NewsOrbit
న్యూస్ బిగ్ స్టోరీ రాజ‌కీయాలు

బండి నోటికి తాళం వేయలేరా? రోజుకో వివాదాస్పద వ్యాఖ్యలతో కొత్త చిక్కులు

ఎన్నికలు అన్నాక క్యాడర్లో ఉత్సాహం నింపేలా నేతలు కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం సహజం. అవి ఎన్నికల్లో వేడి పుట్టించేలా, ఓటర్లకు ఆశలు కల్పించేలా ఉంటాయి. అయితే బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గ్రేటర్ హైద్రాబాద్ ఎన్నికల పుణ్యమా అని ఎడా పెడా మాట్లాడుతున్నారు. ఆయన ఎప్పుడు ఎం మాట్లాడతారో, అది ఎక్కడికి వెళ్తుందో తెలియక బీజేపీ నాయకులే భయపడుతున్నారు. తాజాగా ఆయన బీజేపీ జెండా గ్రేటర్లో ఎగిరితే ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రిక్స్ చేస్తామంటూ ప్రచారంలో వ్యాఖ్యానించడం కలకలం రేపుతోంది.

రోజుకో మాట… తూటా

బండి సంజయ్ ఇస్తున్న హామీలు, చెబుతున్న మాటలు బీజేపీ కు మైలేజి తెచ్చేకంటే అభాసుపాలు చేసేలా ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రధాన పోటీలోకి వచ్చిన బీజేపీ నాయకుడు ఎలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే అయన పూర్తిగా ఓటర్లను సందిగ్ధంలో పడేసేలా ఉన్నాయి. అంతేకాదు మతాల మధ్య చిచ్చు పెట్టేలా ఉన్నాయని, హైద్రాబాద్ లాంటి సున్నితమైన ప్రాంతాల్లో రెండు మతాలను విడదీసి బీజేపీ చేస్తున్న వ్యాఖ్యల వల్ల హిందువుల్లో అభద్రతా భావం వచ్చేలా ఉందని హైద్రాబాద్ నగరాన్ని ఎప్పటినుంచో చూస్తున్న పెద్దలు వ్యాఖ్యానిస్తున్నారు. ఒక పక్క తెరాస, మరో పక్క ఎంఐఎంతో ఒకేసారి పొందాల్సిన పరిస్థితి బీజేపీ ది. ఈ రెండు యుద్ధాల్లో ఏ మాత్రం వెనక్కు తగ్గినా బీజేపీ మేయర్ పీఠం మీద ఆశలు వదులుకోవాల్సిందే. దింతో బండి సంజయ్ ఒక్కో రోజు ఒక్కో పార్టీ టార్గెట్ చేస్తూ కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు… అవేంటంటే….
* ఆర్ఆర్ఆర్ సినిమా కొమరం భీం పాత్రను జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ట్రైలర్ విడుదల చేసినపుడు దానిలో ఎన్టీఆర్ ముస్లిం వేషధారణలో కనిపించడం వివాదం అయ్యింది. దీన్ని బండి సంజయ్ వాడుకోవాలని చూసారు. భీం పాత్ర కు ముస్లింగా చూపిస్తే రాజమౌళి తీవ్రమైన అమాశాలను చూడాల్సి వస్తుందని హెచ్చరించారు.
* హైద్రాబాద్ నగరంలో డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను తీసేస్తామని, ఆలా కాకుంటే ట్రాఫిక్ చలాన్ రాస్తే దాన్ని జిహెచ్ఎంసి కడుతుందని హామీ ఇవ్వడం వివాదం అయ్యింది. రోజు కొన్న కోట్ల రూపాయల చలాన్లను కార్పొరేషన్ ఎలా కడుతుందని, ఆలా అయితే దివాళా ఖాయమని బీజేపీ నాయకులే బండి వ్యాఖ్యల పట్ల ఘరమ్ ఘరమ్ అయ్యారు.
* జనసేన పార్టీతో పొత్తు ఉండదని ఎవరిని సంప్రదించకుండానే ఆయన ప్రెస్ కు చెప్పడం, తర్వాత ఈ అంశంపై వివాదం అయ్యి ఏకంగా పవన్ స్పందించి, హైద్రాబాద్ ఎన్నికల్లో తాము అభ్యర్థులు పోటీ చేస్తారని చెప్పడం, అనంతరం బీజేపీ నాయకులూ కిషన్ రెడ్డి, లక్ష్మణ్ లు పవన్ వద్దకు వెళ్లి ఆయనను ఒప్పించడం, జనసేన పార్టీ పోటీ నుంచి తప్పుకోవడం జరిగింది. దీని అంతటికి బండి వ్యాఖ్యలే ప్రధాన కారణం.
* గ్రేటర్ ఎన్నికల్లో గెలిస్తే ఓల్డ్ సిటీ మీద సర్జికల్ స్ట్రైక్ అంటూ బండి తాజాగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మంట పెడుతున్నాయి. 150 డివిజన్ లు ఉన్న జీహెచ్ఎంసీలో సుమారు 30 నుంచి 40 స్థానాల వరకు ఎంఐఎం ప్రభావితం చేసేవి ఉన్నాయి. ఈ ప్రాంతాల్లో బీజేపీ అభ్యర్థులు నిలబెడితే మరి వారికీ బండి వ్యాఖ్యలు అడ్డంకి కావా అని బీజేపీ నేతలే తలలు పట్టుకుంటున్నారు. హిందువులకు ధైర్యం చెప్పే మాటలు బండి సంజయ్ మాట్లాడితే బాగుంటుంది అని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
బీజేపీ లో తెరాస నాయకీలు నువ్వా నేనా అని సమాధానం చెప్పే నాయకుల్లో, కొంచెం గట్టిగా మాట్లాడే వారిలో బండి సంజయ్, దుబ్బాక నుంచి గెలిచినా రఘునందన్, నిజామాబాద్ ఎంపీ అరవింద్ లు ముందున్నారు. రాజాసింగ్ ఎప్పుడూ తగ్గరు. అయితే ఒక్కోసారి మాట్లాడే విషయంలో లైన్ గతి తప్పి వేరే స్టేట్మెంట్స్ వరకు వెళ్లడం బీజేపీకు లాభం కంటే నష్టం చేకూర్చే అవకాశాలు ఉంటాయి. దీన్ని నేతలు గమనిస్తేనే దొర నోటిని అడ్డుకోగలరు.

Related posts

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N

Rajinikanth: వెండితెర‌పై ర‌జ‌నీకాంత్ బ‌యోపిక్‌.. సూప‌ర్ స్టార్ గా న‌టించే హీరో ఎవ‌రంటే..?

kavya N

Anil Ravipudi-Rajamouli: అనిల్ రావిపూడిని ముసుగేసి కొడ‌తే రూ. 10 వేలు ఇస్తానంటూ రాజ‌మౌళి ప్ర‌క‌ట‌న‌.. అంత కోపం ఎందుకొచ్చింది?

kavya N

BRS MLC Kavitha: కవిత బెయిల్ పిటిషన్ పై తీర్పు వాయిదా

sharma somaraju

Sai Pallavi: స‌ర్జ‌రీ చేయించుకున్న సాయి ప‌ల్ల‌వి.. ఆమె ఫేస్ లో ఈ కొత్త మార్పును గ‌మ‌నించారా..?

kavya N

Amit Shah Video Morphing Case: అమిత్ షా వీడియో మార్ఫింగ్ కేసు .. ముగ్గురు టీ కాంగ్రెస్ సోషల్ మీడియా ప్రతినిధులు అరెస్టు

sharma somaraju

Rajamouli-NTR: ఆ ఇద్ద‌రే నా ఫ్రెండ్స్‌.. ఎన్టీఆర్ కానే కాదు.. సంచ‌ల‌నంగా మారిన రాజ‌మౌళి కామెంట్స్‌!

kavya N

AP Elections: తూర్పు గోదావరి జిల్లాలో భారీగా నగదు పట్టివేత

sharma somaraju

డ్యామ్ షూర్‌గా గెలిచే ఖ‌మ్మం ఎంపీ సీట్లో కాంగ్రెస్ ఓడుతోందా… అస‌లేం చేస్తున్నారు..?

ఎన్నికల తర్వాత ప్ర‌జారాజ్యం రూట్లోకే జ‌న‌సేన కూడా… నీరు గార్చేసిన ప‌వ‌న్‌…?

సీఎం జగన్ బిగ్ స్కెచ్.. షర్మిలకు అది కూడా కష్టమే ?

మంగళగిరిలో లోకేష్‌కు మ‌ళ్లీ క‌ష్ట‌మ‌వుతోందా… ఓట‌ర్లు ఇంత పెద్ద షాక్ ఇవ్వ‌బోతున్నారా ?

Hari Hara Veera Mallu: హరిహర వీరమల్లు నుంచి త‌ప్పుకున్న క్రిష్‌.. డైరెక్ట‌ర్ గా జ్యోతికృష్ణకు బాధ్య‌త‌లు.. అస‌లెవ‌రిత‌ను?

kavya N