ప్రముఖ వాహన తయారీ సంస్థ యమహా అంతర్జాతీయ మార్కెట్లో గణనీయమైన విక్రయాలను సాధిస్తున్నా ఎంట్రీ లెవల్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ యమహా ఎమ్ టీ -125 విశేష ఆదరణ పొందింది… ప్రస్తుతం ఈ ఎంట్రీ లెవల్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ ను భారతదేశ మార్కెట్లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తోంది..యమహా మోటార్ ఇండియా తన ఎమ్ టీ -125 కొనుగోలుదారుల కోసం దేశంలో కస్టమైజ్ ప్రోగ్రాం ను నిర్వహిస్తుంది.. “కస్టమైజ్ యువర్ వారియర్” పేరుతో 11 రకాల కలర్ ఆప్షన్లతో ఈ బైక్ ను కస్టమైజ్ చేసుకునే సౌకర్యాన్ని అందిస్తుంది..! ఈ బైక్ ఫీచర్లు ఇలా ఉన్నాయి..
ఫీచర్లు:
యమహా ఎమ్ టీ -15 బైక్ లో 150 సిసి లిక్విడ్ కూల్డ్ ఎస్ఓహెచ్సి ఇంజన్ను వేరియబుల్ వాల్వ్ యకచ్యూయేషన్ టెక్నాలజీని కూడా కలిగి ఉంది. ఇది గరిష్టంగా 18 బి హెచ్ పి పవర్ ను 13.9 ఎమ్ఎన్ టార్క్ను ఉత్పత్తి చేస్తుంది. దీనిని స్లిప్-అసిఫ్ట్ క్లచ్ తో స్పీడ్ గేర్ బాక్స్ వ్యవస్థను కలిగి ఉంది. ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కూలు , వెనుక భాగంలో షాక్ సస్పెన్షన్ అబ్జర్వర్లు ఉన్నాయి. రెండు వైపులా డిస్క్ బ్రేక్ అమర్చారు . ఇందులో 11 లీటర్ల ట్యాంక్ కూడా ఉంది. బిఎస్6 నిబంధనలకు అనుగుణంగా దీనిని తయారు చేశారు.
దీని ఎక్స్ షోరూం ధర రూ.1.43 లక్షలు. ఈ వేరియంట్లు 3 బాడీ కలర్ ఆప్షన్స్, వీల్స్ ను 4 రంగుల కలర్ ఆప్షన్లలో లభిస్తున్నాయి. ఈ స్ట్రీట్ ఫైటర్ దేశీయ మార్కెట్లో విడుదల చేస్తే మొదటి ఎంట్రీ లెవల్ స్ట్రీట్ ఫైటర్ మోటార్ సైకిల్ గా నిలుస్తుంది.