NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

చంద్రబాబుకి ముందుంది ముసళ్ళ పండుగ అంటున్నా ఏపీ మంత్రి..!!

Share

ఏపీ రాజధాని రైతులు చేస్తున్న అమరావతి ఉద్యమం ఏడాది అయిన నేపథ్యంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు సీఎం జగన్ పై తీవ్రస్థాయిలో మండిపడ్డ విషయం తెలిసిందే. జగన్ వన్ టైం ముఖ్యమంత్రి అని పేర్కొన్న బాబు.. రాజధాని ప్రాంతంలో నాకు సొంత ఇల్లు లేదు అన్నావ్..?, మీకు ఇల్లు ఉండి రాజధాని ప్రాంతానికి ఏం చేశావు అంటూ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.

Perni Nani throws SHOCK to Jagan !! | TeluguBulletin.comదీంతో బాబు చేసిన వ్యాఖ్యలకు ఏపీ మంత్రులు వరుసగా కౌంటర్ లు ఇస్తున్నారు. దీనిలో భాగంగా సమాచార శాఖ మంత్రి పేర్ని నాని బాబు చేసిన కామెంట్లకు అదిరిపోయే రీతిలో కౌంటర్లు వేస్తున్నారు. బాబు చేసిన అవినీతి ప్రతీది బయటపడుతుందని, ముందుంది ముసళ్ళ పండగ అని పేర్కొన్నారు. నువ్వు ఏ బొక్కలో దాక్కున్న స్టే లు ఎత్తివేసే రోజు త్వరలోనే వస్తుంది అని పేర్ని నాని స్పష్టం చేశారు.

 

కోట్లు కోట్లు కుమ్మరించి పెద్దపెద్ద నల్ల కోట్ల వెనకాల దాక్కున్నది ఎవరు..? అంటూ చంద్రబాబు ని ఉద్దేశించి తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. అంతమాత్రమే కాకుండా వయసుతో సంబంధం లేకుండా చంద్రబాబు మాట తీరు ఉందని, గౌరవంగా మాట్లాడటం లేదని మంత్రి పేర్ని నాని సీరియస్ అయ్యారు. నిజం చెప్పే రాజకీయలు రాష్ట్రానికి అవసరం లేవా..? అని బాబు చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందిస్తూ నిజం చెప్పే దమ్మున్న నాయకుడు చెప్పింది చేసే నాయకుడు మాట మీద ఉన్న నేత కాబట్టే జగన్ ని ప్రజలు ముఖ్యమంత్రి చేశారని, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్పే మిమ్మల్ని ఇంటికి పంపించారు అని బాబు చేసిన వ్యాఖ్యలకు భారీ స్థాయిలో పేర్ని నాని కౌంటర్లు వేశారు.


Share

Related posts

Vakeel Saab : ఫస్ట్ డే సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేయబోతున్న వకీల్ సాబ్..!!

sekhar

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ తో సినిమా గురించి ఎస్.ఎస్.రాజమౌళి సంచలన కామెంట్స్..!!

sekhar

బీజేపీ విషయంలో ముందు జాగ్రత్త పడుతున్న మమతాబెనర్జీ..!!

sekhar