NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

బీజేపీ మెయిన్ టార్గెట్ వీళ్లే… లిస్టులో ఉన్నోళ్లు మామూలోళ్లు కాదుగా…!

సాధార‌ణంగా ఏ రాజ‌కీయ పార్టీలో అయినా.. నాయ‌కులు చేర‌తారు. పైగా ఎన్నిక‌ల‌కు ముందు అయితే.. ఇత‌ర పార్టీల్లో ఉన్న నాయ‌కులు అసంతృప్తులు.. వంటివారు పొరుగు పార్టీల‌వైపు దృష్టి పెడ‌తారు. ఇది స‌హ‌జంగా జ‌రిగే ప్రక్రియ‌. అయితే.. నాయ‌కుల‌ను ఆక‌ర్షించ‌వ‌ల‌సిన విష‌యంలో ఏపీ బీజేపీ పూర్తిగా విఫ‌ల‌మైంద‌నే వాద‌న వినిపిస్తోంది. వైసీపీలో టికెట్ ద‌క్క‌ద‌ని భావించిన వారు టీడీపీ లేదా జ‌న‌సేన‌వైపు చూస్తున్నారు. ఆయా పార్టీల తీర్థం పుచ్చుకుంటున్నారు.

కానీ, ఎవ‌రూ కూడా బీజేపీ వైపు చూడ‌డం లేదు. మ‌రి ఆ పార్టీపై న‌మ్మ‌కం లేక‌పోవ‌డంతోనో లేక‌.. పార్టీ చీఫ్ పురందేశ్వ‌రి వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క‌పోవ‌డంతో తెలియాల్సి ఉంది. నిజానికి ఇప్ప‌టి వ‌ర‌కు ప‌ది మంది వ‌ర‌కు వైసీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చారు. వీరిలో ఆరేడుగురు కీల‌క నాయ‌కులు ఉన్నారు. ముఖ్యంగా క‌ర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ వంటి వారు కూడా ఉన్నారు. ఇలాంటి వారిని త‌న‌వైపు ఆక‌ర్షించ‌డంలో బీజేపీ పూర్తిగా విఫ‌ల‌మైంది. అయితే.. మ‌రోవైపు.. బీజేపీ నేత‌లు పారిశ్రామిక వేత్త‌ల‌పై దృష్టి పెట్ట‌డం గ‌మ‌నార్హం.

చిన్న చిత‌కా నుంచి భారీస్తాయి వ‌ర‌కు ప‌రిశ్ర‌మ‌ల‌ను న‌డిపిస్తున్న‌వారిని త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో బీజేపీ నాయ‌కులు బిజీగా ఉన్నారు. గ‌త నెల‌లో కొంద‌రు పార్టీలో చేరిన విష‌యం తెలిసిందే. పారిశ్రామికం గా ఉంటూ.. రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్న వీరిని త‌మ‌వైపు ఆక‌ర్షించ‌డంలో క‌మ‌ల నాథులు స‌క్సెస్ అయ్యారు. తాజాగా.. చిత్తూరు జిల్లా మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్ప బీజేపీలో చేరారు. స్థానికంగా ఈయ‌న‌కు మంచి పేరుంది. పైగా.. ఆర్థికంగా బ‌ల‌మైన పారిశ్రామిక వేత్త‌.

ఈయ‌న‌ను చేర్చుకోవ‌డంతో జిల్లాలో చ‌ర్చ‌నీయాంశం అయింది. ఇలా.. పార్టీ నాయ‌కుల‌ను కాకుండా.. పారిశ్రామిక వేత్త‌ల‌ను బీజేపీ చేర్చుకోవడం వెనుక రెండు కార‌ణాలు ఉండి ఉంటాయ‌ని ప‌రిశీల‌కులు చెబుతున్నారు. వీరు వైసీపీకి ఫండింగ్ చేయ‌కుండా అడ్డుకోవ‌డం ఒక భాగ‌మైతే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో బీజేపీకి మేలు చేసేలా.. ఆ పార్టీ అభ్య‌ర్థుల‌ను ఆర్థికంగా ఆదుకోవాల‌నే వ్యూహం ఉండి ఉంటుంద‌ని భావిస్తున్నారు. ఇటీవ‌ల కూడా గుంటూరు, ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాల‌కు చెందిన ప‌లువురు పారిశ్రామిక వేత్త‌లు క‌మ‌లం గూటికి చేర‌డం విశేషం. అయితే.. ఇక్క‌డ మ‌రో ప్ర‌శ్న‌. వారంత‌ట వారే వ‌చ్చి చేరుతున్నారా? లేక‌.. వారిపై ఒత్తిడి తెస్తున్నారా? అనేది ఆస‌క్తిగా మారింది.

author avatar
BSV Newsorbit Politics Desk

Related posts

CM YS Jagan Attack Case: సీఎం జగన్ పై దాడి కేసులో పురోగతి .. పోలీసుల అదుపులో అనుమానిత యువకులు

sharma somaraju

Lok Sabha Elections: ఏపీలో మరో ఉన్నతాధికారిపై బదిలీ వేటు ..మరో ఇద్దరు కీలక అధికారులపై సీఈసీకి కూటమి నేతల ఫిర్యాదు

sharma somaraju

Encounter: చత్తీస్‌గఢ్ లో భారీ ఎన్ కౌంటర్ .. 29 మంది మవోయిస్టులు మృతి

sharma somaraju

TDP: టెక్కలి వైసీపీకి షాక్ ..టీడీపీలో చేరిన కీలక నేతలు

sharma somaraju

విజయవాడ సెంట్రల్… ఉమా వర్సస్ వెల్లంపల్లి.. గెలిచేది ఎవ‌రో తేలిపోయింది..?

విజయవాడ పశ్చిమం: క‌న‌క‌దుర్గ‌మ్మ వారి ద‌య ఏ పార్టీకి ఉందంటే…?

జీవీఎల్ ప‌ట్టు.. విశాఖ బెట్టు.. బీజేపీ మాట్లాడితే ఒట్టు.. !

డెడ్‌లైన్ అయిపోయింది.. కూట‌మిలో పొగ‌ల‌.. సెగ‌లు రేగాయ్‌..!

ధ‌ర్మ‌వ‌రంలో ‘ వైసీపీ కేతిరెడ్డి ‘ కి ఎదురు దెబ్బ‌.. లైట్ అనుకుంటే స్ట్రాంగ్ అయ్యిందే..!

YCP MLC: శిరోముండనం కేసులో వైసీపీ ఎమ్మెల్సీకి జైలు శిక్ష

sharma somaraju

Ram Gopal Varma: నైజీరియాలో జాబ్‌ చేయాల్సిన వ‌ర్మ ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. ద‌ర్శ‌కుడు కాక‌ముందు ఏం ప‌ని చేసేవాడు..?

kavya N

Janasena: ఏపీ హైకోర్టులో జనసేనకు బిగ్ రిలీఫ్

sharma somaraju

Prabhas: ప్ర‌భాస్ కోసం వేణు స్వామి వైఫ్ స్పెష‌ల్ గిఫ్ట్‌.. ఇంత‌కీ ఏం పంపించిందో తెలుసా?

kavya N

Israel: ఇరాన్ పై ప్రతిదాడి తప్పదంటూ ఇజ్రాయెల్ కీలక ప్రకటన

sharma somaraju

America: భారత్ లో లోక్ సభ ఎన్నికల వేళ అమెరికా కీలక వ్యాఖ్యలు

sharma somaraju