అమెరికా రక్షణ మంత్రి రాజీనామా

అమెరికా రక్షణ మంత్రి జిమ్ మాట్టిస్ రాజీనామా చేశారు. అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తో విధానాలపై విభేదాల కారణంగానే ఆయన తన రాజీనామా చేశారు. ట్రంప్ విదేశాంగ విధానాలతో విభేదించిన రక్షణ మంత్రి తన పదవికి అర్ధంతరంగా రాజీనామా చేశారు. ప్రధానంగా సిరియా నుంచి అమెరికా సేనల ఉపసంహరణ విషయంలో ట్రంప్ ఏకపక్షంగా తీసుకున్న నిర్ణయాన్ని జిమ్ తీవ్రంగా వ్యతిరేకించినట్లు చేబుతున్నారు. ఈ విషయమై జిమ్ ట్రంప్ తో ముఖాముఖీ భేటీ అయ్యారు. ఈ భేటీలో కూడా వారిరువురి మధ్యా విభేదాలు పరిష్కారం కాకపోవడంతో జిమ్ రాజీనామా నిర్ణయం తీసుకున్నారని వైట్ హౌస్ వర్గాలు తెలిపాయి. మీ విధానాలతో ఏకీభవించే రక్షణ మంత్రిని నియమించుకునే అధికారం మీకు ఉందని ట్రంప్ తో జిమ్ పేర్కొన్నట్లు చెబుతున్నారు. అదే సమయంలో రక్షణ మంత్రిగా వైదొలగాలని నిర్ణయించుకునే అధికారం తనకు ఉందని ఆయన స్పష్టం చేసినట్లు సమాచారం.