NDA Meeting: దేశ రాజధాని ఢిల్లీలో ఈ నెల 18న ఎన్డీఏ కూటమి కీలక సమావేశం నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి పలు పార్టీలకు ఆహ్వానాలు పంపించినట్లు తెలుస్తొంది. అలానే ఏ కూటమికి చెందని మరి కొన్ని పార్టీలను ఎన్డీఏ సమావేశానికి ఆహ్వానిస్తున్నట్లు సమాచారం. దక్షిణాది రాష్ట్రాల్లోని పలు పార్టీలతో పొత్తుల కోసం బీజేపీ ప్రయత్నాలు చేస్తుంది. ఏపికి చెందిన అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ ఇప్పటి వరకూ ఏ కూటమిలో లేకపోయినా కేంద్రంలోని బీజేపీకి అనధికార మిత్రపక్షంగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో తొలుత ఎన్డీఏ చేరాలంటూ వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్ ను ఆహ్వానించగా, నేరుగా ఎన్డీఏలో చేరడానికి అంగీకరించలేదనీ, కాకపోతే బయట ఉండే సహకరిస్తామని చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ తరుణంలో కొద్ది రోజుల క్రితం ఓ జాతీయ న్యూస్ ఛానల్ తో టీడీపీ అధినేత చంద్రబాబు మాట్లాడుతూ మరల ఎన్డీఏ తో కలవడానికి అభ్యంతరం లేదంటూ చెప్పారు. ఆ తర్వాత ఢిల్లీలో అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు సమావేశమైయ్యారు.

ఈ నేపథ్యంలో కర్ణాటక కు చెందిన జేడీఎస్, ఏపికి చెందిన టీడీపీతో పొత్తులుంటాయని రాజకీయ వర్గాల్లో చర్చ కొనసాగుతోంది. టీడీపీతో పాటు లోక్ జనశక్తి (చిరాగ్ పాశ్వాన్)పార్టీ, శిరోమణి అకాళీదళ్ సహా మరికొన్ని పార్టీలకు అహ్వానం అందినట్లుగా జాతీయ మీడియాలో కథనాలు ప్రసారమవుతున్నాయి. ఈ నెల 18న ఢిల్లోని అశోకా హోటల్ లో ఈ కీలక సమావేశం జరగబోతున్నది. నితీష్ కుమార్ నేతృత్వంలో ప్రతిపక్షాల ఐక్యతకు సమావేశాలు అవుతున్న నేపథ్యంలో లోక్ సభ ఎన్నికలు, పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీజేపీ అగ్రనేతలు వ్యూహాత్మకంగా ముందుకు వెళుతున్నట్లుగా తెలుస్తొంది. ప్రతిపక్షాల ఐక్యతకు విరుగుడుగా 18న ఎన్జీయే బలప్రదర్శనకు సిద్దమవుతోంది.
మోదీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటి వరకూ ఒక్కసారి కూడా ఎన్డీఏ సమావేశం జరగలేదు. ప్రతిపక్షాల ఐక్యతకు నితీష్ కుమార్ కూడగడుతున్న వేళ మోడీ, షా ద్వయం ఈ కీలక భేటికి సన్నద్దం అవుతున్నారు. ఇప్పటికే పలు రాష్ట్రాల పార్టీల అధ్యక్షులను మార్చిన బీజేపీ పెద్దలు..రెండు మూడు రోజుల్లో కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ చేయనుంది. ఈ కీలక సమావేశానికి ముందే మార్పులు, చేర్పులు జరగాలని.. వీలైతే కొత్తగా ఎన్డీఏ లో చేరే ఒకటి రెండు పార్టీలకు కూడా కేంద్ర కేబినెట్ లో చోటు కల్పించే చాన్స్ కూడా ఉందని అంటున్నారు. అయితే 18న జరగనున్న ఎన్డీఏ కీలక భేటీకి ఎన్ని పార్టీలు హజరవుతాయి.. ఇంకా ఎవరెవరితో బీజేపీ అగ్రనాయకత్వం సంప్రదింపులు జరుపుతోంది అనే విషయాలు తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.
ఏపీ సీఎం వైఎస్ జగన్ ను కలిసిన తెలంగాణ కాంగ్రెస్ నేత..కారణం ఏమిటంటే..?