తెలంగాణ సీఎం ప్రయత్నాలను స్వాగతిస్తున్నా!

ఫెడరల్ ఫ్రంట్ కోసం తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు చేస్తున్న ప్రయత్నాలను స్వాగతిస్తున్నానని సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ యాదవ్ అన్నారు. ఢిల్లీలో విలేకరలతో మాట్లాడిన ఆయన బీజేపీకి వ్యతిరేకంగా జాతీయ స్థాయిలో పార్టీలను ఏకం చేసేందుకు గత కొద్ది నెలలుగా ప్రయత్నాలు సాగుతున్నాయని పేర్కొన్నారు. కల్వకుంట్ల చంద్రశేఖరరావు కూడా ఫెడరల్ ఫ్రంట్ కోసం ప్రయత్నిస్తున్నారనీ, తాను హైదరాబాద్ వెళ్లి ఆయనను కలుస్తానని పేర్కొన్నారు.

ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు మరి కొద్ది సేపటిలో ప్రధాని నరేంద్రమోడీతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో భాగంగానే ఆయన సమాజ్ వాదీ పార్టీ నేత అఖిలేష్ యాదవ్, బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతితో భేటీ అయ్యి ఫెడరల్ ఫ్రంట్ పై చర్చించనున్నట్లు వార్తలు వచ్చాయి. ఇప్పుడు సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేష్ ఆయనను హైదరాబాద్ లో కలుస్తానని చెప్పడంతో కేసీఆర్ పర్యటనలో ఆయనతో భేటీ అవకాశం లేదని అవగతమౌతున్నది. ఇప్పటికే ఫెడరల్ ఫ్రంట్ పై కేసీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తోనూ, పశ్చిమ బెంగాల్ సీఎం మాయావతితోనూ చర్చించిన సంగతి విదితమే.

SHARE