NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

చిన్న టిక్ వలన ఎంత పెద్ద ప్రమాదమో తెలుకోండి.

 

 

మనీ లెండింగ్ యాప్స్ ఈ యాప్స్ గురించి తెలియని వారే ఉండరు.అత్యవసర సమయాల్లో కాగితాలపై సంతకాలు, సవాలక్ష నిబంధనలు లేకుండా నిమిషాల వ్యవధిలోనే వ్యక్తిగత రుణాలను సులభంగా అందిస్తుంది. ఆన్లైన్ యాప్ లు ఇప్పుడు గణనీయంగా పెరిగాయి. క్రెడిట్ కార్డులుతో అవసరం లేకుండానే ఈ యాప్స్ డబ్బును ఇస్తున్నాయి.వీటిని ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. వచ్చిన చిక్కేమిటంటే రుణాల వసూలు లో రెచ్చిపోతున్న కలెక్షన్ ఏజెంట్లు వారి తీరు ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

 

 

లాక్ డౌన్ తో సూక్ష్మ , చిన్న తరహా పరిశ్రమల్లో ఉద్యోగాలు లేక, కార్మికులు ఆర్థిక సంక్షోభంలో పడ్డారు. టీచర్లు, ఔట్సోర్సింగ్ కార్మికులు ఇలా పలు రంగాలకు చెందిన వారు ఏడు నెలలుగా వేతనాలు లేక అల్లాడుతున్నారు. ఇలాంటి వారు తెలిసిన వారి దగ్గర అప్పులు చేసి ఇంతకాలం నెట్టుకొచ్చారు. వాటిని తీర్చలేక ఇంటి అవసరాల కోసం అని అప్పుల యాప్ లపై ఆధార పడుతున్నారు. చిన్న మొత్తంలో అప్పు చేస్తే పర్వాలేదు కానీ, భారీ మొత్తంలో అప్పు చేస్తే అప్పులు వసూలు చేసేందుకు కలెక్షన్ ఏజెంట్లు రంగంలోకి దిగుతున్నారు.

 

 

వారి తీరు ఎలా ఉంటుందంటే మీ ఫ్రెండ్ రమేష్ కి యాక్సిడెంట్ అయిందని అర్జెంటుగా డబ్బులు పంపండి అంటూ సందేశాలు రావడంతో మిత్రులు వెంటనే రాజేష్ కు ఫోన్ చేశారు. బాగానే ఉన్నాడు అని తెలిసి ఊపిరిపీల్చుకున్నారు. కానీ ఆ మెసేజ్లు ఎవరు పంపారో మొదట్లో వారికి అర్థం కాలేదు. ఆరాతీస్తే రాజేష్ ఓ యాప్ ద్వారా తీసుకున్న అప్పు సకాలంలో చెల్లించలేక పోయినందున దాని తాలూకు మనుషులు ఇలా బద్నాం చేశారని అని తేలింది. అంతేకాదు మీ ఆయన తీసుకున్న అప్పు తీర్చకపోతే ఇంట్లో ఉన్న వస్తువులను ఎత్తుకు పోతాం అంటూ ఫోన్ లో వచ్చిన బెదిరింపులతో ఓ మహిళ హతశురాలు అయ్యింది. ఆరా తీసిన ఆమె రూ.లక్షలు అప్పు చేసిన ఫలితమని తలపట్టుకుంది. ఈ రెండు సందర్భాల్లో కాల్ చేసింది కలెక్షన్ ఏజెంట్లు వీరంతా వివిధ మనీ లెండింగ్ యాప్స్ కోసం పని చేస్తుంటారు. ఏం చేసినా సరే అసలు, వడ్డీతో సహా రాబట్టేందుకు వారు ఇలా హద్దుమీరుతున్నారు.

ఇటీవల ఐపీఎల్‌ మొదలైనప్పడు నుంచి ఈ యాప్‌ల ద్వారా అప్పుచేసే యువకులు విపరీతంగా పెరిగారు. వీరు ఆన్‌లైన్‌ గేమ్స్‌ కోసం భారీగా అప్పులు చేస్తన్నారు.లక్సెట్టిపేటలో ఓ యువకుడు రూ.15 లక్షలు ఇదే రీతిలో అప్పుచేసి తీర్చలేక ఆత్మహత్య చేసుకున్నాడు.రూ.20 వేలలోపు ఉండే చిన్న రుణాల వసూళ్ల లోనూ కలెక్షన్‌ ఏజెంట్లు ఇష్టానుసారంగా ప్రవర్తించడంతో బాధితులు వాపోతున్నారు. దీనిపై యాప్‌ల యాజమాన్యాలకు ఫిర్యాదు చేస్తే, ‘మా దృష్టికి రాలేదంటూ’ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. నిజానికి కంపెనీ సహకారం లేకుండా కాంటాక్ట్స్‌ కలెక్షన్‌ ఏజెంట్ల చేతుల్లోకి వెళ్లడం అసాధ్యమని పలువురు చెబుతున్నారు.

