NewsOrbit
న్యూస్ హెల్త్

జొన్న‌ల‌తో ఎన్ని లాభాలు ఉన్నాయో తెలుసా?

క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ త‌ర్వాత చాలా మంది త‌మ ఆరోగ్యం పై అధికంగా శ్ర‌ద్ధ చూపుతున్నారు. మ‌రీ ముఖ్యంగా వివిధ ర‌కాల వ్యాధుల బారిన‌ప‌డ‌కుండా ఉండేందుకు రోగ నిరోధ‌క శ‌క్తిని పెంచే ఆహారం తీసుకోవడానికి అధిక ప్రాధాన్య‌త ఇస్తున్నారు. అయితే, చిరు ధాన్యాలైన కొర్ర‌లు, అరిక‌లు, జొన్న‌లు, రాగులు, స‌జ్జ‌లు ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా శ‌రీరానికి త‌గిన పోష‌కాలు అందుతాయ‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

అయితే, పైన చెప్పిన చిరుధాన్యాల‌లో త‌క్కువ ధ‌ర‌కు ల‌భిస్తూ.. అధిక ప్ర‌యోజ‌నాలు క‌లిగించేవి జొన్న‌లు. అలాంటి జొన్న‌ల ద్వారా క‌లిగే లాభాలు మీ కోసం..! జొన్న‌ల్లో శ‌రీరానికి అవ‌స‌ర‌మైన సూక్ష్మ పోషకాలు అధికంగా ఉంటాయి. మ‌రీ ముఖ్యంగా వీటిని ఆహారంగా తీసుకోవ‌డం ద్వారా శ‌రీరానికి అవ‌స‌ర‌మైన కాల్షియం అధికంగా ల‌భిస్తుంది. అలాగే, జొన్న‌ల్లో ఉండే ప్రోటీన్లు, ఐర‌న్‌, పీచు ప‌ద‌ర్థాలు ఉంటాయి. కాబ‌ట్టి వీటిని ఆహరంగా తీసుకోవ‌డం వ‌ల్ల‌ గుండె సంబంధిత అనారోగ్య స‌మ‌స్య‌లు ద‌రిచేర‌కుండా ఉంటాయి.

న‌రాల బ‌లహీన‌త‌ల‌ను త‌గ్గించే గుణంతో పాటు శ‌రీరంలో ఉండే చెడు ప‌ద‌ర్థాల‌ను దూరం చేయ‌డంలో జొన్న‌లు ప్ర‌భావ‌వంత‌గా ఉంటాయి. వీటిలో ఉండే కాల్షియం, ఫాస్ఫ‌ర‌స్ కార‌ణంగా ఎముక‌లు బ‌లంగా త‌యార‌వుతాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. జ్ఞాప‌క‌శ‌క్తిని పెంచ‌డంతో పాటు మ‌తిమ‌రుపును కూడా త‌గ్గిస్తాయి. కంటి చూపు స‌మ‌స్య‌లు కూడా త‌గ్గిపోతాయి.

అలాగే, జీర్ణ‌వ్య‌వ‌స్థ ప‌నితీరు మెరుగ‌వ‌డంతో పాటు సంబంధిత సమ‌స్య‌లు జొన్న‌లు తిన‌డం ద్వారా ద‌రిచేర‌కుండా ఉంటాయి. ఎందుకంటే జొన్న‌ల్లో ఫైబ‌ర్ అధికంగా ఉంటుంది. జీర్ణ వ్య‌వ‌స్థ‌ను మెరుగుప‌రిచే హ‌ర్మోన్ల ఉత్పత్తిలో జొన్న‌లు మంచి ఫ‌లితాన్ని చూపుతాయి. జొన్న‌ల్లో విట‌మిన్ బీ6 కూడా ఉంటుంది. పాలిచ్చే త‌ల్లులు, బిడ్డ‌ల‌కు ఇవి చాలా మంచివి. జొన్న‌ల‌తో చాలా ర‌కాలైన వంట‌కాలు కూడా త‌యారు చేస్తారు. వీటిని తీసుకోవ‌డం చాలా సుల‌భం. కాబ‌ట్టి ఆరోగ్యానికి అనేక ప్ర‌యోజ‌నాలు క‌లిగించే జొన్న వంటకాలు మీరు కూడా తినండి మ‌రి..!

Related posts

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju