NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

రాంకో సిమెంట్స్ ఫ్యాక్టరీని ప్రారంభించిన సీఎం వైఎస్ జగన్

నంద్యాల జిల్లా కొలిమిగుండ్ల మండలం కల్వటాల గ్రామ సమీపంలో రూ.1790 కోట్లతో ఏర్పాటు చేసిన రామ్ కో సిమెంట్స్ ఫ్యాక్టరీని ఏపి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి (జగన్) ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధికి ప్రభుత్వం ఎంతో కృషి చేస్తొందన్నారు. పరిశ్రమల ఏర్పాటు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. పరిశ్రమలు రావడం వల్ల ఎంతో మంచి జరుగుతుందని అన్నారు. రామ్ కో పరిశ్రమతో వెయ్యి మందికి ఉద్యోగాలు వస్తాయన్నారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కు ఏపినే ఉదాహరణ అని చెప్పారు. కర్నూలు జిల్లాలో గ్రీన్ కో ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామన్నారు. దీని వల్ల రైతులకు మేలు జరగడంతో పాటు ఉద్యోగ అవకాశాలు రావాలన్నారు. రానున్న నాలుగేళ్లలో 20వేల ఉద్యోగాలు వస్తాయని తెలిపారు. పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమరనాథ్ మాట్లాడుతూ రాష్ట్రాన్ని పారిశ్రామిక అభివృద్ధితో ముందుకు తీసుకెళుతున్నామని చెప్పారు. పరిశ్రమలకు ఎంతో ప్రోత్సహం ఇస్తున్నామని తెలిపారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న చర్యలతోనే పరిశ్రమలు వస్తున్నాయని అన్నారు.

CM YS Jagan

 

2018 డిసెంబర్ నెలలో ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి భూమి పూజ జరిగింది. అయితే వివిధ రకాల అనుమతులు, కరోనా, భూసేకరణ తదితర సమస్యలతో ఫ్యాక్టరీ నిర్మాణం ఆలస్యం అయ్యింది. కొలిమిగుండ్ల మండలంలో సిమెంట్ పరిశ్రమల ఏర్పాటునకు అవసరమైన ముడి ఖనిజపు నిల్వలు అపారంగా ఉండటంతో రాంకో సంస్థ కల్వటాల గ్రామ సమీపంలో అత్యాధునిక టెక్నాలజీతో పరిశ్రమను నిర్మించింది. ఈ ఫ్యాక్టరీ ఏర్పాటునకు గానూ కొలిమిగుండ్ల, నాయనపల్లె, కల్వటాల, ఇటిక్యాల, చింతలాయిపల్లె, కనకాద్రిపల్లె గ్రామాల రైతుల నుండి దశల వారీగా అయిదు వేల ఎకరాల భూమి సేకరించింది. ఏటా 2 మిలియన్ టన్నుల సిమెంట్ ను ఈ పరిశ్రమ ఉత్పత్తి చేస్తుంది.

తిరుమల శ్రీవారిని మరో సారి దర్శించుకున్న ఏపీ సీఎం వైఎస్ జగన్ .. నూతన పరకామణి భవనం ప్రారంభం

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N