NIck Name: పేరుతోనే రొటీన్ గా
మనం అందరిని వారి వారి పేరు తో పిలుస్తుంటాం. అదేవిధం గా గర్ల్ ఫ్రెండ్ ని కూడా తన పేరుతోనే రొటీన్ గా పిలిస్తే తనకు స్పెషల్ ఫీలింగ్స్ ఎలా వస్తాయి? అందుకే ఈ మధ్య చాలా మంది తమ పార్టనర్స్ ని “బేబి ” అంటూ ముద్దుగా పిలుచుకుంటున్నారు. బేబి అన్న పిలుపు అబ్బాయిలకు ఎలా అనిపిస్తుందో కాని, అమ్మాయిలకు మాత్రం చాలా చాలా నచ్చుతుంది.
NIck Name: ఆ బేబ్ అనే పదం
అలాగని షార్ట్ గా “బెబ్ ” అని మాత్రంపిలవకండి. ఎందుకంటే ఆ బేబ్ అనే పదం అమ్మయిలకు అస్సలు నచ్చదు. కానీ బేబి అనే పదం మాత్రం వారికీ మహా గమ్మత్తుగా ఉంటుందట. బాయ్ ఫ్రెండ్ నోటి నుంచి బేబి అనే పదాన్ని వినగానే తమను చిన్న పిల్లలా గారం చేస్తూన్నారు అని మురిసిపోతారట. అది సినిమాల్లో వాడేస్తున్నారుగా, ఇక మనమేం పిలుస్తాం అని అనుకుంటున్నారా? బేబి అనే పిలుపు కొత్తదిఏమి కాదు కాని, చాలా చాలా విలువైనది. మీకు కానీ గర్ల్ ఫ్రెండ్ ఉంటే ఓ వారం రోజులు బేబి అని పిలిచి చూడండి. ఆమె ముసిముసి నవ్వులు మీకు బహుమతిగా అందుతాయి.
ముద్దు పేరుతో పిలిస్తే
ఇంకో గుర్తు పెట్టుకోవాలిసిన ముఖ్యమైన విషయం ఏంటంటే అందరూ పిలిచే పేరుతో కాకుండా ఏదైనా ప్రత్యేకం గా ఉండే ముద్దు పేరుతో పిలిస్తే ఇక అమ్మాయి తన బాయ్ ఫ్రెండ్ ని ఎంతో అపురూపం గా చూసుకుంటుంది. అయితే అబ్బాయిలు ఈ కొత్త ముద్దు పేరు పెట్టడం కోసం మీరు కాస్త కష్టపడి ఆమె లో ఉన్న ప్రత్యేకత గుర్తించి దానికి తగ్గ అందమైన పేరు పెట్టి పిలవండి.