NewsOrbit
Entertainment News Telugu TV Serials

Prema Entha Madhuram February 7 2024 Episode 1172:పెళ్లి ఆగిపోయిందని గుండెలు పగిలేలా ఏడుస్తున్న దివ్య, రాదని కిడ్నాప్ చేయించిన మానస..

Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights

Prema Entha Madhuram February 7 2024 Episode 1172: అమ్మ అబ్బాయిని అమ్మాయిని తీసుకువెళ్లి ప్రధాన బట్టలు మార్చుకొని తీసుకురండి అని పంతులుగారు చెప్తారు. హరీష్ దివ్య పెళ్లి పీటల మీద కూర్చుంటారు. ఆ కీర్తికి స్పృహ వచ్చి పెళ్లి ఎక్కడ ఆగిపోతుందని నేను టెన్షన్ పడుతుంటే మధ్యలో వీళ్ళ గోల ఒకటి అని హరీష్ అనుకుంటాడు. పంతులుగారు వాళ్ళు వచ్చేలోపు మా పెళ్లి జరిపించవచ్చు కదా అని హరీష్ అంటాడు. వాళ్లను కూడా రానివ్వు అంత తొందర ఎందుకు అని పంతులుగారు అంటారు. కట్ చేస్తే ఇంతలో కీర్తికి స్పృహ వచ్చి ఎవరైనా ఉన్నారా అని డోర్ కొడుతుంది. ఇక ఎవ్వరు ఈ పెళ్లి జరగకుండా ఆపలేరు జరిగేది జరుగుతుంది అంత వీదికే వదిలేస్తాను కానీ సార్ కి ప్రమాదం కలిగే పరిస్థితి వస్తే పిల్లల్ని తీసుకొని దూరంగా వెళ్లిపోతాను అంతే అని అనుకుంటుంది అను. సారు కూడా ఏమీ చేయలేని పరిస్థితి అన్నీ నిజాలు బయటపడే పరిస్థితి వచ్చింది ఎవరు ఏమి చేయలేరు అని అను బాధపడుతుంది. ఇందులో జ్యోతి వచ్చి రాధ గారు మీరు ఇంకా రెడీ అవ్వలేదా పంతులుగారు పిలుస్తున్నారు రండి అని జ్యోతి అనుని తీసుకువెళ్తుంది.

Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights
Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights

హెల్ప్ ఎవరైనా ఉన్నారా అని కీర్తి పిలుస్తూ ఉండగా ఆర్య యాదగిరి వెళ్తూ ఉంటారు.యాదగిరి ఈ రూమ్ లో ఎవరో ఉన్నారు అని డోర్ తీసి చూసేసరికి కీర్తి కనిపిస్తుంది తనని కుర్చీలో కూర్చోబెట్టి నీళ్లు తెచ్చి మొహం మీద చల్లుతాడు యాదగిరి. ఎవరమ్మా నువ్వు ఈ దెబ్బలేంటి అని ఆర్య అంటాడు. ఈ అమ్మాయి హరీష్ దోస్తు అని యాదగిరి అంటాడు. నా పేరు కీర్తి అండి నేను హరీష్ ఫ్రెండ్ ని అని జరిగిందంతా చెప్తుంది కీర్తి. ఆ మాటలు వినగానే కోపం వస్తుంది ఆర్య కి. కట్ చేస్తే, అనుని తీసుకువచ్చి పెళ్లి పీటల మీద కూర్చోబెడతారు.  జ్యోతి అన్నయ్య ఏ డే అని సుగుణ అడుగుతుంది. అదిగో వస్తున్నాడమ్మా అని జ్యోతి అంటుంది. అయ్యా మీరు వచ్చి కూర్చోండి పెళ్లి టైం అవుతుంది అని పంతులుగారు అంటాడు. పంతులుగారు ఈ పెళ్లి జరగదు అందరూ వెళ్ళండి అని యాదగిరి చెప్తాడు.

Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights
Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights

