NewsOrbit
జాతీయం న్యూస్

CM Stalin: నాలుగు రాష్ట్రాల సీఎంలకు తమిళనాడు సీఎం స్టాలిన్ కీలక లేఖలు..! విషయం ఏమిటంటే..?

CM Stalin: ముఖ్యమంత్రి స్టాలిన్ తమిళనాడులో తన దైన మార్కుతో పరిపాలన సాగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. సహజ సిద్ధంగా తమిళనాడులో చాలా కాలం నుండి రాజకీయ పక్షాలు కక్ష సాధింపు రాజకీయాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాళ్లు. అయితే స్టాలిన్ ముఖ్యమంత్రి అయిన తరువాత కీలక విషయాల్లో ప్రతిపక్షాలను భాగస్వామ్యం చేస్తున్నారు. దీనితో స్టాలిన్ ప్రభుత్వంపై పెద్దగా విమర్శలు రావడం లేదు. తాజాగా సీఎం స్టాలిన్ తీసుకున్న ఓ నిర్ణయం ప్రసంశలు అందుకుంటోంది. ఇక విషయంలోకి వెళితే….

Stalin writes letter to 4 cms requesting not to ban crackers
Stalin writes letter to 4 cms requesting not to ban crackers

CM Stalin: శివకాశి నుండే దేశ వ్యాప్తంగా దీపావళి టపాసులు

తమిళనాడు రాష్ట్రంలో ముఖ్యమైన పరిశ్రమల్లో బాణాసంచా తయారీ కూడా ఒకటి. శివకాశిలోని బాణా సంచా తయారీ పరిశ్రమ నుండే దేశ వ్యాప్తంగా కోట్లాది రూపాయల బాణాసంచా ఉత్పత్తులు రవాణా, అమ్మకాలు జరుగుతుంటాయి. ఈ పరిశ్రమ వేలాది మంది వ్యాపారులు, దాదాపు 8 లక్షల మందికిపైగా కార్మికులకు ఉపాధిగా ఉంది. బాణాసంచా క్రయ విక్రయాల ద్వారా ప్రభుత్వానికి పన్నుల రూపంలో భారీగానే ఆదాయం వస్తుంది. శుభ, అశుభ కార్యాలు, దీపావళి వేడుకల్లో బాణా సంచా వినియోగం పెరుగుతున్నందున శివకాశిలో ఏడాది పొడవునా బాణాసంచా తయారీ కొనసాగుతూనే ఉంటుంది. అయితే సుప్రీం కోర్టు మార్గదర్శకాల నేపథ్యంలో పలు రాష్ట్రాలు బాణాసంచా విక్రయాలపై నిషేదం విధించాయి. ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిశా రాష్ట్రాలు ఇప్పటికే బాణాసంచా విక్రయాలపై నిషేదం విధించాయి. ఇలా రాష్ట్రాలు బాణాసంచా విక్రయాలపై మూకుమ్మడిగా నిషేదాలు విధిస్తే.. బాణాసంచా పరిశ్రమపై ఆధారపడిన లక్షలాది మంది కార్మికులు ఉపాధి కోల్పోయి రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపై తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ స్పందించారు.

బాణా సంచా విక్రయాల నిషేదం సరికాదు

ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా, ఒడిశా ముఖ్యమంత్రులకు స్టాలిన్ లేఖ రాశారు. బాణాసంచా విక్రయాలపై సామూహిక నిషేదం విధించడం మంచిది కాదనీ, దీని వల్ల ఆ పరిశ్రమపై ఆధారపడిన వేల కుటుంబాలకు తీవ్ర నష్టం జరుగుతుందని పేర్కొన్నారు. బాణాసంచా పై నిషేదం సరైన నిర్ణయం కాదనీ, ఇతర దేశాల్లో టపాసులపై నిషేదం లేదని పేర్కొన్నారు. వాయు కాలుష్యం నేపథ్యంలో టపాసుల విక్రయాలపై నిషేదం విధించినట్లు తెలుస్తోందనీ, కానీ సుప్రీం కోర్టు కొన్ని ప్రత్యేకమైన బాణాసంచాలనే నిషేదించిందని అన్నారు. సుప్రీం కోర్టు మార్గదర్శకాలను అనుసరించి తక్కువ కాలుష్యం వచ్చే గ్రీన్ క్రాకర్స్ నే ఇప్పుడు తయారు చేస్తున్నారని స్టాలిన్ లేఖలో వివరించారు. లక్షలాది మంది కార్మికుల జీవనోపాధిని దృష్టిలో పెట్టుకుని టపాసుల నిషేదంపై పునరాలోచన చేయాలని ఆయా రాష్ట్రాల సీఎంలకు విజ్ఞప్తి చేశారు. స్టాలిన్ లేఖపై ఆయా రాష్ట్రాల ఏ విధంగా స్పందిస్తాయో వేచి చూడాలి. బాణాసంచా పరిశ్రమ మనుగడే ప్రశ్నార్ధకంగా మారిపోయి లక్షలాది మంది కార్మికుల జీవనోపాధి దెబ్బతిన కుండా ఉండేందుకు సీఎం స్టాలిన్ చేస్తున్న ఈ ప్రయత్నానికి తమిళనాట ప్రజలు హాట్సాఫ్ చెబుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju