Chiranjeevi : చిరంజీవి – వెంకటేష్ – బాలకృష్ణ .. నాగార్జున టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో 60 ప్లస్ ఏజ్ సీనియర్ స్టార్ హీరోలు. గతంలో ఈ నలుగురు సీనియర్ స్టార్ హీరోల మధ్యనే గట్టి పోటీ ఉండేది. సంక్రాంతి… దసరా.. పండులకి ఈ సీనియర్ హీరోల సినిమాలు రిలీజై బాక్సాఫీస్ వద్ద భారీగా పోటీ పడీ సత్తా చాటేవారు. 100 రోజులు..150 రోజులు .. 200 రోజులు అంటూ సినిమాలు థియేటర్స్ లో హంగామా చేసేవి. కాని ఇప్పుడు ఆరోజులు పోయాయి. వారంలో ఎన్ని వందల కోట్లు వస్తే అదే రికార్డ్. ఆ హీరోనే మొనగాడు.. అన్నట్టు అయిపోయింది పరిస్థితి. అంతేకాదు ఒకప్పుడు మన తెలుగు సినిమా బడ్జెట్ ఎంత భారీ స్థాయిలో కేటాయించినా 50 కోట్ల వరకే ఉండేది.
కాని ఇప్పుడు 50 కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాలని చిన్న చూపు చూడటమే కాదు యంగ్ హీరోలు తప్ప ఆ బడ్జెట్ లో సినిమా చేసే స్టార్ హీరో ఒక్కరు కూడా లేడు. బాహుబలి తర్వాత తెలుగు సినిమా సత్తా ఖండాంతరాలు దాటింది. అంతకి నాలుగింతలు బడ్జెట్ కూడా పెరిగింది. పాన్ ఇండియన్ సినిమా అన్న ట్రెండ్ లో టాలీవుడ్ మునిగిపోయింది. 100 కోట్ల బడ్జెట్ తో నిర్మించే సినిమాలు కూడా వేళ్ళ మీద లెక్కపెడుతున్నారు. ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్. ఆయన సినిమాలన్ని 300 కోట్ల పైనే ఉంటున్నాయి. ప్రభాస్ మాత్రమే కాదు మిగతా హీరోల సినిమా బడ్జెట్ కూడా 150 కోట్ల కి పైగానే.
Chiranjeevi : చిరంజీవి – వెంకటేష్ – బాలయ్య మధ్య గట్టి పోటీ ఉంటుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు..?
ఇలాంటి పరిస్థితుల్లో కూడా మన సీనియర్ స్టార్స్ పోటీ పడుతున్నారు. చిరంజీవి ఆచార్య సినిమాతో మే 13 న రాబోతున్నాడు. వెంకటేష్ మే 14 న నారప్పతో రాబోతున్నాడు. ఇక నందమూరి బాలకృష్ణ కూడా BB3 తో మేలో వచ్చే అవకాశం ఉందంటున్నారు. అంతేకాదు ఈ లోపు నాగార్జున కూడా ఏదన్న సినిమాతో వచ్చినా రావచ్చు. ప్రభాస్ రాధే శ్యాం ఇంకా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయాల్సి ఉంది. అయితే ఈ మే లో మాత్రం ఖచ్చితంగా చిరంజీవి – వెంకటేష్ – బాలయ్య మధ్య గట్టి పోటీ ఉంటుందని ఇండస్ట్రీలో చెప్పుకుంటున్నారు. చూడాలి మరి ఎవరి సత్తా ఏంటో.
Mogalirekulu: నీకెంతా బలుపు రా?.. మొగలిరేకులు ఫేమ్ ఆర్కే నాయుడు పై సీనియర్ నటి ఫైర్..!