NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

AP Budget 2024: ఏపీ అసెంబ్లీలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ .. రూ.2.86 లక్షల కోట్లతో బడ్జెట్ ను ప్రవేశపెట్టిన బుగ్గన

AP Budget 2024: ఏపీ అసెంబ్లీ 2024 -25 ఆర్ధిక సంవత్సరానికి సంబంధించిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బుధవారం శాసనసభలో బడ్జెట్ ను ప్రవేశపెట్టారు. అయిదేళ్లుగా బడ్జెట్ ను ప్రవేశపెట్టే అవకాశం తనకు దక్కిందన్నారు. జాతిపిత మహాత్మా గాంధీ సందేశంతో బడ్జెట్ ప్రసంగాన్ని ఆయన ప్రారంభించారు.

2024 – 25 ఆర్ధిక సంవత్సరానికి గాను రూ.2,86,389 కోట్ల అంచనాతో బడ్జెట్ ను మంత్రి ప్రవేశపెట్టారు. బడ్జెట్ లో ఏపీని సంపన్న ఆంధ్రగా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పుకొచ్చారు. వైఎస్ రాజశేఖరరెడ్డి, అంబేద్కర్ లాంటి దార్శనికుల ఆలోచనలతో తమ ప్రభుత్వం పాలన సాగిస్తొందని చెప్పారు. రాష్ట్ర సమస్యలను పాత, మూస పద్ధతులతో కాకుండా సరికొత్త విధానాన్ని అవలంబించామన్నారు.

పాలనా వికేంద్రీకరణ ద్వారా పౌర సేవలను ప్రజల వద్దకు తీసుకువెళ్లేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. పాలనా విభాగాలను పునర్ వ్యవస్థీకరించి అన్ని వ్రగాల వారికీ సాధికారిత అందించామన్నారు. విద్యార్ధులను ప్రపంచ స్థాయి పోటీకి సిద్దం చేసేలా ఆంగ్ల మాధ్యమ విద్యను తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు.

వెయ్యి పాఠశాలల్లోని 4,39, 395 మంది విద్యార్ధులకు సీబీఎస్ ఈ పరిధిలోకి తీసుకువచ్చామన్నారు. అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఐబీ పాఠ్యప్రణాళిక, ప్రతి విద్యార్ధికీ టోఫెల్ దృవీకరణ పత్రాన్ని అందించేలా ప్రయత్నం, కొత్త పారిశ్రామిక విధానంతో సంపన్న ఆంధ్రా, రీసర్వే, ల్యాండ్ టైటిలింగ్ చట్టాలతో భూభద్ర ఆంధ్రాగా ఏపీ మారిందని అన్నారు.

అన్ని రంగాలను అభివృద్ధి దిశగా పయనించేలా చర్యలు తీసుకున్నామని మంత్రి బుగ్గన తెలిపారు. వివిధ కార్పొరేషన్ల ద్వారా అనేక మంది అబ్దిదారులకు ఆర్థిక సాయం అందించి ఈ ప్రభుత్వం ఆసరగా నిలిచిందని చెప్పారు. ఆర్థిక వ్యవస్థలో మహిళలను సమాన భాగస్వామ్యులను చేశామన్నారు. విద్య, వైద్య రంగాలలో తమ ప్రభుత్వం కనపర్చిన శ్రద్ధ గతంలో మరే ప్రభుత్వం కనపర్చలేదని తెలిపారు. జిల్లాకు ఒక మెడికల్ కళాశాలను ఏర్పాటు చేశామని చెప్పారు. సంక్షేమ పథకాలను పార్టీ, కుల, మత, ప్రాంతాల తేడా లేకుండా ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా అందరికీ అందేలా చూడగలిగామని అన్నారు. రైతు ప్రయోజనాలే లక్ష్యంగా అనేక ప్రయోజనాలను అందించామని తెలిపారు.

బడ్జెట్ ముఖ్యాంశాలు

  • రూ.2,30,110 కోట్ల రెవెన్యూ వ్యయం
  • రూ.30,530 కోట్ల మూల ధన వ్యయం
  • రూ.24,758 కోట్ల రెవెన్యూ లోటు
  • రూ.55,817 కోట్ల ద్రవ్య లోటు అంచనా
  • రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో 3.51 శాతం మేర ద్రవ్య లోటు
  • జీఎస్డీపీలో 1.56 శాతం మేర రెవెన్యూ లోటు ఉంటుందని అంచనా ..

2024 – 25 ఆర్ధిక సంవత్సరంలో రూ.2,05,352 కోట్ల రెవెన్యూ రాబడి వస్తుందని బడ్జెట్ లో ఏపీ ప్రభుత్వం అంచనా వేసింది.

  • కేంద్ర పన్నుల ద్వారా రూ.49,286 కోట్లు రాబడి వస్తుందని అంచనా
  • రాష్ట్ర పన్నుల ద్వారా రూ.1,09,538 కోట్లు వస్తుందని అంచనా
  • పన్నేతర ఆదాయంగా రూ.14,400  కోట్లుగా అంచనా
  • గ్రాంట్ ఇన్ ఎయిడ్ ద్వారా రూ.32,127 కోట్లు వస్తుందని అంచనా
  • బహిరంగ మార్కెట్ ద్వార రూ.71 వేల కోట్లు రుణ సేకరణ చేయాలని ప్రభుత్వ లక్ష్యం
  • కేంద్రం నుండి రూ.61,642 కోట్ల రుణం తీసుకోవాలని ప్రభుత్వ యోచన
  • ఇతర మార్గాల ద్వారా మరో రూ.25వేల కోట్ల అప్పు చేయాలని బడ్జెట్ లో ప్రతిపాదన

Video Viral: అమెరికాలో హైదరాబాదీ యువకుడిపై దుండగుల దాడి .. తీవ్ర గాయాలు .. ఇదిగో వీడియో

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N