Breaking: Revanth Reddy టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి కరోనా పాజిటివ్..

Share

Revanth Reddy: టీపీసీసీ చీఫ్‌ రేవంత్ రెడ్డి తెలంగాణ రాజకీయాల్లో క్రియాశీలకంగా మారిన విషయం తెలిసిందే. ఈసారి కాంగ్రెస్ పార్టీని తెలంగాణలో ఎలాగైనా గెలిపించాలనే నిశ్చితాభిప్రాయంతో ఆయన ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో అతను కరోనా బారిన పడ్డారు. ఈ విష‌యాన్ని రేవంత్ రెడ్డి తాజాగా ట్విట్ట‌ర్ ద్వారా తెలిపారు.

తనకు కోవిడ్-19 పరీక్షలో పాజిటివ్ గా నిర్ధారణ అయిందని రేవంత్ రెడ్డి వెల్లడించారు. ప్రస్తుతం తేలికపాటి లక్షణాలు ఉన్నాయని చికిత్స తీసుకుంటున్నానని ఆయన పేర్కొన్నారు. గత కొద్ది రోజుల సమయంలో తనని కలిసినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని విజ్ఞప్తి చేశారు. మహమ్మారి నేపథ్యంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని ఆయన అందరికీ విజ్ఞప్తి చేశారు. అయితే కరోనా స్వల్ప లక్షణాలతో బాధపడుతున్న రేవంత్ రెడ్డి త్వరలోనే కోలుకుంటారని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. త్వరగా కోలుకోవాలని మరికొందరు కాంగ్రెస్ పార్టీ అభిమానులు ట్విట్టర్ వేదికగా ప్రార్థనలు చేస్తున్నారు. వీరందరికీ ధన్యవాదాలు చెబుతున్నారు రేవంత్ రెడ్డి.

రేవంత్ రెడ్డిని కలిసిన వ్యక్తులు ఇప్పుడు కాస్త కలవరపాటుకు గురైనట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు కోవిడ్-19 నిర్ధారణ టెస్టులు చేయించుకోవడానికి వెళ్తున్నారు.


Share

Recent Posts

Devatha 11August 622: ఇంట్లో నుంచి వెళ్లిపోయిన దేవి.. మా నాన్న ఎవరో చెప్పకపోతే రానన్న దేవి..

దేవి కనిపించడం లేదని రాధ ఇల్లంతా వెతుకుతుంది.. మాధవ్, వాళ్ళ అమ్మ నాన్నలు దేవి కోసం తెలిసిన వాళ్ళందరికీ ఫోన్ చేస్తారు.. ఎవ్వరూ లేరని చెబుతారు.. అప్పుడే…

1 hour ago

కొత్త సినిమా నిర్మాతలకు డెడ్ లైన్ పెట్టిన బాలకృష్ణ..??

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇబ్బందుల విషయంలో ఫిలిం ఛాంబర్ షూటింగ్ లు మొత్తం ఆపేయడం తెలిసిందే. దాదాపు వారం రోజులకు పైగానే సినిమా ఇండస్ట్రీలో అన్ని షూటింగులు బంద్…

1 hour ago

ఆగస్టు 11 – శ్రావణమాసం – రోజు వారి రాశి ఫలాలు

ఆగస్టు 11 - శ్రావణమాసం - గురువారం మేషం నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక వ్యవహారాలు ఆశాజనకంగా ఉంటాయి. కుటుంబ సభ్యుల ఆదరణ పెరుగుతుంది. వృత్తి…

3 hours ago

మ‌హేశ్ నెక్స్ట్ మ‌రింత ఆల‌స్యం.. ఎప్ప‌టికి పోస్ట్ పోన్ అయిందంటే?

రీసెంట్‌గా `స‌ర్కారు వారి పాట‌`తో మ‌రో హిట్ ను ఖాతాలో వేసుకున్న టాలీవుడ్ ప్రిన్స్ మ‌హేశ్ బాబు.. త‌న నెక్స్ట్ ప్రాజెక్ట్‌ను మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీ‌నివాస్‌తో…

4 hours ago

రూ. 10 కోట్లు ఆఫ‌ర్‌.. అయినాస‌రే ఆ ప‌ని చేయ‌న‌న్న బ‌న్నీ?!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తొలి పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`. ఎర్ర చంద‌నం స్మ‌గ్లింగ్ నేప‌థ్యంలో మాస్ ఎంట‌ర్టైన‌ర్‌గా రూపుదిద్దుకున్న ఈ చిత్రానికి సుకుమార్ ద‌ర్శ‌క‌త్వం…

5 hours ago

హాస్పిటల్ లో హీరోయిన్ టబు..!!

హీరోయిన్ టబు అందరికీ సుపరిచితురాలే. సౌత్ మరియు బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూ ఎప్పటినుండో హీరోయిన్ గా విజయవంతంగా రాణిస్తూ ఉంది. దాదాపు మూడు దశాబ్దాల పాటు…

7 hours ago