వావ్.. వాట్ ఏ క్రియేటివిటీ.. హేట్సాప్ భయ్యా.. వైరల్ వీడియో

క్రియేటివిటీ అనేది ఒక్కడి సొత్తు కాదు. ఆ విషయం ఎన్నోసార్లు నిరూపితం అయింది. క్రియేటివిటి అనేది ఆలోచించే విధానాన్ని బట్టి ఉంటుంది. నువ్వు పెద్ద తోపు అయితే నీకంటే పెద్ద తోపు ఇంకోడు ఉంటాడు. ఈ ప్రపంచంలో ఒకరిని మించి ఇంకొకరు ఉంటారు.

creativity with electronic waste video viral
creativity with electronic waste video viral

క్రియేటివిటి కొత్తగా.. అద్భుతంగా ఉండాలంటే దానికి తగ్గట్టుగా ఆలోచన ఉండాలి. సరిగ్గా ఆలోచించగలగాలి. మెదడుకు పదును పెట్టాలి. అలా చేస్తే ఎవ్వరికైనా క్రియేటివిటీ దాసోహం అంటుంది.

అలాంటి వీడియోనే ఇప్పుడు మనం చూడబోయేది. ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ వీడియోలో ఏముంది అంటే.. ఎలక్ట్రానిక్ వేస్టేజ్ ఉంటుంది కదా..అంటే కంప్యూటర్ కు సంబంధించిన సీపీయూ, మానిటర్, ఇతరత్రా వేస్టేజ్ అన్నింటితో కలిసి ఓ మనిషి బొమ్మను తయారు చేశారు. అది కూడా ఒక సైడ్ నుంచి చూస్తేనే మనిషి తల స్పష్టంగా కనిపిస్తుంది. ఒక వైపు నుంచి మరోవైపునకు తిరుగుతున్నా కొద్దీ.. మనిషి తల కనిపించి.. మళ్లీ ఎలక్ట్రానిక్ వేస్టేజ్ అంతా కనిపిస్తుంది. ఒక వేస్ట్ నుంచి బెస్ట్ తీసుకురావడమంటే ఇదేనేమో. ఏది ఏమైనా ఆ క్రియేటర్ తెలివిని మాత్రం నెటిజన్లు మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. మీరు కూడా ఆ వీడియోను చూసేయండి మరి..