NewsOrbit
న్యూస్

Amit Shah : బెంగాల్లో గెలుపు భారం సోషల్ మీడియాపై వేసిన అమిత్ షా!భారీ టార్గెట్ తో బరిలోకి!!

Amit Shah : పశ్చిమబెంగాల్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ అక్కడ రాజకీయం మరింత రసవత్తరంగా మారుతున్నాయి.

Amit Shah lays the burden of victory in Bengal on social media!
Amit Shah lays the burden of victory in Bengal on social media!

రెండుసార్లు రాష్ట్ర పగ్గాలు చేట్టిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ మూడవ సారి కూడా అధికారాన్ని కైవసం చేసుకుని హ్యాట్రిక్ సాధించాలని భావిస్తుండగా… ఈ సారి ఎలాగైనా పశ్చిమబెంగాల్‌లో కాషాయ జెండాను రెపరెపలాడించాలని భావిస్తోంది బీజేపీ అధిష్టానం. ఈ నేపథ్యంలోనే బీజేపీ ముఖ్య నేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా.. పార్టీ శ్రేణులకు కీలక దిశానిర్దేశం చేశారు. ఎన్నికల్లో పార్టీల గెలుపోటములపై సోషల్ మీడియా తీవ్ర ప్రభావం చూపుతున్న నేపథ్యంలో దానిపై ప్రముఖంగా ఫోకస్ చేయాలని సూచించారు. అంతేకాదు.. పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి సంబంధించి బీజేపీ సోషల్ మీడియా టీమ్‌కు అమిత్ షా భారీ టార్గెట్ విధించారు. రాష్ట్ర వ్యాప్తంగా 10 కోట్ల జనాభా ఉండగా, బీజేపీ సోషల్ మీడియా టీమ్.. కనీసంగా 2 కోట్ల మంది ప్రజలను రీచ్ అవ్వాలని లక్ష్యం నిర్దేశించారు. ఎన్నికల సమీపించేలోపు ఈ టార్గెట్‌ను కంప్లీజ్ చేయాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. అమిత్ షా టార్గెట్‌కి సంబంధించి జాతీయ మీడియాలో వార్తలు ప్రసారమవుతున్నాయి.

Amit Shah : కసి మీదున్న కమలనాథులు!

పశ్చిమబెంగాల్‌లో మొత్తం 294 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా, 42 లోక్‌సభ నియోజకవర్గాలు ఉన్నాయి. దేశంలో అతిపెద్ద రాష్ట్రాల జాబితాలో ముందు వరుసలో ఉన్న పశ్చిమబెంగాల్‌లో మరికొన్ని నెలల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికల్లో గనుక విజయం సాధించినట్లయితే.. రానున్న పార్లమెంట్ ఎన్నికల నాటికి రాష్ట్రంపై పూర్తిస్థాయిలో పట్టు సాధించవచ్చునని బీజేపీ ఆలోచిస్తోంది. తద్వారా 42 లోక్‌సభ స్థానాల్లో అత్యధిక సీట్లను కైవసం చేసుకున్నట్లయితే వచ్చే టర్మ్ కూడా కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టేందుకు మార్గం సుగమం అవుతుందని బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఆ కారణంగానే వెస్ట్ బెంగాల్‌లో ఎలాగైనా గెలవాలని బీజేపీ నేతలు ఇప్పటి నుంచే ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇప్పటికే అధికార టీఎంసీకి చెందిన కీలక నేతలు పలువురిని బీజేపీలోకి లాగేసుకున్నారు. ఎన్నికల నాటికి మరికొంతమంది నేతలు బీజేపీలో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

 

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju