NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

కుప్పంలో క‌వ్వింపు… పులివెందుల‌లో అంతా సైలెన్సు… !

వ‌చ్చే ఎన్నికల్లో వైసీపీ అధినేత‌, సీఎం జ‌గ‌న్‌ను ఓడించి తీరాల‌నేది ప్ర‌ధాన ప్ర‌తిపక్షం టీడీపీ నిర్ణ‌యం. త‌మ కీల‌క స్థానాల్లో వైసీపీ అనుస‌రిస్తున్న వ్యూహాన్ని పూర్తిగా అధ్య‌య‌నం చేసిన టీడీపీ.. దానికి రెట్టింపు ఉత్సాహంతో వ్యూహాన్ని రెడీ చేసుకుని జ‌గ‌న్ ప్రాతినిధ్యం వ‌హిస్తున్న పులివెందులలో ప్ర‌యోగించేందు కు సిద్ధ‌మైంది. ఈ క్ర‌మంలో పులివెందుల కాక త‌గ్గ‌కుండా.. ప‌క్కా ప్లాన్‌తో ముందుకు సాగుతుండ‌డం గ‌మనా ర్హం. ఇప్ప‌టికే ఇక్క‌డ అభ్య‌ర్థిత్వాన్ని బీటెక్ ర‌వికి కేటాయించిన విష‌యం తెలిసిందే.

మ‌రోవైపు.. వైసీపీ నుంచి వ‌చ్చే వారికి పెద్ద పీట వేసేందుకు కూడా.. టీడీపీ రెడీ అయింది. ఈ క్ర‌మంలో ప‌లువురు కౌన్సిల‌ర్లు, ఇత‌ర నేత‌ల‌ను ఆక‌ట్టుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో క్షేత్ర‌స్థాయిలో ప్ర‌చారాన్ని కూడా ముమ్మ‌రం చేశారు. ముఖ్యంగా మ‌హిళ‌ల‌ను త‌న‌వైపు తిప్పుకోవ‌డం ద్వారా.. ఇక్క‌డ విజ‌యాన్ని సునాయాసం చేసుకునేందుకు టీడీపీ ప్ర‌య‌త్నాలు ముమ్మ‌రం చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే వైఎస్ వివేకా నంద‌రెడ్డి మ‌ర‌ణాన్ని.. దీనికి సంబంధించి వ‌చ్చిన వార్త‌ల‌ను కూడా ప్ర‌చార వ‌స్తువుగా చేసుకున్నారు.

క‌డ‌ప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డికి బీటెక్ ర‌వి స‌వాల్ రువ్వ‌డం వెనుక ఉన్న వ్యూహం ఇదేన‌ని తెలుస్తోం ది. ఇక‌, ఇదేస‌మ‌యంలో చంద్ర‌బాబు రా.. క‌ద‌లిరా! స‌భ‌ల్లోనూ.. ఇదే వ్యూహాన్ని అనుస‌రించారు. వివేకా హ‌త్య కు కార‌ణం.. గొడ్డ‌లి, సునీత వంటివాటిని ఆయ‌న ప్ర‌ధాన వ‌న‌రుగా చేసుకుని ప్ర‌చార అస్త్రంగా మా ర్చారు. ఇక‌, క్షేత్ర‌స్థాయిలోనూ ఈ విష‌యంపై చ‌ర్చ‌కు పెట్ట‌డం ద్వారా.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇక్క‌డ జ‌గ‌న్‌ను ఓడించా ల‌నేది ప్ర‌ధానంగా ముందుకు తీసుకువెళ్తున్న విష‌యం.

మ‌రో కీల‌క విష‌యం ఏంటంటే.. జ‌గ‌న్‌ను ఓడించ‌క‌పోయే ప‌రిస్థితి వ‌స్తే.. ఆయ‌న మెజారిటీని అయినా త‌గ్గించాల‌నేది టీడీపీ పెట్టుకున్న కీల‌క ల‌క్ష్యం. ఈ నేప‌థ్యంలోనే టీడీపీ చాలా దూకుడుగా ముందుకు సాగుతోంది. క్షేత్ర‌స్థాయిలో బీటెక్ ర‌వి.. ప్ర‌జ‌ల‌ను క‌లుస్తున్నారు. ఇప్పుడు కూడా ఆయ‌న వివేకా కేసు పైనే ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తున్నారు. ఇంకో వైపు.. సూప‌ర్ సిక్స్‌పైనా ప్ర‌చారం చేస్తున్నారు. మొత్తంగా చూస్తే.. కుప్పంలో వైసీపీ చేస్తున్న హ‌డావుడి పైకి క‌నిపిస్తుండ‌గా.. పులివెందుల‌లో టీడీపీ చాప కింద నీరులాగా వ్య‌వ‌హ‌రిస్తూ.. జ‌గ‌న్‌ను ఓడించేందుకు ప్ర‌య‌త్నిస్తుండ‌డం గ‌మ‌నార్హం.

Related posts

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N