 

అసలు వీరికి కాంటాక్ట్స్ ఎలా తెలుస్తున్నాయంటే…

మనీ లెండింగ్‌ యాప్స్‌కు మొబైల్‌ ప్లేస్టోర్స్‌లో కొదవేం లేదు. ఇందులో రూ.1,000–రూ.15 లక్షల దాకా అప్పులిస్తూ, రూ.1 నుంచి రూ.3 వరకు వడ్డీ వసూలు చేస్తున్నాయి. అయితే వీటిని డౌన్‌లోడ్‌ చేసే క్రమంలో కంపెనీ కి సంబంధించిన కొన్ని షరతులను అంగీకరించాల్సి ఉంటుంది. చిరునామా, వ్యక్తిగత వివరాలు, ఆధార్, పాన్‌ నంబర్‌ వివరాలు తెలపాలి. విద్యార్థులకైతే ఆధార్, కాలేజీ ఐడీ కార్డు సరిపోతుంది. అలాగే, ఫోన్‌ కాంటాక్ట్స్‌ను యాక్సెస్‌ చేయమంటారా? అని అడుగు తుంది. దీన్ని వినియోగదారులు పట్టించుకోక ‘ఓకే’ కొడుతున్నారు. దీంతో రుణగ్రహీతల ఫోన్‌ నంబర్లన్నీ యాప్‌ ద్వారా యాజమాన్యానికి యాక్సెస్‌ అవుతున్నాయి. దీన్ని అవకాశంగా తీసుకుంటున్న కలెక్షన్‌ ఏజెంట్లు.. అప్పు తీసుకున్న వ్యక్తి కాంటాక్ట్స్‌లోని ఆత్మీయులు, కుటుంబసభ్యులకు ఫోన్‌చేసి ఇలా ఇబ్బందులకు గురిచేస్తన్నారు.

చిన్న టిక్ వలన ఎంత పెద్ద ప్రమాదమో చూసారా అందుకే షరతులను ఒకటికి రెండు సార్లు చదివి టిక్ చేయాలి. అంత సులువుగా డబ్బు ఇస్తున్నప్పుడు ఇలాంటి షరతులను వినియోగదారులు పట్టించుకోకుండా తరవాత జరిగే వాటి గురించి ఆలోచించలేక పోతున్నారు.నేటి విద్యార్థులు ప్రమాదకర టెక్నాలజీల మధ్య ఉన్నారు. సెలబ్రిటీల జీవితాలను కాపీ కొట్టేందుకు బెట్టింగ్ కోసం, మనీలెండింగ్‌ యాప్‌లు డౌన్‌లోడ్‌ చేసుకుం టున్నారు. యాంటీ ర్యాగింగ్‌ స్క్వాడ్‌ తరహాలోనే ప్రతీ కాలేజీలో ప్రత్యేక సెల్స్‌ ఏర్పాటుచేసి విద్యార్థులు ఇలాంటి ఉచ్చులో పడకుండా చూడాలి.వినియోగదారులారా ఇకనైనా మేలుకోండి.

Related posts

‘ బోడే ‘ ప‌వ‌ర్‌… పెద్దిరెడ్డికి లైఫ్‌లో ఫ‌స్ట్ టైం స‌రైన మ‌గాడు త‌గిలాడు..!

మెగా డెసిష‌న్ ఏంటి? పిఠాపురం వ‌స్తున్న‌ట్టా.. రాన‌ట్టా..!

`ల్యాండ్ టైటిలింగ్`తో రాజ‌కీయ‌ న‌ష్టం ఎవ‌రికి..? లాభం ఎవ‌రికి..?

Ram Pothineni: కొత్త ప్ర‌యాణానికి శ్రీ‌కారం చుడుతున్న రామ్‌.. ఫ్యాన్స్ ముచ్చ‌ట తీర‌బోతోందోచ్..!

kavya N

Allu Arjun: 20 ఏళ్ల నుంచి షూటింగ్స్ కు వెళ్లే ముందు అల్లు అర్జున్ పాటిస్తున్న‌ ఏకైక‌ రూల్ ఏంటో తెలుసా?

kavya N

Varalaxmi Sarathkumar: నాగ‌చైత‌న్య-వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్‌కుమార్ కాంబినేష‌న్ లో ప్రారంభ‌మై ఆగిపోయిన సినిమా ఏదో తెలుసా?

kavya N

Ramya Krishnan: హీరోయిన్లు ఎదగాలంటే కొన్నిసార్లు సర్దుకుపోవాల్సిందే.. కాస్టింగ్ కౌచ్‌పై ర‌మ్య‌కృష్ణ షాకింగ్ కామెంట్స్‌!

kavya N

Deepika Padukone: షాకింగ్ న్యూస్.. విడాకులకు సిద్ధ‌మ‌వుతున్న దీపికా పదుకొనే.. బిగ్ హింట్ ఇచ్చిన రణవీర్!

kavya N

Brahmamudi May 08 Episode 404:అత్త కోసం సాక్ష్యం నాశనం చేసిన కావ్య.. కోటి కోసం రుద్రాణి తిప్పలు.. అపర్ణ మరో కఠిన నిర్ణయం..?

bharani jella

పవన్ కళ్యాణ్ కు కట్టప్పగా మారిన మహాసేన రాజేష్ ?

బెజ‌వాడ తూర్పు: అవినాష్ క‌ష్టం వృథానేనా.. మ‌ళ్లీ గ‌ద్దేకే క్లీయ‌ర్ విక్ట‌రీ..?

సుస్వ‌ర మ్యూజిక్ అకాడ‌మీ 21 వార్షికోత్స‌వం… అంబ‌రాన్నంటిన సంబ‌రాల‌తో మార్మోగిన డ‌ల్లాస్‌

Lok Sabha Election 2024: ముగిసిన మూడో దశ పోలింగ్

sharma somaraju

Arvind Kejriwal: కేజ్రీవాల్ మద్యంతర బెయిల్ పై తీర్పు రిజర్వు .. సుప్రీం కీలక వ్యాఖ్యలు

sharma somaraju

Venkatesh: ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్ధికి మద్దతుగా విక్టరీ వెంకటేష్ రోడ్ షో

sharma somaraju