NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

YSRCP: ఏపీలో గత 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలో నిలిచిపోతుందని సీఎం వైఎస్ జగన్ అన్నారు. ఎలాంటి సమస్యలు వచ్చినా చిరునవ్వుతో ప్రజలకు తోడుగా ఉన్నామని, ఆఖరికి కోవిడ్ లాంటి కష్టకాలంలోనూ సాకులు చెప్పకుండా సంక్షేమ పథకాలు అమలు చేశామని చెప్పారు జగన్.

తాడేపల్లి  వైసీపీ కేంద్ర కార్యాలయంలో వైసీపీ 2024 మేనిఫెస్టో ను సీఎం జగన్ విడుదల చేశారు. కేవలం రెండు పేజీలతో మేనిఫెస్టో ను విడుదల చేశారు. ఇప్పుడున్న పథకాలను కొనసాగిస్తూనే వాటికి కొంత నగదును జోడిస్తూ మేనిఫెస్టో  లో చోటు కల్పించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ..గతంలో ఎన్నికలప్పుడు రంగురంగుల హామీలతో ముందుకు వచ్చే వారని, ఎన్నికల తర్వాత ఆ మేనిఫెస్టో చెత్త బుట్టలో కనిపించేది కాదని అన్నారు. మేం మేనిఫెస్టో ను భగవద్గీత, ఖురాన్, బైబుల్ గా భావించామన్నారు. గత అయిదేళ్లలో మేనిఫెస్టో కు ప్రాధాన్యత వచ్చిందని అన్నారు.  ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో, అధికారి దగ్గర మేనిఫెస్టో ఉంది. రాష్ట్రంలో ప్రతి ఇంటికి మేనిఫెస్టో ను పంపించామని అన్నారు. 2019 లో ఇచ్చిన హామీలను 99 శాతం అమలు చేశామన్నారు. నేరుగా 2కోట్ల 75 లక్షల రూపాయలు లబ్దిదారులకు పంపిణీ చేశామని వివరించారు.

ఆచరణలో సాధ్యమయ్యే హామీలను మాత్రమే ఇచ్చి అమలు చేయడం జరిగిందన్నారు. 2014 లో రైతు రుణ మాఫీ హామీ ఇవ్వాలని తనపై వత్తిడి చేసినా తాను అందుకు అంగీకరించలేదన్నారు. చేయగలిగినవి మాత్రమే చెప్పానని అన్నారు. 2014 లో అధికారంలోకి రాలేకపోయినా .. ఈ రోజు మేనిఫెస్టోలో చెప్పినట్లు చేసి చూపించి ప్రజల్లోకి వెళుతున్నామని అన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేస్తేనే ఆ నాయకత్వాన్ని జనం విశ్వసిస్తారని అన్నారు.

చంద్రబాబు చెప్పే హామీలు అమలు చేయడం సాధ్యమేనా అని ప్రశ్నించారు. హిస్టరీ రిపీట్ అన్నట్లు మళ్లీ 2014 తరహాలోనే సాధ్యం కాని హామీలతో అబద్దాలకు రెక్కలు గడుతూ జనం ముందుకు వస్తున్నారని విమర్శించారు. సంపద సృష్టించి పథకాలు అమలు చేస్తానని ఆంటున్నారని, చంద్రబాబు అధికారంలో ఉన్న 14 ఏళ్లు కూడా రెవెన్యూ లోటు ఉందని, ఆయన సంపద సృష్టించింది ఎక్కడ అని ప్రశ్నించారు.

మేనిఫెస్తోలో ప్రధాన అంశాలు

  • పింఛన్ రూ.3,500 పెంపుదల
  • వైఎస్ఆర్ చేయూత – 75 వేల నుండి లక్షా 50వేలకు పెంపు
  • వైఎస్ఆర్ కాపు నేస్తం – 60వేల నుండి లక్షా 20వేలకు పెంపు
  • వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం – 45 వేల నుండి లక్షా 5వేలకు పెంపు
  • అమ్మఒడి – 15వేల నుండి 17 వేలకు పెంపు
  • వైఎస్ఆర్ ఆసరా – మూడు లక్షల వరకూ సున్నా వడ్డీ పై రుణాలు
  • రైతు భరోసా -67,500 నుండి రూ.లకు పెంపు
  • వైఎస్ఆర్ ఆసరా – మూడు లక్షల వరకూ సున్నా వడ్డీ పై రుణాలు
  • రైతు భరోసా -13,500 నుండి రూ.16 వేలకు పెంపు
  • ఉచిత భీమా, పంట రుణాలు కొనసాగింపు
  • మత్స్యకార భరోసా – 50వేల నుండి లక్షకు పెంపు
  • వాహన మిత్ర – 50 వేల నుండి లక్షకు పెంపు (టిప్పర్, లారీ డ్రైవర్ లకు వర్తింపు)
  • వైఎస్ఆర్ కళ్యాణ మస్తు, షాదీ తోషా కొనసాగింపు
  • వైఎస్ఆర్ లా నేస్తం కొనసాగింపు
  • రాష్ట్ర వ్యాప్తంగా 175 స్కిల్ హబ్ లు ఏర్పాటు
  • జిల్లాకు ఒక స్కిల్  డెవలప్ మెంట్ కాలేజీ
  • తిరుపతిలో స్కిల్ డెవలప్ మెంట్ వర్శిటీ
  • 500 లకుపైగా అవాసాలున్న దళిత కాలనీలను పంచాయతీలుగా మార్పు

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

Related posts

Allu Arjun: అంద‌రి ముందు భార్య ప‌రువు తీసేసిన అల్లు అర్జున్‌.. స్నేహ గురించి అంత మాట‌న్నాడేంటి..?

kavya N

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar