NewsOrbit
Featured Horoscope దైవం

Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.బాధలు తీరిపోతాయి !

Today Horoscope డిసెంబర్ 6 ఆదివారం రాశి ఫలాలు

Today Horoscope మార్చి – 30 – ఫాల్గుణ మాసం – మంగళవారం.

మేష రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.బాధలు తీరిపోతాయి !

ఈరోజు బాగుంటుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి కష్టపడి పూర్తి చేస్తారు. గతంలో విడిపోయిన దంపతులు తిరిగి కలుసుకొని అన్యోన్యంగా ఉంటారు. విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పిన మాటలు ఆచరణలో పెట్టి కష్టపడి చదువుకుంటారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో అనుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. పెట్టుబడులు అనుకూలిస్తాయి. రుణ బాధలు తీరిపోతాయి. శుభవార్తలు వింటారు.
రెమిడీః ఈరోజు శివాష్టోత్తర శతనామ స్తోత్రం పారాయణం చేసుకోంది.

వృషభ రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ఇంతకుముందు చేసిన తప్పులను తిరిగి చేయకుండా జాగ్రత్త పడతారు. ఎదుటి వారికి సహాయం చేయాలనే గుణం కలిగి ఉంటారు. దంపతులిద్దరూ అన్యోన్యంగా ఉంటారు. ఇంతకుముందు విడిపోయిన స్నేహితులు తిరిగి కలుసుకుంటారు. విద్యార్థులు కొత్త కొత్త ప్రయోగాలు చేస్తారు. వ్యాపారాల్లో శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. ఆభరణాలను కొనుగోలు చేస్తారు.
రెమిడీః శ్రీ రాజరాజేశ్వరి అష్టకం పారాయణం చేసుకోండి.

మిధున రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.వ్యాపారాల్లో ఆటంకాలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. కుటుంబంలో విభేదాలు. మీరు మంచిగా మాట్లాడిన ఎదుటివారు అపార్థం చేసుకుంటారు. అనవసరపు విషయాలను చర్చించడం వల్ల వాదోపవాదాలు. విద్యార్థులు సమయాన్ని వృధా చేసి చదువు మీద ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో ఆటంకాలు ఎదురైనా స్వల్ప నష్టాలు కలుగుతాయి.
రెమిడీః ఈరోజు హనుమాన్ చాలీసా పారాయణం చేసుకోండి.

కర్కాటక రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.ఈరోజు ఇబ్బందులు ఎదురవుతాయి !

ఈరోజు అనుకూలంగా లేదు. అనుకోని ఇబ్బందులు. మానసిక ప్రశాంతత కోల్పోతారు. మీలో ఉన్న కోపం వల్ల, చికాకు వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. అనవసర ఖర్చులు అధికమవుతాయి. ధననష్టం కలుగుతుంది. పనులు వాయిదా పడతాయి. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించక అనుకోని ఇబ్బందులు ఎదురవుతాయి.
రెమిడీః ఈరోజు శ్రీ వేంకటేశ్వర వజ్ర కవచం పారాయణం చేసుకోండి.

today horoscope in telugu march 30
today horoscope in telugu march 30

సింహరాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.కార్యాలయాలో ఒత్తిడి !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. శ్రమకు తగ్గ ఫలితం లేకపోవడం వల్ల ఆందోళన పడతారు. ప్రయాణ అనుకూలత కోల్పోతారు. వ్యసనాలకు దూరంగా ఉండండి. కార్యాలయాలో పై అధికారుల ఒత్తిడి ఏర్పడుతుంది. వ్యాపారాల్లో పెట్టుబడులు అనుకూలించక నష్టం కలుగుతుంది. ఆరోగ్య సమస్యలు. స్థిరాస్తులు అనుకూలించవు.
రెమిడీః ఈరోజు శ్రీ రామరక్షా స్తోత్ర పారాయణం చేసుకోండి.

కన్యారాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.తోటి ఉద్యోగులతో ఇబ్బందులు !

ఈరోజు సంతోషకరంగా లేదు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. స్నేహితులు కూడా శత్రువులు అవుతారు. తొందరపాటు తనం వల్ల ప్రశాంతత కోల్పోతారు. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో తోటి ఉద్యోగులతో ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపార భాగస్వాముల వల్ల స్వల్ప నష్టాలు. విద్యార్థులు అనవసర విషయాలను పట్టించుకోని చదువును నిర్లక్ష్యం చేస్తారు.
రెమిడీః ఈరోజు శ్రీ లక్ష్మీ నరసింహ కరావలంబ స్తోత్ర పారాయణం చేసుకోండి.

తులారాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.కార్యాలయాల్లో ప్రమోషన్లు !

ఈ రోజు బాగుంటుంది. రుణ బాధలు తగ్గిపోతాయి. మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. ధన లాభం కలుగుతుంది. నూతన గృహాన్ని కొనుగోలు చేస్తారు. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో ఆనందంగా ఉంటారు. నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు పొందుతారు. విద్యార్థులు కష్టపడి చదువుకుని పోటీపరీక్షల్లో విజయం పొందుతారు. ఉద్యోగస్తుల కార్యాలయాల్లో ప్రమోషన్లు పొందుతారు. వ్యాపార విస్తరణ వల్ల అధిక లాభాలు.
రెమిడీః ఈరోజు కనకధారా స్తోత్ర పారాయణం చేసుకోండి.

వృశ్చిక రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.అనారోగ్య సమస్యలు !

ఈరోజు ఇబ్బందికరంగా ఉంటుంది. సమస్యలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు అధికమవుతాయి. సమయానికి చేతికి డబ్బులు అందక ధననష్టం కలుగుతుంది. అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. ప్రయాణ ఇబ్బందులు. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ కోల్పోతారు. ఉద్యోగస్తులు పని మీద ఆసక్తి లేక ప్రశాంతత కోల్పోతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు. అనవసరపు ఖర్చులను అధికంగా చేస్తారు.
రెమిడీః ఈరోజు భగవద్గీత పారాయణం చేసుకోండి.

ధనస్సు రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.ఆటంకాలు తొలగిపోతాయి !

ఈరోజు సంతోషకరంగా ఉంటుంది. ప్రశాంతత కలిగి ఉంటారు. రావలసిన మొండి బకాయిలను వసూలు చేసుకుంటారు. రుణ బాధలు తగ్గిపోతాయి. ధన లాభం కలుగుతుంది. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు. సాంకేతిక విద్య మీద ఆసక్తి చూపుతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో సమయపాలన పాటించి పై అధికారుల మన్ననలు పొందుతారు. వ్యాపారాల్లో ఆటంకాలు తొలగిపోతాయి. మీ మాట తీరు వల్ల అందరూ మిమ్మల్ని ఆకట్టుకుంటారు. స్థిరాస్తులు అనుకూలిస్తాయి.
రెమిడీః షట్పది స్తోత్రం పారాయణం చేసుకోండి.

మకర రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.ఉద్యోగస్తులకు ఇబ్బందులు !

ఈరోజు అనుకూలంగా లేదు. ప్రశాంతత కోల్పోతారు. విద్యార్థులు చదువు విషయంలో ఆశ్రద్ధ చూపుతారు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు ఏర్పడతాయి. ఉద్యోగస్తులకు కార్యాలయాల్లో అనుకోని ఇబ్బందులు. స్త్రీలు విలువైన వస్తువులను పోగొట్టుకుంటారు. చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఏర్పడతాయి. వ్యసనాలకు దూరంగా ఉండండి.

రెమిడీః ఈరోజు దుర్గాదేవిని ఆరాధించండి.

కుంభరాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.ఆరోగ్యంగా ఉంటారు !

ఈ రోజు ఆనందకరంగా ఉంటుంది. కుటుంబంలో సమస్యలను తగ్గించుకొని అందరితో సఖ్యతగా ఉంటారు. విద్యార్థులు కష్టపడి చదువుకుంటారు, క్రొత్త క్రొత్త ప్రాజెక్టు వర్కులు చేపడతారు. ఉద్యోగస్తులు కార్యాలయాల్లో కోరుకున్న స్థానాలకు బదిలీ అవుతారు. నూతన వ్యాపారాలు అనుకూలిస్తాయి. నూతన గృహాలను కొనుగోలు చేస్తారు. శుభవార్తలు వింటారు. ఇంతకుముందు ఉన్న అనారోగ్యాన్ని తగ్గించుకొని ఆరోగ్యంగా ఉంటారు.
రెమిడీః మణిద్వీప వర్ణన పారాయణం చేసుకోండి.

మీన రాశి Today Horoscope మార్చి-30- పాల్గుణ మాసం –మంగళవారం.రుణ బాధలు !

ఈరోజు ప్రయోజకరంగా లేదు. మీలో ఉన్న చికాకు వల్ల, తొందరపాటు తనం వల్ల మీకు సహాయం చేసేవారు దూరమవుతారు. విద్యార్థులు చదువు విషయంలో ఏకాగ్రత కోల్పోతారు. వ్యాపారాల్లో అనుకోని ఆటంకాలు. రుణ బాధలు పెరుగుతాయి. ధననష్టం కలుగుతుంది. క్రయ విక్రయాలు అనుకూలించవు.
రెమిడీః ఈరోజు శ్రీ కృష్ణాష్టకం పారాయణం చేసుకోండి.

author avatar
Sree matha

Related posts

April 26: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 26 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 25: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 25 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 24: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 24 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 23: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 23 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 22: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 22 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 21: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 21 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 20: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 20 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 19: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 19 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 18: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 18 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 17: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 17 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 16: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 16 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 15: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 15 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 14: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 14 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 13 : ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 13 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju

April 12: ఈ రోజు మీ రాశిచక్రం లో ఏముందో? ఏప్రిల్ 12 చైత్ర మాసం – రోజు వారి రాశి ఫలాలు!

sharma somaraju