NewOrbit
జాతీయం

National Education Day: నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి.. దేశవ్యాప్తంగా జాతీయ దినోత్సవ కార్యక్రమాలు..!!

Share

National Education Day: స్వాతంత్ర సమరయోధుడు, బహుభాషా ప్రవీణుడు, మానవతావాది, భారత దేశ తొలి విద్య మంత్రి భారతరత్న డాక్టర్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి నేడు. ఈ సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11వ తారీఖున దేశవ్యాప్తంగా జాతీయ విద్యా దినోత్సవం జరుపుతారు. 2008 సెప్టెంబర్ 11న కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ మౌలానా జయంతిని “జాతీయ విద్యా దినోత్సవంగా” ప్రకటించడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన అనంతరం 1947 నుంచి 1958 వరకు దేశానికి మొదట విద్యాశాఖ మంత్రిగా.. రెండు పర్యాయాలు పనిచేసి ఆజాద్ సమర్థంగా తన బాధ్యతలు నిర్వహించారు. అంతేకాదు భారతదేశానికి మొదట ఉపరాష్ట్రపతిగా కూడా సేవలందించడం జరిగింది.

Today is the birth anniversary of Maulana Abul Kalam Azad and national day celebrations across the country
Maulana Abul Kalam Azad

స్వాతంత్రం వచ్చాక దేశంలో అక్షరాస్యత కేవలం 12 శాతం మాత్రమే ఉండగా… మౌలానా గారు తీసుకున్న అనేకమైన నిర్ణయాలు.. అక్షరాస్యతలో ప్రస్తుతం దేశం ముందంజలో వెళ్లడానికి కారణం అయ్యింది. దేశ మొదటి విద్యా శాఖ మంత్రిగా మహాత్మా గాంధీ చేత నియమితులైన మౌలానా అబుల్ కలాం ఆజాద్.. విద్యా ప్రాథమిక హక్కుగా చేయటం జరిగింది. ఆయన తొలి ప్రసంగంలో… దేశ ప్రజల అవసరాలకు తగినట్టుగా విద్యా విధానాన్ని రూపొందించడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. మౌలానా గారి ఆధ్వర్యంలో కేంద్ర విద్యా శాఖలో అనేకమైన విద్యాసంస్థలు మరియు కమిషన్ లు, యూనివర్సిటీలు స్థాపించడం జరిగింది. అలాగే వందలాది సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూషన్స్ ఇప్పుడు దేశంలో ఉన్నాయి అంటే అప్పుడు మౌలానా గారి దూరదృష్టి అని చెప్పవచ్చు. ఆయన మొదటి విద్యా శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సమయంలోనే దేశంలో రెండు చోట్ల ఘరక్ పుర్ ఇంకా ముంబైలో ఐఐటి సంస్థలు అప్పట్లోనే ఆయన స్థాపించారు.

Advertisements
Today is the birth anniversary of Maulana Abul Kalam Azad and national day celebrations across the country
National Education 2022

అదేవిధంగా ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ సెకండరీ ఎడ్యుకేషన్ కమిషన్, ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ బోర్డ్, అడల్ట్ ఎడ్యుకేషన్ బోర్డ్, రూరల్ ఎడ్యుకేషన్ బోర్డ్, సెంట్రల్ సోషల్ డెవలప్మెంట్ బోర్డ్, సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్, సెంట్రల్ ఎడ్యుకేషన్ బోర్డ్ గైడెన్స్ బ్యూరో, ఎడ్యుకేషనల్ అండ్ ఒకేషనల్ గైడెన్స్ బ్యూరో, నేషనల్ బోర్డ్ ఫర్ బేసిక్ ఎడ్యుకేషన్ … మొదలైన బోర్డులు అన్నీ కూడా మౌలానా అబుల్ కలాం ఆజాద్ స్థాపించడం జరిగింది. అలాగే సాహిత్య అకాడమీ, డాన్స్ డ్రామా మ్యూజిక్.. అకాడమీ లకు సంబంధించిన ఎన్నో సంస్థలను స్థాపించడం ద్వారా ఆయన భావితరాలకు మార్గదర్శకంగా నిలిచారు.

 

దీంతో నేడు మౌలానా అబుల్ కలాం ఆజాద్ పుట్టినరోజు సందర్భంగా దేశవ్యాప్తంగా విద్య, జాతీయ అభివృద్ధికి, సంస్థల బలోపేతానికి ఆయన చేసిన సేవలను స్మరించుకుంటూ ఉంటారు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా నేడు చదువు విలువ గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక కార్యక్రమాలు ప్రభుత్వాలు నిర్వహిస్తాయి. తద్వారా ప్రజలకు విద్య ఆవశ్యకత పై అవగాహన పెంచి ఎక్కువ మంది పిల్లలను స్కూళ్లకు పంపించే ఏర్పాటులు చేసే దిశగా ప్రభుత్వాలు ఆలోచనలు చేస్తూ ఉంటాయి. దేశంలో విద్యాభివృద్ధికి ఆజాద్ విశేష కృషి చేశారు. ఒక విధంగా చెప్పాలంటే ఆధునిక విద్యకు ఆధ్యుడు ఆజాదే.


Share

Related posts

కాంగ్రెస్ అధ్యక్ష పదవి ఎన్నికకు ముహూర్తం ఖరారు.. ఎప్పుడంటే ..?

somaraju sharma

Earthquake: అండమాన్ నికోబార్ దీవుల్లో భూకంపం

somaraju sharma

CBI : బెంగాల్ లో బీజేపీ అతిపెద్ద మంత్రం..! మమత బంధువుకి సీబీఐ నోటీసులు..!!

Yandamuri