Deepti Sunaina: దీప్తి సునయన.. దాదాపుగా మన తెలుగు రాష్ట్రాలలో ఆమె తెలియని యువత ఉండరంటే నమ్మి తీరాల్సిందే. షార్ట్ ఫిల్మ్స్, కవర్ సాంగ్స్, డబ్స్మాష్లతో కెరీర్ను స్టార్ట్ చేసిన దీప్తి మెల్లగా బిగ్ బాస్లాంటి అతిపెద్ద రియాలిటీ షోలో పార్టిసిపేట్ చేసే అవకాశాన్ని దక్కించుకుంది. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన తర్వాత కూడా దీప్తి సునయన తన సోషల్ మీడియాతోనే ఎక్కువగా కాలాన్ని వెళ్లబుచ్చింది. అలాంటి దీప్తిపై ప్రస్తుతం ఓ వార్త వైరల్గా మారింది. అదే షణ్నూతో బ్రేకప్ మేటర్.
Balakrishna: ‘అఖండ’ సినిమాను మర్చిపోవాల్సిందే..బాలయ్య కోసం గోపీచంద్ ప్లాన్ బి అప్లై చేస్తున్నాడు
Deepti Sunaina: అది ఆమె సొంత నిర్ణయమా?
అవుననే అంటున్నారు ఆమె సమీప బంధువులు. అయిదు సంవత్సరాల నుండి రిలేషన్షిప్లో ఉన్న వీరిద్దరినీ బిగ్ బాస్ రూమర్ తో విజయవంతంగా విడదీసింది. ఈ క్రమంలో తాజాగా మరో రూమర్ కూడా ఒక్కసారిగా అందరి చూపు దీప్తి వైపు తిప్పేలా చేసింది. అదేమంటే మన దీప్తి త్వరలోనే వెండితెరపై హీరోయిన్ గా అవతరించబోతుందట. ఇక ఇదేగాని నిజమైతే మాత్రం అమ్మడు దశ దిశ తిరిగినట్టే.
Republic Day Celebrations: ఇక్కడ ఇలా..అక్కడ అలా..! కేసిఆర్ లెక్కే వేరప్ప..!!
దీనిపై మన దీప్తి అభిప్రాయం ఇదే మరి!
ఇక ఈ వార్త అలా సోషల్ మీడియాలో వైరల్ అయ్యిందో లేదో.. విషయం కాస్త దీప్తి దగ్గరకు వెళ్ళింది. దాంతో దీప్తి ఒక్కసారిగా పొల్లమారింది. అవును… నిజమే. తాను హీరోయిన్ అవుతాననే విషయం తనకు కూడా తెలియదని, సదరు సో కాల్డ్ ఆర్టికల్ తన సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. ‘నాకే తెలీదే ఇది’ అంటూ క్యాప్షన్ పెట్టి తాను హీరోయిన్గా మారట్లేదు అని క్లారిటీ ఇచ్చేసింది. సో మై డియర్ బడుద్ధాయిలూ! ఇకనైనా ఇలాంటి సొల్లు వార్తలను రాయడం మానేయండి.