NewsOrbit
జాతీయం న్యూస్

Arvind Kejriwal: ఢిల్లీ  సీఎం కేజ్రీవాల్ ఆరు రోజుల ఈడీ కస్టడీకి కోర్టు అనుమతి

Arvind Kejriwal: ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ఆప్ జాతీయ కన్వీనర్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఆరు రోజుల ఈడీ కస్టడీకి రౌస్ అవెన్యూ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ఈ నెల 28వ తేదీ వరకూ కేజ్రీవాల్ ను ఈడీ కస్టడీలోకి తీసుకుని విచారించనుంది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి మనీలాండరింగ్ కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను గురువారం రాత్రి ఆయన అధికారిక నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

Arvind Kejriwal

శుక్రవారం మద్యాహ్నం ఈడీ అధికారులు ఆయనను రౌస్ అవెన్యూ కోర్టులో హజరుపర్చి, ఈ కేసులో కేజ్రీవాల్ ప్రదాన కుట్రదారుగా పేర్కొంటూ ఆయనను పది రోజుల పాటు తమ కస్టడీకి అప్పగించాలని కోరారు. రెండు గంటల పాటు వాడివేడిగా వాదనలు కొనసాగాయి. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయమూర్తి ..కొద్ది గంటల తర్వాత తీర్పును వెలువరించారు. ఈడీ తరపున అదనపు సొలిసిటర్ జనరల్ రాజు, కేజ్రీవాల్ తరుపున అభిషేక్ మను సింఘ్వీ సహా పలువురు న్యాయవాదులు వాదనలు వినిపించారు.

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ కీలక సూత్రధారి అని ఈడీ అభియోగించింది. సౌత్ గ్రూప్ సంస్థకు, నిందితులకు మధ్య ఆయన మధ్యవర్తిగా వ్యవహరించారని ఈడీ తరపున న్యాయవాది కోర్టుకు వివరించారు. సౌత్ గ్రూపు సంస్థ నుండి కోట్ల రూపాయల ముడుపులు అందుకున్నారన్నారు.

పంజాబ్ ఎన్నికల కోసం ఆ సంస్థకు చెందిన కొందరు నిందితుల నుండి వంద కోట్లు డిమాండ్ చేశారని వివరించారు. రూ.45 కోట్ల ముడుపులను గోవా ఎన్నికల్లో ఉపయోగించారన్నారు. అవి నాలుగు హవాలా మార్గాల నుండి వచ్చాయని ఈడీ తరపు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు.

మరో పక్క సీఎం కేజ్రీవాల్ అరెస్టు చట్టవిరుద్దమని, ఆయనకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లేవని ఆయన తరపు న్యాయవాదులు వాదనలు వినిపించారు. అయితే ఈడీ పది రోజుల పాటు కస్టడీ కోరగా, ఆరు రోజులు మాత్రమే కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది.

YSRCP Vs TDP: ‘మీ పార్టీ వాళ్లే ..కాదు మీ బంధువర్గీయులే’ .. విశాఖ డ్రగ్స్ కేసులో మాటల యుద్ధం

Related posts

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju