NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: సొంత ఇలాకా పులివెందులలో రూ.861.84 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు చేసిన సీఎం వైఎస్ జగన్

CM YS Jagan: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ తన సొంత నియోజకవర్గం పులివెందులలో రూ.861.84 కోట్లతో అభివృద్ధి చేసిన పలు నిర్మాణాలకు ప్రారంభోత్సవం చేశారు.

రూ.500 కోట్ల నాబార్డు, ఆర్ఐడీఎఫ్ నిధులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ గవర్నమెంట్ మెడికల్ కళాశాల, గవర్నమెంట్ జెనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) భవనాలను, పులివెందుల మైన్స్ సమీపంలో బనానా ప్రాసెసింగ్ యూనిట్ వద్ద రూ.20.15 కోట్ల వ్యయంతో నిర్మించిన బనానా ప్యాక్ హౌస్ (పులివెందుల మార్కెట్ కమిటీ) భవనాన్ని, రూ.38.15 కోట్ల వ్యయంతో అత్యాధునిక హంగులతో నిర్మించిన డాక్టర్ వైఎస్ఆర్ మినీ సెక్రటేరియేట్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు.

అలానే రూ.70 లక్షలతో నిర్మించిన వైఎస్ఆర్ జంక్షన్ ను, పులివెందుల మోడల్ టౌన్ ప్రాజెక్టులో భాగంగా రూ.11.04 కోట్ల వ్యయంతో అభివృధ్ధి చేసిన సెంట్రల్ బౌలే వార్డుకు,  రూ.20.69 కోట్లతో అధునాతన వసతులతో నిర్మించిన వైఎస్ జయమ్మ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్ భవన సముదాయాన్ని, రూ.80 లక్షల తో నిర్మించిన గాంధీ జంక్షన్ ను, రూ.65.95 కోట్ల తో వంద ఎకరాల్లో ఏర్పాటు చేసిన డాక్టర్ వైఎస్ఆర్ ఉలిమెల్ల లేక్ ఫ్రంట్ ను ప్రారంభించడంతో పాటు పారిశ్రామిక అభివృద్ధిలో భాగంగా ప్రయివేట్ పార్ట్నర్ ఆధ్వర్యంలో రూ.175 కోట్ల తో 16.63 ఎకరాల్లో నిర్మించిన ఆదిత్య బిర్లా యూనిట్ ను, ఇడుపులపాయ ఎస్టేట్ లో రూ.39.13 కోట్ల నిధులతో 16 ఎకరాల్లో నిర్మించిన వైఎస్ఆర్ మెమోరియల్ పార్క్ ను ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ .. అభివృద్ధికి నిలువెత్తు నిదర్శనంగా తీర్చిదిద్దిన పులివెందుల పట్టణం రాష్ట్రానికే ఆదర్శనీయమని అన్నారు. ముఖ్యమంత్రిగా మీ అందరి ముందు నిలుచున్నానంటే మీ అందరి అభిమానం, ఆశీస్సులు, దీవెనలే కారణమని అన్నారు.  తాను సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి పులివెందులలో ఎన్నో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టడం జరిగిందని అన్నారు. పులివెందుల నియోజకవర్గ అభివృద్ధి అనేది అనంతరం అని, కానుగుణంగా అభివృద్ధి కొనసాగుతూనే ఉంటుందని తెలిపారు. సొంత గడ్డపై మమకారం ఎప్పటికీ తీరిపోయేది కాదని అన్నారు.

YS Viveka Case: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ఊరట .. బెయిల్ మంజూరు చేసిన హైకోర్టు

Related posts

Prabhas: ప్ర‌భాస్ సినిమాల్లో ఆయ‌న త‌ల్లికి మోస్ట్ ఫేవ‌రెట్ మూవీ ఏదో తెలుసా.. బాహుబ‌లి మాత్రం కాదు!

kavya N

Vijay Deverakonda: విజ‌య్ దేవ‌ర‌కొండ ఫ్రీగా చేసిన సినిమాలేవి.. ఇండ‌స్ట్రీలో అత‌ని ఫ‌స్ట్ రెమ్యున‌రేష‌న్ ఎంత‌?

kavya N

Tollywood: టాలీవుడ్ కు మే 9 ఎందుకంత‌ స్పెష‌ల్‌.. అస‌లీ రోజు ప్ర‌త్యేక‌త ఏంటి..?

kavya N

Sai Pallavi: బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. చైల్డ్ ఆర్టిస్ట్ గా సాయి ప‌ల్ల‌వి చేసిన సినిమాలేంటి.. హీరోయిన్ గా ఛాన్స్ ఎలా వ‌చ్చింది.. ఆమె ఆస్తుల విలువెంతో తెలుసా?

kavya N

Kajal Aggarwal: పెళ్లి త‌ర్వాత సినిమాల ఎంపిక‌లో భ‌ర్త కండీష‌న్‌.. తొలిసారి నోరు విప్పిన కాజ‌ల్!

kavya N

Indian Student Missing: అమెరికాలో మరో తెలుగు విద్యార్ధి అదృశ్యం .. ఆందోళనలో కుటుంబ సభ్యులు

sharma somaraju

పిఠాపురంలో వ‌ర్మ‌… ముద్ర‌గ‌డ కూతురు కొత్త రాజ‌కీయం మొద‌లైందిగా..?

పవన్ కళ్యాణ్ ముగ్గురు భార్యలకు వైసీపీ టికెట్… బంప‌ర్ ఆఫ‌ర్‌..?

విశాఖలోనే సీఎంగా జగన్ ప్రమాణ స్వీకారం…!

ఎన్నిక‌లు అయిన వెంట‌నే అవినాష్‌రెడ్డి ఇండియా వ‌దిలి వెళ్లిపోతాడా..?

కాంగ్రెస్‌లోకి 25 మంది BRS ఎమ్మెల్యేలు… లిస్టులో టాప్ లీడర్లు..?

షర్మిలను ఓడించేందుకు కోమటిరెడ్డి కుట్రలు ..!

గేరు మార్చితేనే `న‌గ‌రి`లో భానోద‌యం… రోజా గేమ్ మామూలుగా ఉండ‌దు మ‌రి..?

AB Venkateswara Rao: ఏపీ ఇంటిలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుకు భారీ ఊరట..!!

sekhar

AP Elections: విజయవాడలో ఎన్డీఏ కూటమి నేతల రోడ్ షో..!!

sekhar