Presidential Poll: ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా ద్రౌపది ముర్మును బీజేపీ పార్లమెంటరీ బోర్డు ఎంపిక చేసింది. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక కోసం కొద్దిసేపటి క్రితం బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశం అయ్యింది. బీజేపీ పార్లమెంటరీ బోర్డులో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా, ప్రధాన మంత్రి మోడీ, కేంద్ర మంత్రులు, అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్, నితిన్ గడ్కరీ, మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్, పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బియల్ సంతోష్ సభ్యులుగా ఉన్నారు. పార్లమెంటరీ బోర్డులో రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపికపై మొత్తం 20 పేర్లపై విస్తృతంగా చర్చ జరిగినట్లు సమాచారం. ఒడిషా లోని మయుర్బంజ్ జిల్లాకు చెందిన ద్రౌపది ముర్మును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఎన్జీఏ రాష్ట్రపతి అభ్యర్ధిగా తూర్పు ప్రాంతానికి చెందిన గిరిజన మహిళ ఉంటే బాగుంటుందని భావించామని సమావేశం అనంతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపి నడ్డా తెలిపారు. ద్రౌపది ముర్ము విశేష ప్రతిభాశాలి అని, వివాదరహితురాలని నడ్డా చెప్పారు.
ద్రౌపది ముర్ము 2015 నుండి 2021 వరకూ జార్ఖండ్ గవర్నర్ గా బాధ్యతలు నిర్వహించారు. రాజకీయాల్లోకి రాకముందు ఒడిసా ఇరిగేషన్ డిపార్ట్ మెంట్ లో జూనియర్ అసిస్టెంట్ గా, ఆ తరువాత అరబిందో ఇంటిగ్రల్ ఎడ్యుకేషన్ సెంటర్ (రైరంగ్‌పూర్) అసిస్టెంట్ టీచర్ గా పని చేశారు. ఆ తరువాత రాజకీయాల్లోకి వచ్చారు. 1997లో రైరంగపూర్ మున్సిపల్ కౌన్సిలర్ గా, వైస్ చైర్ పర్సన్ గా ఎన్నికైయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలిగా బాధ్యతలు నిర్వహించారు. రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా, మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 2007 లో బెస్ట్ ఎమ్మెల్యే అవార్డు అందుకున్నారు. బీజేపీ ఎస్టీ మోర్చాలో జిల్లా స్థాయి నుండి రాష్ట్ర అధ్యక్షురాలిగా, జాతీయ కౌన్సిల్ మెంబర్ గా పని చేశారు.
ఇక విపక్షాల ఉమ్మడి అభ్యర్ధిగా సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ప్రకటించారు. శరద్ పవార్ నేతృత్వంలో ఈ రోజు జరిగిన విపక్ష పార్టీల నేతల సమావేశంలో యశ్వంత్ సిన్హా పేరును ఖరారు చేశారు. ఈ నేపథ్యంలో ఆయన టీఎంసీ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. ఈ నెల 27న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా రాష్ట్పతి ఎన్నికకు నామినేషన్ వేయనున్నట్లు శరద్ పవార్ తెలిపారు.
Ravi Teja: మాస్ మహారాజా రవితేజ హీరోగా వస్తున్న యాక్షన్ థ్రిల్లర్ రామారావు ఆన్ డ్యూటీ. ఈ మూవీ జూలై…
Rakul Preet Singh: ప్రముఖ సినీ నటి రకుల్ ప్రీత్ సింగ్ తెలుగులో సినిమాలు నటించడం చాలావరకు తగ్గించింది. బాలీవుడ్పైనే…
Dil Raju: టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ నిర్మాతలలో దిల్ రాజు(Dil Raju) ఒకరు. తన బ్యానర్ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్…
Today Horoscope: జూలై 5 - అషాడమాసం - మంగళవారం మేషం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. చిన్ననాటి మిత్రులతో…
Samantha Tapsee: హీరోయిన్ తాప్సి(Tapsee) అందరికీ సుపరిచితురాలే. దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు(Raghavendra Rao) దర్శకత్వంలో మంచు మనోజ్(Manoj) హీరోగా నటించిన "ఝుమ్మంది…
God Father: మలయాళంలో మోహన్ లాల్(Mohan Lal) ప్రధాన పాత్రలో నటించిన "లూసిఫర్"(Lucifer) తెలుగులో "గాడ్ ఫాదర్"(God Father)గా తెరకెక్కుతోంది.…