NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope ఏప్రిల్ 15 – చైత్రమాసం- గురువారం. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

Daily horoscope in telugu

Today Horoscope  ఏప్రిల్ 15 – చైత్రమాసం- గురువారం.

Today Horoscope మేషరాశి : ప్రయాణ ఇబ్బందులు ఏర్పడతాయి !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. నష్టం జరుగుతుంది. మీలో ఉన్న కోపం వల్ల చికాకు వల్ల అనర్ధాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు ఇబ్బందులు కలుగుతాయి. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు ఏర్పడతాయి. సోదరుల మధ్య సఖ్యత కోల్పోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. మీ మాట తీరు వల్ల అపార్ధాలు తలెత్తుతాయి.
రెమిడీః ఈరోజు దుర్గా దేవిని ఆరాధించండి.

Today Horoscope వృషభరాశి వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలుగుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనుకున్న పనులు మీలో ఉన్న బద్ధకం వల్ల వాయిదా పడతాయి. ఇబ్బందులు తలెత్తుతాయి. రుణబాధలు తొలగుతాయి. అనవసర ఖర్చులు అధికంగా చేస్తారు. ధననష్టం కలుగుతుంది. మీలో ఉన్న తొందరపాటుతనం వల్ల బంధువుల మధ్య విభేదాలు కలుగుతాయి. వివాహ ప్రయత్నాలు అనుకూలించవు. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. విద్యార్థులు తల్లిదండ్రుల మాటలను పెడచెవిన పెట్టి చదువు విషయంలో శ్రద్ధ కోల్పోతారు. వ్యాపారంలో స్వల్ప నష్టాలు కలుగుతాయి. ప్రయాణ ఇబ్బందులు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు గణేశ స్తోత్రం పారాయణం చేసుకోండి. దగ్గర్లో ఉన్న ఆలయానికి వెళ్లి గణపతి ఉండ్రాళ్ళు నివేదన సమర్పించండి.

మిధునరాశి : సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. అనుకున్న పనులను సమయానికి పూర్తిచేస్తారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు కలుగుతాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో విజయం పొందుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు పొందుతారు. గతంలో పోగొట్టుకున్న డబ్బును ఉద్యోగాన్ని తిరిగి పొందుతారు. కుటుంబ సభ్యులతో స్నేహితులతో అందరితో సఖ్యతగా ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శివపంచాక్షరీ స్తోత్రం పారాయణం చేసుకోండి.

కర్కాటకరాశి : వాహనాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో బాగుంటుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. వ్యాపారాల్లో ఊహించని ధన లాభాలు వస్తాయి. విద్యార్థులు పెద్ద వారి మాటను గౌరవించి కష్టపడి చదువుకుంటారు. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

Daily horoscope in telugu
Daily horoscope in telugu

సింహరాశి : పెట్టుబడులు అనుకూలించవు !

ఈరోజు ప్రయోజనకరంగా లేదు. ఉద్యోగస్తులకు కార్యాలయంలో తోటి ఉద్యోగుల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించవు. విద్యార్థులు ఒత్తిడికి లోనై చదువు విషయంలో ఆ శ్రద్ధ గా ఉంటారు. ప్రయాణ ఇబ్బందులు ఏర్పడతాయి. ప్రోత్సహించడం వల్ల సమస్యలు ఎదురవుతాయి. పిల్లల విషయంలో శ్రద్ధ లేకపోవడం వల్ల ఇబ్బందులు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని ఆరాధించండి.

కన్యారాశి : రుణ బాధలు పెరుగుతాయి !

ఈరోజు సంతోషకరం కాలేదు. విలువైన పత్రాల మీద సంతకాలు చేయడం వల్ల నష్టపోతారు. అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత వహించడం మంచిది. వ్యాపార విస్తరణ వల్ల స్వల్ప నష్టాలు కలుగుతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి. వాహన ప్రయాణాలు అశ్రద్ధ వల్ల ప్రమాదాలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు గురు దత్తాత్రేయ స్వామిని ఆరాధించండి.

తులారాశి : ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది !

రోజు బాగుంటుంది. ఉన్నత వ్యక్తుల పరిచయాలు ఏర్పడతాయి. తెలియని కొత్త కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆసక్తి చూపుతారు. సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందుతారు. ప్రయాణ సౌఖ్యం కలుగుతుంది. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. పోటీ పరీక్షల్లో ఉత్తమ ర్యాంకులు పొందుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పదోన్నతులు పొందుతారు. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఇంట్లో ఏదో ఒక వేడుకను జరుపుకుంటారు.
రెమిడీః ఈరోజు కామాక్షి అమ్మవారిని ఆరాధించండి.

వృశ్చికరాశి : స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. ఆకస్మిక ధన యోగం కలుగుతుంది. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అధిక లాభాలు కలుగుతాయి. తాత్కాలిక ఉద్యోగం పర్మినెంట్ అవుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. స్వర్ణాభరణాలు కొనుగోలు చేస్తారు. స్థిరాస్తులను కొనుగోలు చేస్తారు. చేపట్టిన పనులను సరైన సమయానికి పూర్తి చేస్తారు. సోదరులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

ధనస్సురాశి : చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు !

ఈరోజు ప్రతికూల పరిస్థితులు ఏర్పడతాయి. వ్యాపారాలు అధిక శ్రమ వల్ల స్వల్ప లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ఇంక్రిమెంట్ పొందుతారు. విద్యార్థులకు అధిక శ్రమ వల్ల విద్యా లాభం కలుగుతుంది. ప్రయాణ ఇబ్బందులు ఏర్పడతాయి. రుణాలు ఇవ్వడం తీసుకోవడం వల్ల నష్టపోతారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం చేసుకోండి.

మకర రాశి : ధననష్టం కలుగుతుంది !

ఈరోజు అనుకూలంగా లేదు. విద్యార్థులకు విద్యా నష్టం కలుగుతుంది. వ్యాపారాల్లో అనుకోని ధననష్టం కలుగుతుంది. సమాజములో గౌరవ మర్యాదలను కోల్పోతారు. సోదరుల మధ్య సఖ్యత లోపిస్తుంది. స్థిరాస్తులు అనుకూలించవు. పిల్లల విషయంలో శ్రద్ధ కోల్పోతారు. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ దక్షిణామూర్తి స్వామిని ఆరాధించండి.

కుంభరాశి : స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు !

ఈ రోజు బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అయినా వారితో స్నేహితులతో కలిసిమెలిసి ఆనందంగా ఉంటారు. ఆచార సాంప్రదాయాలకు ప్రాధాన్యతనిస్తారు. పెద్దవారిని గౌరవిస్తారు. వారి మాటలను సూచనలను పాటిస్తారు. ముఖ్యమైన విషయాల్లో తొందరపడకుండా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. ఉత్తమ కళాశాలల్లో ప్రవేశాలు పొందుతారు. వ్యాపార భాగస్వాములు అధిక లాభాలు కలుగుతాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో పై అధికారుల మన్ననలు పొందుతారు. ప్రయాణ లాభాలు కలుగుతాయి. విహార యాత్రలు చేస్తారు. స్త్రీలు పుట్టింటి నుంచి శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈ రోజు శ్రీ లలితా చాలీసా పారాయణం చేసుకోండి.

మీనరాశి : ఈరోజు శుభయోగంగా ఉంటుంది !

ఈరోజు శుభయోగంగా ఉంటుంది. సోదరులతో సఖ్యతగా సంతోషంగా ఉంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. వివాహ నిశ్చయ తాంబూలాలు అనుకూలిస్తాయి. పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకుంటారు. శుభవార్తలు వింటారు. ఉన్నత వ్యక్తుల పరిచయాలు సంతోషాన్ని కలిగిస్తాయి. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు. వ్యాపారాల్లో నూతన పెట్టుబడులు అనుకూలిస్తాయి. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు.
రెమిడీః ఈరోజు విష్ణు సహస్ర నామ పారాయణం చేయండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju