బిగ్ బాస్ షో ప్రారంభంలో ఈ సీజన్లో బాగా హైలెట్ అయ్యింది ఎవరు అని అంటే కచ్చితంగా గంగవ్వ అని చెప్పవచ్చు. హౌస్ లో పెద్ద వయసు, పైగా పల్లెటూరు నుండి వచ్చిన గంగవ్వ.. చాలా మందిని ఆకట్టుకోవడం జరిగింది. అయితే హౌస్ లో వచ్చిన గంగవ్వ స్టార్టింగ్ లో కొన్ని అనారోగ్య సమస్యలు ఎదుర్కో గా… ఇంటి మీద అంధోళన కలగటంతో పాటు వాతావరణం పడకపోవడంతో ఆమె ఎలిమినేట్ అవ్వడం జరిగింది.
హౌస్ నుండి బయటకు వచ్చిన గంగవ్వ వెబ్ మీడియా ఛానల్స్ కి అదే విధంగా మెయిన్ స్ట్రీమ్ చానల్స్ కి ఇంటర్వ్యూ లు ఇస్తూ ఉంది. ఇదిలా ఉండగా హౌస్ నుండి ఎలిమినేట్ అయిన మెహబూబ్ మరియు గంగవ్వ ఇటీవల ఇంస్టాగ్రామ్ లో వీడియో చేశారు. ఈ వీడియోలో గంగవ్వ.. మెహబూబ్ తో మాట్లాడుతూ.. నీకు ఎటువంటి పెళ్ళాం కావాలి అని అడుగుతుంది.
దానికి మెహబూబ్ బాగా వంట ఉండే అమ్మాయి కావాలి అని అడుగుతాడు, చూసుకునే అమ్మాయి కూడా కావాలి అని అంటాడు. మరొక అమ్మాయి ఇల్లు మొత్తం బాగా చూసుకోవాలి అని అంటాడు. నీకు ముగ్గురమ్మాయిలు కావాలా అంటూ సరదాగా మెహబూబా నీ గంగవ్వ ఈ వీడియోలో కొట్టడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ వీడియో ఇంస్టాగ్రామ్ లో బాగా వైరల్ అవుతుంది.