NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: ఏపీ రాజధానిపై మరో సారి కీలక ప్రకటన చేసిన సీఎం వైఎస్ జగన్

CM YS Jagan: విశాఖపట్నంలో మంగళవారం నిర్వహించిన విజన్ విశాఖ సదస్సులో సీఎం వైఎస్ జగన్ పాల్గొన్నారు. విశాఖ నగరంలోని వనరులను పారిశ్రామికవేత్తలకు వివరించారు. ఈ సందర్భంలోనే ఏపీ రాజధాని అంశంపై మరో సారి కీలక ప్రకటన చేశారు. రాష్ట్ర విభజన తర్వాత హైదరాబాద్ ను కోల్పోయామనీ, దాని ప్రభావం ఇప్పటికీ మన రాష్ట్రంపై కనబడుతోందని అన్నారు.

ప్రస్తుతం విశాఖ నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందన్నారు. త్వరలోనే హైదరాబాద్ ను మించి అభివృద్ధిలో విశాఖ దూసుకువెళ్తుందని సీఎం జగన్ అన్నారు.  విశాఖ నగర అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక ఉందని చెప్పారు. చెన్నై, హైదరాబాద్ కు ధీటుగా అభివృద్ధి చేస్తామని తెలిపారు. ఎన్నికల తర్వాత తాను విశాఖలోనే ఉంటాననీ, ఈ సారి సీఎంగా విశాఖ లోనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు.

రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం ఉందని అన్నారు. అభివృద్ధితో కూడిన సంక్షేమాన్ని ప్రజలకు అందిస్తున్నట్లు జగన్ వివరించారు. ఉత్పత్తి రంగంలో దేశంలోనే ఏపీ మెరుగ్గా ఉందని అన్నారు. గత అయిదేళ్లలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపట్టామని అన్నారు. ఏపీలో తలసరి ఆదాయం పెరిగిందన్నారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు హైదరాబాద్ కే పరిమితం అయ్యాయన్నారు.

అమరావతి రాజధానికి మేం వ్యతిరేకం కాదని, అమరావతి శానస రాజధానిగా కొనసాగుతోందని తెలిపారు. అమరావతిలో మౌళిక సదుపాయాల కల్పనకు లక్ష కోట్లు కావాలని అన్నారు. అక్కడ 50వేల ఎకరాల బీడు భూమి తప్ప ఏమీ లేదని అన్నారు. విశాఖ స్టేడియంను మెరుగ్గా నిర్మిస్తున్నామనీ, విశాఖను ఎకనామిక్ గ్రోత్ ఇంజిన్ గా మారుస్తామని సీఎం జగన్ వివరించారు. విశాఖలో రోడ్లు ఉన్నాయని.. మంచి హోటల్స్ ఉన్నాయన్నారు. సెక్రటేరియట్ విశాఖలో అయితే ఐకానిక్ టవర్స్ కట్టవచ్చని అన్నారు. రాష్ట్రంలో నాలుగు పోర్టులు అతివేగంతో నిర్మాణమవుతున్నాయన్నారు.

YSRCP: వైసీపీకి మరో షాక్ .. మంత్రి గుమ్మనూరు రాజీనామా .. సీఎం జగన్ పై కీలక వ్యాఖ్యలు

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N