NewsOrbit
జాతీయం ట్రెండింగ్ ప్ర‌పంచం రాజ‌కీయాలు

afghanistan: ఆప్ఘ‌నిస్తాన్ అధ్య‌క్షుడిగా మ‌ళ్లీ ఘ‌నీ… అస‌లు ట్విస్ట్ ఏంటంటే..

afghanistan: ఆప్ఘ‌నిస్తాన్ ఇప్పుడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. తాలిబన్లు ఆఫ్ఘనిస్తాన్‌ను ఆక్రమించుకోవడంతో ఆ దేశాధ్యక్షుడు అష్రఫ్ ఘనీ రాజీనామా చేసి దేశం విడిచి పారిపోయాడు. ఇప్పటికే తాలిబన్లు దేశాన్ని పూర్తిగా తమ కంట్రోల్ లోకి తెచ్చుకున్నారు. ఎలాంటి హింసకు తావు లేకుండానే దేశంలో శాంతియుతంగా అధికార బదిలీ చేస్తామని ఆఫ్ఘనిస్తాన్ అంతర్గత మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి కొత్త అధ్యక్షుడు ఎవరనే అంశంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది.
శ్రీ‌ధ‌ర్ అన్న డ‌బ్బులు వేస్తే నీకు పంపించే అకౌంట్ ఏమైనా ఉందా అన‌డం వేరు.

Read More: America :ఇండియ‌న్ల‌కు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పిన అమెరికా కొత్త అధ్య‌క్షుడు


పాత ఘ‌నీ బ‌దులు కొత్త ఘ‌నీ….
తాలిబన్లు ఆక్రమించుకోవడంతో ఆ దేశ నూతన అధ్యక్షుడిగా తాలిబన్ కమాండ్ ముల్లా అబ్ధుల్ ఘనీ బరాదార్ అనే మరో ఘనీకి ఆఫ్ఘన్ అధ్యక్ష బాధ్యతలు అప్పగించనున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అబ్దుల్‌ ఘనీ.. ఆఫ్ఘన్‌ ముజాహిద్‌ కమాండర్‌ ముల్లా ఉమర్‌తో కలిసి గతంలో తాలిబన్‌ సంస్థకు నాయకుడిగా పనిచేశారు. తాలిబన్లు పాలించిన సమయంలో రెండు రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించిన అనుభవం కూడా ఆయనకు ఉంది. తాలిబన్లే దేశాన్ని పాలించనున్న క్రమంలో అధ్యక్ష బాధ్యతలు ఆయనకే అప్పగించే ఆలోచనలో ఉన్నారు. 2010లో పాకిస్తాన్‌ ఇంటర్‌ సర్వీసెస్‌ ఇంటెలిజెన్స్‌ (ఐఎస్ఐ), సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఏజెన్సీ అధికారులు ఘనీని అరెస్ట్‌ చేశారు. తిరిగి 2018 అక్టోబర్‌ 24 వరకు పాక్‌ జైలులో శిక్షను అనుభవించారు. ఆ తర్వాత అమెరికా విజ్ఞప్తి మేరకు జైలునుంచి విడుదలయ్యారు.

Read More: Modi : వాళ్ల ఓట్ల కోసం భ‌లే స్కెచ్చేసిన మోడీ

తాలీబ‌న్లు చెప్పేది ఇదే…
తాలిబన్లు మాత్రం విదేశీయులకు ఎలాంటి హాని తలపెట్టమని, వారు భయపడాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఆఫ్ఘన్‌లో ఉన్న విదేశీయులు రిజిష్టర్‌ చేసుకోవాలని, వారు ఎప్పుడైనా స్వదేశానికి వెళ్లొచ్చని హామీ ఇచ్చారు. కాగా ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో దాదాపు 1500 మంది భారతీయులున్నారు. వారంతా తిరిగి ఇండియాకు వచ్చేయాలని విదేశాంగశాఖ ఇప్పటికే అడ్వైజరీ జారీ చేసింది. ఈ పరిస్థితుల్లో ఆ దేశానికి కొత్త అధ్యక్షుడిగా ఎన్నిక కాబోతున్న ఘనీ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాడో మ‌రి.

 

Related posts

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju

పవన్ కళ్యాణ్‌కు ఓటు వేయకండి… వ‌ర్మ ఇచ్చిన షాకింగ్ ట్విస్ట్‌..!

తీన్మార్ మల్లన్న Vs రాకేష్‌రెడ్డి… ఈ సారైనా మ‌ల్ల‌న్న ఎమ్మెల్సీ అయ్యేనా ?

స‌త్తెన‌ప‌ల్లిలో వైసీపీ అంబ‌టి అవుటైపోయాడా… క‌న్నా చేతిలో క్లీన్‌బౌల్డ్‌..?

ఉద‌య‌గిరిలో ‘ కాక‌ర్ల సురేష్‌ ‘ జోరు… మేక‌పాటి బేజారేనా ?