాపార, ఉద్యోగాలలో గందరగోళ వాతావరణం ఉంటుంది.

Today Horoscope
Today Horoscope

వృషభం

చేపట్టిన పనులు వాయిదా పడతాయి. ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. రుణదాతల  నుండి ఋణ  వత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి. ఉద్యోగులకు అధికారులతో నూతన సమస్యలు కలుగుతాయి. ఆర్థికంగా నిరుత్సాహ వాతావరణం ఉంటుంది.

మిధునం

సమాజంలో పరిచయాలు పెరుగుతాయి. ప్రముఖుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. కుటుంబ సభ్యులతో  శుభకార్యాలలో పాల్గొంటారు. ఆర్ధిక వృద్ధి కలుగుతుంది. కుటుంబ విషయమై  ముఖ్య నిర్ణయాలు అమలుపరుస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం  ఉంటుంది.

కర్కాటకం

చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది నూతన ధన వస్తులాభాలు పొందుతారు. చేపట్టిన పనులలో  యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు వ్యాపారా, ఉద్యోగాలు మరింత  ఉత్సాహంగా సాగుతాయి.

సింహం

ముఖ్యమైన  పనులు మధ్యలో నిలిచిపోతాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ పెరుగుతుంది. సన్నిహితులతో tమాటపట్టింపులుంటాయి. అవసరానికి ధన సహాయం అందుతుంది. ఆరోగ్య సమస్యలు వలన చికాకులు పెరుగుతాయి  వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది.

కన్య

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. వృధా ఖర్చులు పెరుగుతాయి ఇంటా బయట  అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. పుణ్యక్షేత్రాలు  దర్శిస్తారు. ఆరోగ్య విషయాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వృత్తి, ఉద్యోగాలు నిరుత్సాహపరుస్తాయి.

తుల

బంధు మిత్రులతో సఖ్యతగా వ్యవహరిస్తారు.  విద్యార్దులు. పోటీపరీక్షల్లో విజయం సాధిస్తారు.బంధు మిత్రుల నుండి  శుభకార్య ఆహ్వానాలు అందుకుంటారు. నూతన వాహనయోగం ఉన్నది. స్థిరాస్తి వివాదాల పరిష్కార దిశగా సాగుతాయి. వ్యాపారమున కీలక  నిర్ణయాలు తీసుకుని లాభాలు ఆర్జిస్తారు.   ఉద్యోగమున  అనుకూలత పెరుగుతుంది.

వృశ్చికం

కుటుంబ సభ్యులతో వివాదాలుంటాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ముఖ్యమైన  పనులు వాయిదా వేస్తారు. ఉదర సంభందిత అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. వ్యాపారాలు నత్తనడకగా సాగుతాయి.  ఉద్యోగులు అదనపు బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహిస్తారు. ఆర్ధిక సమస్యలు బాధిస్తాయి.

ధనస్సు

నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు అందుకుంటారు. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. బంధు మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు   సమాజంలో  పెద్దల ఆదరణ పెరుగుతుంది.   నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు  ఫలిస్తాయి.  వృత్తి  ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి.

మకరం

ముఖ్యమైన  వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి వృత్తి వ్యాపారాలలో శ్రమాధిక్యత పెరుగుతుంది. ఇంటా బయట ఒత్తిడి వలన మానసిక సమస్యలు కలుగుతాయి  దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.

కుంభం

దూరపు బంధువుల నుండి  శుభవార్తలు అందుతాయి. ఆర్థిక పురోగతి సాధిస్తారు. నూతన వస్తు, వస్త్రలాభాలు పొందుతారు. చిన్ననాటి స్నేహితులతో సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. వ్యాపారాలు సజావుగా సాగుతాయి.  ఉద్యోగమున జీత భత్యాల విషయంలో అనుకూలత పెరుగుతుంది.

మీనం

చిన్ననాటి మిత్రులతో గృహమున  ఉత్సాహంగా గడుపుతారు. ఉద్యోగమున మీ పని తీరుకు  గుర్తింపు పొందుతారు. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది వ్యాపారాలు అనుకున్న విధంగా రాణిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాలు  నూతనోత్సాహంతో లాభాలు అందుకుంటారు.

 

నిత్ర రాశి ఫలాలు యాప్ సౌజన్యంతో….

 


Share

Related posts

Today Horoscope నవంబర్ 19th గురువారం రాశి ఫలాలు

Sree matha

Today Horoscope డిసెంబర్ 10th గురువారం రాశి ఫలాలు

Sree matha

Today Horoscope:  సెప్టెంబర్ 2 – శ్రావణమాసం – రోజు వారీ రాశి ఫలాలు

somaraju sharma