ఎందుకు పెళ్లి జరగదు ఇందాక దివ్య చేసినందుకా అప్పుడే సారీ చెప్పేసింది కదా ఇప్పుడు మళ్ళీ పెళ్లి ఆపడం దేనికి అని హరీష్ అంటాడు. నీకు రీజన్స్ కావాలా అని కీర్తిని పిలుస్తాడు ఆర్య. కీర్తిని చూసి గుండె ఆగిపోయినంత పని అవుతుంది హరీష్ కి. ఎవరు అమ్మాయి మా పెళ్లి ఎందుకు జరగదు అని దివ్య అంటుంది. హరీష్ చెప్తాడు చెప్పు హరీష్ అని ఆర్య అంటాడు. ఆ అమ్మాయి ఎవరో నాకు తెలియదు అని హరీష్ అంటాడు.అట్లనా అయితే ఆ అమ్మాయిని కొట్టిన రూమ్లో ఎందుకు పడుకోపెట్టావ్ అని యాదగిరి అంటాడు
ఆ అమ్మాయి ఎవరో తెలియదు కానీ వచ్చి పెళ్లి చేసుకో ఇప్పుడు కడుపు అంటుంది దానికి నేనేం చేయను అని హరీష్ అంటాడు. ఇందాక అమ్మ ఎవరో తెలియదన్న వ్ అని ఆర్య అంటాడు. హరీష్ ఇదంతా అబద్ధమని చెప్పు అని దివ్య అంటుంది. వాడేం చెప్తాడండి దుర్మార్గుడు ప్రేమ పేరుతో నన్ను మోసం చేసి డబ్బు కోసం నిన్ను పెళ్లి చేసుకుంటున్నాడు కావాలంటే ఫోన్ లో సాక్షాలు ఉన్నాయి చూడండి అని కీర్తి ఫోటోలు అన్నీ చూపెడుతుంది దివ్యకి. అవన్నీ చూసిన దివ్య ఎందుకు నన్ను ఇలా మోసం చేసావు అని నిలదీస్తుంది దివ్య. మన పెళ్లి ఆపడానికి ఇదంతా జరిపిస్తున్నాడు మన పెళ్లి అవనివు తర్వాత నీకు చెప్తాను అని హరీష్ అంటాడు.

Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights
Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights

యాదగిరి ఏంట్రా నాటకం ఆడుతున్నావ్ అని గలపాటి ఏడుస్తాడు ఆర్య చంప మీద లాగిపెట్టి ఒకటి ఇస్తాడు. నా చెల్లిని మోసం చేయాలని చూస్తావా ఇంకొకసారి ఏ అమ్మాయి జీవితంతో ఆడుకున్నావని తెలిసిందో లైఫ్ మొత్తం జైల్లోనే గడ్పాల్సి వస్తుంది ఇడియట్ ఆ అమ్మాయిని ఇంటికి తీసుకువెళ్ళు ఆమెకి ఏమైనా జరిగిద ని తెలిసిందో ఏం చేస్తానో నాకే తెలియదు అని ఆర్య అంటాడు. హరీష్ ఆ అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోతాడు. పెళ్లి ఆగిపోవడంతో దివ్య ఏడుస్తుంది. ఇప్పుడు ఏం లాభమే ఈ పెళ్లి వద్దు అన్న నువ్వే కావాలి అని వాడి వెంట పడ్డావు కదా మీ అన్నయ్య సమయానికి తీసుకువచ్చి నీ జీవితాన్ని కాపాడాడు లేదంటే జీవితాంతం నువ్వు మేము బాధపడాల్సి వచ్చేది అని సుగుణ అంటుంది. దివ్య ఏడవకే ఊరుకో అని జ్యోతి అంటుంది.  తల పొగరు దిగేదాకా ఏడవని ఇప్పుడు తెలిసిందా వాడు గోల్డ్ కాదు గులకరాయ్ అని యాదగిరి అంటాడు. దివ్య మనం ఒకరి గురించి ఏడుస్తున్నాము అంటే జీవితంలో వారితో మనం ఉండే అర్హత లేనట్టే అని ఆర్య అంటాడు. అమ్మ ఈ పెళ్లి ఆగిపోయినట్టేనా అని పంతులుగారు అంటారు. పెళ్లి జరుగుతుంది పంతులుగారు  సూర్య వచ్చి పీటల మీద కూర్చో నాన్న అని సుగుణ అంటుంది.

Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights
Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights

దివ్య బాధపడుతుదని చెప్పి ఈసారి పెళ్లి ఆపేస్తారేమో అని అనుకుంటుంది అను. సార్ దివ్య గురించి ఆలోచించి పెళ్లి ఆపకండి సార్ అని యాదగిరి అంటాడు. ఆర్య వెళ్లి అనుని కూర్చోబెట్టి పెళ్లి పీటల మీద కూర్చుంటాడు. ఇక్కడ ఏం జరగకూడదు అనుకున్నాము అదే జరుగుతుంది పదండి వెళ్దాం అని మనసా అంటుంది. కాస్త ఓపిక పట్టు మానసి జరగాల్సిన డ్రామా ఇంకా చాలా ఉంది అని ఛాయా అంటుంది. ఇంతలో ఎవరో పెళ్లి మండపంలో టపాస్ పేలుస్తారు. ఎవర్రా అది అని యాదగిరి అంటాడు. యాదగిరి ఎవరో పిల్లని కిడ్నాప్ చేయడానికి వచ్చి ఉంటారు అని ఆర్య పిల్లలని పట్టుకుంటాడు. ఇంతలో ఎవరో కారు వేసుకొని ముసుగులు తొడుక్కొని లోపలికి వస్తారు. అనుని తీసుకొని వెళ్ళిపోతారు.

Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights
Prema Entha Madhuram Today Episode February 7 2024 Episode 1172 Highlights

ఆ పోగలో ఏమీ కనిపించక ఊపిరాడక అందరూ అల్లాడుతూ ఉంటారు. పొగా ఆగిపోయింది ఎవరికి ఏమీ కాలేదు కదా అందరూ బాగానే ఉన్నారు కదా అని ఆర్య అంటాడు. సూర్య రాదేది రా అని సుగుణ అంటుంది. ఈ ప్లాన్ నీదేనా అన్నట్టు మానస అంటుంది. చూసావా అని ఛాయా సైగ చేస్తుంది. అమ్మ అని పిల్లలు ఏడుస్తారు. ఇదంతా మీరే చేశారా అని నాకు తెలుసు రాధ గారు ఎక్కడ అని ఆర్య చాయ్ ని అంటాడు.  పోయే భార్య ఏమైందో మాకేం తెలుసు సూర్య మీతో పాటు మేము కూడా ఇక్కడే ఉన్నాం కదా అని ఛాయా అంటుంది. తనను కిడ్నాప్ చేయాల్సిన అవసరం మీకు తప్ప ఇంకెవరికి లేదు అని ఆర్య అంటాడు..

Related posts

Vijayashanti – Anushka Shetty: విజ‌య‌శాంతి డ్రీమ్ రోల్ లాగేసుకున్న అనుష్క‌.. నిజంగా స్వీటీ అంత అన్యాయం చేసిందా?

kavya N

Nayanthara: అక్క పాత్ర‌కే రూ. 20 కోట్లా.. ఇది మ‌రీ టూ మ‌చ్‌గా లేదా న‌య‌న్‌..?

kavya N

Samyuktha Menon: టాలీవుడ్ లో ఆ స్వేచ్ఛ ఉండ‌దు.. ఇక్క‌డ న‌టించ‌డం చాలా క‌ష్టం.. సంయుక్త షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Karthika Deepam 2 May 10th 2024 Episode: అనసూయ అసలు రూపం సుమిత్రాకు చెప్పిన దీప.. అంతా సీక్రెట్ గా వినేసిన కార్తీక్..!

Saranya Koduri

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు ఫ‌స్ట్ వీక్ క‌లెక్ష‌న్స్‌.. రూ. 4.50 కోట్ల టార్గెట్ కు వ‌చ్చిందెంతంటే..?

kavya N

Jyothi Rai: అందాల ఆర‌బోత‌లో హీరోయిన్ల‌నే మించిపోతున్న జ్యోతి రాయ్‌.. తాజా ఫోటోలు చూస్తే ఎవ్వ‌రైనా టెంప్ట్ అవ్వాల్సిందే!

kavya N

Kovai Sarala: ఆ కార‌ణం వ‌ల్లే పెళ్లే చేసుకోలేదు.. అక్క‌లు ఇంట్లో నుంచి గెంటేశారు.. కోవై స‌ర‌ళ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

BrahmaMudi May 10 Episode 406 :రాజ్ నీ ఓదార్చి మాట ఇచ్చిన కావ్య.. రాహుల్, రుద్రాణి నీ కొట్టిన స్వప్న.. సుభాష్ ఆలోచన.. రేపటి ట్విస్ట్..

bharani jella

Nuvvu Nenu Prema May 10 Episode 620:పద్మావతి విక్కి ల ప్రేమ.. కుచల మీద కోప్పడ్డ నారాయణ.. ఇంటికి దూరమైన అరవింద బాధ..

bharani jella

Satyadev: పగ కోసం మొక్కను చంపడం.. తమిళ్ హీరోయిన్ పై సత్యదేవ్ ఫైర్..!

Saranya Koduri

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ పుట్టినరోజు నాడు ఫాన్స్ కి ఫుల్ మీల్స్.. రాబోయే మూడు సినిమాలు ఇవే..!

Saranya Koduri

Today OTT Releases: నేడు ఒక్కరోజే ఓటీటీలోకి వచ్చిన సూపర్ హిట్ మూవీస్ ఇవే..!

Saranya Koduri

This week OTT Releases: ఈ వారం ఓటీటీలోకి రానున్న 8 సినిమాలు ఇవే.. ప్రతి ఒక్కరి చూపు ఆ సినిమాపైనే..!

Saranya Koduri

Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ ఆస్తుల విలువ ఎంతో తెలుసా..!

Saranya Koduri