NewsOrbit
జాతీయం టెక్నాలజీ న్యూస్ ప్ర‌పంచం హెల్త్

Corona: క‌రోనా డెల్టా వేరియంట్ ఎంత డేంజ‌ర్ అంటే…

Corona:  క‌రోనా క‌ల‌క‌లంలో తాజాగా డెల్టా వేరియంట్ క‌ల‌క‌లం కొన‌సాగుతోంది. ప్ర‌పంచవ్యాప్తంగా డెల్టా వేరియంట్ ద‌డ పుట్టిస్తోంది.
డెల్టా వేరియంట్ సోకిన వారిలో ఇత‌ర కేసుల‌తో పోలిస్తే వైర‌ల్ లోడ్ అధికంగా ఉన్న‌ట్లు తేలింది. అయితే, ఈ మ‌హ‌మ్మారి విష‌యంలో ఓ సంచ‌ల‌న వార్త వెలుగులోకి వ‌చ్చింది. డెల్టా వైర‌స్ వేరియంట్‌.. చికెన్ పాక్స్ క‌న్నా ప్ర‌మాద‌క‌ర‌మ‌ట‌. అమెరికాకు చెందిన అంటువ్యాధుల సంస్థ (CDC, సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్‌) తాజాగా ఈ సంచ‌ల‌న విష‌యాన్ని చెప్పింది.

Read More : Corona: క‌రోనా థ‌ర్డ్ వేవ్ పై సంచ‌ల‌న వార్నింగ్‌.. ముప్పు త‌ప్ప‌దా?


ఒక్క‌రోజే భారీగా కేసులు…
క‌రోనా వైర‌స్‌కు చెందిన డెల్టా వేరియంట్ చాలా ప్ర‌మాద‌క‌ర‌రీతిలో విస్త‌రిస్తోంద‌ని సీడీసీ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ రొచెల్లి వాలెన్స్కీవివ‌రించారు. వ్యాక్సిన్ల ర‌క్ష‌ణ వ‌ల‌యాన్ని కూడా అది చేధించ‌గ‌ల‌ద‌ని, దాని ద్వారా మ‌రింత విధ్వంస‌క‌ర‌మైన వ్యాధి సోకే ప్ర‌మాదం ఉన్న‌ట్లు వెల్ల‌డించారు. అమెరికాలో గురువారం ఒక్క‌రోజే కొత్త‌గా 71వేల పాజిటివ్ కేసులు బ‌య‌ట‌ప‌డ్డాయి. డెల్టా వేరియంట్ కేసుల‌కు సంబంధించిన కొత్త డేటా ఇప్పుడిప్పుడే వ‌స్తోంద‌ని, కానీ ఆ డేటాలో ఉన్న అంశాలు క‌ల‌వ‌ర‌పెడుతున్నాయ‌ని సీడీసీ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు. వ్యాక్సిన్ తీసుకున్న వారికి డెల్టా వేరియంట్ సోకితే, అలాంటివారి ముక్కు, గొంతులో ఎంత వైర‌స్ ఉంటుందో.. వ్యాక్సిన్ తీసుకోనివారిలో కూడా అంతే వైర‌ల్ లోడ్ ఉంటుంద‌ని డాక్ట‌ర్ రొచెల్లి తెలిపారు.

Read More : Corona: షాక్ః మ‌ళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు… మ‌న సంగ‌తి ఏందంటే…

ప‌ది రెట్లు ఎక్కువ‌….
ఆల్ఫా వేరియంట్ సోకిన వారు గాలిలోకి వ‌దిలే వైర‌స్ లోడ్ క‌న్నా.. డెల్టా వేరియంట్‌తో గాలిలోకి విడుద‌ల‌య్యే వైర‌ల్ లోడ్ ప‌ది రేట్లు ఎక్కువ‌గా ఉన్న‌ట్లు సీడీసీ డైర‌క్ట‌ర్ డాక్ట‌ర్ రొచెల్లి వాలెన్స్కీ తెలిపారు. మెర్స్‌, సార్స్‌, ఎబోలా, కామ‌న్ కోల్డ్‌, సీజ‌న‌ల్ ఫ్లూ, స్మాల్ పాక్స్ వైర‌స్‌ల క‌న్నా డెల్టా వేరియంట్ వేగంగా విస్త‌రిస్తుంద‌ని ఆమె వెల్ల‌డించారు. అయితే డెల్టా వేరియంట్ అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన చికెన్‌పాక్స్ వ్యాధి క‌న్నా ఎక్కువ స్థాయిలో వ్యాప్తి చెందే అవ‌కాశాలు ఉన్న‌ట్లు తెలిపారు. కొత్త డేటా ప్ర‌కారం వ్యాక్సిన్ తీసుకున్న‌వారి వ‌ల్ల వైర‌స్ వ్యాప్తి అవుతున్న‌ట్లు తేలింది. ఈ డేటా ఆధారంగానే మాస్క్ పెట్టుకోవాల‌ని మ‌ళ్లీ ఆదేశాలు జారీ చేసిన‌ట్లు సీడీసీ డైరెక్ట‌ర్ పేర్కొన్నారు.

author avatar
sridhar

Related posts

YSRCP: చంద్రబాబుకు ఈసీ నోటీసులు .. 24 గంటల్లో అవి తొలగించాలి

sharma somaraju

YS Jagan: వైసీపీ ఎన్నికల ప్రచారం .. జనంలోకి జగన్ .. 21 రోజుల పాటు బస్సు యాత్ర  

sharma somaraju

RS Praveen Kumar: బీఆర్ఎస్ కు కాస్త ఊరట .. గులాబీ కండువా కప్పుకున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్

sharma somaraju

MLC Kavitha: కవితను అందుకే అరెస్టు చేశాం .. అధికారికంగా ఈడీ ప్రకటన

sharma somaraju

Manisha Koirala: పెళ్లైన మూడేళ్ల‌కే విడాకులు.. భ‌ర్త నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌పెడుతూ తొలిసారి నోరు విప్పిన మనీషా కోయిరాలా!

kavya N

Amritha Aiyer: హ‌నుమాన్ వంటి బిగ్ హిట్ ప‌డినా క‌లిసిరాని అదృష్టం.. అమృత ద‌శ తిరిగేదెప్పుడు..?

kavya N

Prabhas: పాన్ ఇండియా స్టార్ కాక‌ముందే బాలీవుడ్ లో ప్ర‌భాస్ న‌టించిన సినిమా ఏదో తెలుసా?

kavya N

మ‌హాసేన రాజేష్‌కు మైండ్ బ్లాక్ అయ్యేలా స్కెచ్ వేసిన చంద్ర‌బాబు – ప‌వ‌న్‌…!

పైకి పొత్తులు – లోపల కత్తులు.. బీజేపీ గేమ్‌తో చంద్ర‌బాబు విల‌విలా…!

మ‌రో మ‌హిళా డాక్ట‌ర్‌కు ఎమ్మెల్యే సీటు ఫిక్స్ చేసిన చంద్ర‌బాబు…?

Hanuman: హనుమాన్ మ్యూజిక్ డైరెక్టర్ కి కీరవాణి ఆవహించాడా? ఓటీటీ లో చూస్తూ పాటలు వింటుంటే బాహుబలి, ఆర్ఆర్ఆర్ పాటలు విన్నట్టే ఉంటుంది!

kavya N

BRS: దానంపై అనర్హత వేటు వేయండి ..స్పీకర్ కు బీఆర్ఎస్ ఫిర్యాదు

sharma somaraju

సికింద్రాబాద్‌లో ఈ సారి కిష‌న్‌రెడ్డి గెల‌వ‌డా… ఈ లాజిక్ నిజ‌మే…!

ష‌ర్మిల పోటీ ఎక్క‌డో తెలిసిపోయింది.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ట్విస్ట్ ఇచ్చిందిగా…!

PM Modi: రాహుల్ గాంధీ ‘శక్తి’ వ్యాఖ్యలపై మోడీ కౌంటర్ ఇలా .. ‘శక్తి ఆశీర్వాదం ఎవరికి ఉందో జూన్ నాలుగో తేదీ తెలుస్తుంది’  

sharma somaraju