NewsOrbit
న్యూస్

సొంత అజెండాతో జనసేనాని ముందుకు ? మౌన ముద్ర అందుకు!!

జనసేనాని పవన్ కళ్యాణ్ గతంలో లా దూకుడు పాలిటిక్స్ మంచిది కాదన్న ఆలోచనలో ఉన్నట్లు ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది.

 

అందుకే మూడు రాజధానులు, సీఆర్డీఏ రద్దు బిల్లుల వ్యవహారంలో గవర్నర్ నిర్ణయం తరువాత స్పందించడమే మంచిదని కొందరి సలహా మేరకు పవన్ గమ్మున ఉన్నట్లు చెబుతున్నారు. రాజధాని ఎక్కడికి తరలిపోదని గతంలో పవన్ రైతులకు హామీ ఇచ్చారు. తాను మూడు రాజధానుల అంశంపైనే విభేదిస్తూ బిజెపి తో పొత్తు సైతం పెట్టుకున్నట్లు ఒక సందర్భంలో పేర్కొన్నారు.అయితే ఆయన జట్టు కట్టిన కమలం గవర్నర్ ను ఈ బిల్లులు ఆమోదించకండి అని లేఖ రాసినా కూడా జనసేనాని ఉలుకు పలుకు లేకపోవడం తో అందరిలో ఆసక్తి పెరుగుతుంది. తాను పొత్తు పెట్టుకున్న బీజేపీలోనే అమరావతి రాజధానిపై రెండు వర్గాలుగా విడిపోయి ఉన్నాయి.

ఈ పరిస్థితుల్లో రాజధాని అంశం తాను ఎందుకు ప్రస్తావించాలన్నది పవన్ కళ్యాణ్ అభిప్రాయంగా అనిపిస్తుంది. గవర్నర్ నిర్ణయం తర్వాతనే పవన్ కల్యాణ్ రాజధాని అంశంపై ప్రస్తావించే అవకాశముంది.నిజానికి ఇప్పుడు పొలిటికల్ ఫీల్డ్ లో ప్రధాన యుద్ధం మూడు రాజధానుల అంశమే. దీనిపై టిడిపి, బిజెపి, కమ్యూనిస్ట్ లు అంతా ఒక్కటై అమరావతి ని ముక్కలు చేసేందుకు ససేమిరా అంటున్నాయి.

అయితే రాజధానిని ముక్కలు చేసేందుకు అస్సలు ఒప్పుకునేది లేదని ఒకనాడు రైతుల ఉద్యమానికి బాసటగా నిలిచిన పవన్ కళ్యాణ్ ప్రస్తుతం మౌన ముద్ర లో ఉన్నారు. కనీసం ట్విట్టర్ వేదికగా అయినా ఆయన స్పందించకపోవడం పోవడం ఎపి లో చర్చనీయాంశంగా మారింది. గవర్నర్ వద్దకు చేరిన కీలక బిల్లుల సమయంలో ఎందుకు ఆయన మాట్లాడటం లేదన్న సందేహాలు పెల్లుబికుతున్నాయి.సొంత రాజకీయ అజెండాను అమలు చేసుకునే ఉద్దేశ్యం తోటే పవన్ కల్యాణ్ ఇంతటి ముఖ్యమైన అంశం విషయంలో మూగనోము పట్టారన్నది రాజకీయ పరిశీలకుల విశ్లేషణ.

 

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N