బిగ్ బాస్ 4: జబర్దస్త్ అవినాష్ కలలు సాకారం చేసిన బిగ్ బాస్..!!

బిగ్ బాస్ సీజన్ 4 లో ఇంటి లోకి వైల్డ్ కార్డు రూపంలో ఎంట్రీ ఇచ్చిన ముగ్గురిలో ఒకరు జబర్దస్త్ అవినాష్. వైల్డ్ కార్డు రూపంలో మిగతా ఇద్దరూ వచ్చిన హౌస్ లో పెద్దగా రాణించలేకపోయారు. కానీ అవినాష్ హౌస్ లో అడుగు పెట్టిన నాటి నుండి ప్రతి ఒక్కరితో జోకులు వేసుకుంటూ హౌస్ లో ఎంటర్టైన్మెంట్ వాతావరణం ఉండేలా చూసుకుంటున్నారు. ఇతరులను ఆటపట్టిస్తూ నే మరోపక్క తన గేమ్ పై ఫుల్ ఫోకస్ పెడుతూ సీజన్ ఫోర్ లో దూసుకుపోతున్నారు.

Bigg Boss 4 Telugu: Avinash Got Immunity For Next 2 Weeks - Sakshiఒక్క ఎలిమినేషన్ ఎపిసోడ్ సమయంలో కంగారు పడటం తప్ప మిగతా రోజుల్లో అవినాష్ ఆడుతున్న ఆట తీరు, ఇతరులతో వ్యవహరిస్తున్న తీరు బయట చూస్తున్న ప్రేక్షకులకు ఎంతగానో ఆకట్టుకున్నటు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో అభిజిత్ ని కెప్టెన్ హారిక సేవ్ చేయడం అందరికీ తెలిసిందే. దీంతో ఎలిమినేషన్ లో ఉన్న మిగతా కంటెస్టెంట్ లకు నామినేష‌న్ నుంచి త‌ప్పించుకునేందుకు సరికొత్త టాస్క్ ఇవ్వటం జరిగింది.

 

జెండాలు సేకరించే టాస్క్. ఇందులో అవినాష్‌, అఖిల్ గెలిచారు. వీరిద్దరిలో ఒకరిని మాత్రమే ఎన్నుకోవాలని హౌస్‌లో ఎల‌క్ష‌న్ క్యాంపెయిన్ న‌డిచిన‌ట్లు స‌మాచారం. ఇందులో అఖిల్‌కు సోహైల్‌, మోనాల్… అవినాష్‌కు హారిక‌, అరియానా, అభిజిత్ స‌పోర్ట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీంతో అవినాష్ ఇమ్యూనిటీ పొందాడు. దీంతో ఈ వారం కాక వచ్చే రెండు వారాలకు అవినాష్ ఇమ్యూనిటీ పొందినట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉండగా ఈ వారం అవినాష్ సేవ్ అయితే కనుక టాప్ 5 లోకి వెళ్లి పోయినట్లే అని బయట టాక్.