Data plans: సరిగ్గా కొన్ని సంవత్సరాల క్రితం ఏ ముహూర్తాన జియో టెలికామ్ ఫ్రీగా తన నెట్ వర్క్ ని స్టార్ట్ చేసిందో అదిగో అక్కడినుండి నెట్ వాడకం బాగా పెరిగింది. సామాన్యులకి కూడా ఇంటర్నెట్ అనేది తన దైనందిత జీవితంలో ఓ భాగం అయిపోయింది. ఇక తరువాత కరోనా పుణ్యమాని ఫ్రమ్ హోమ్ నడుస్తున్న ప్రస్తుత కాలంలో కూడా చాలా మందికి డేటా అవసరం ఎక్కువ ఏర్పడింది. ఈ క్రమంలో బ్రాడ్‌బ్యాండ్ సదుపాయం లేని వారు చాలా మంది మొబైల్ డేటాపై ఆధారపడటం మనం చూస్తూ వున్నాం. కాబట్టి అలాంటి వారికి అత్యధిక డేటా కావాల్సి వస్తుంది.
AP Politics: వైసీపీ, టీడీపీ, జనసేన పొత్తు..! ఆ విషయంలో ముగ్గురూ ఒకటేగా..!
Data plans: అలాంటివారు ఎంచుకోవలసిన కొన్ని ప్లాన్స్.!
ఇలాంటి వారి కోసమే ఎక్కువ డేటా ప్రయోజనాలతో ప్రముఖ టెలికం సంస్థలు అయినటువంటి రిలయన్స్ జియో, భారతి ఎయిర్టెల్, వొడాఫోన్ ఐడియా కొన్ని ప్లాన్లను అందుబాటులో ఉంచాయి. రోజుకు 3జీబీ డేటా లిమిట్ తో కూడా ప్లాన్లను అందుబాటులో ఉంచడం అనేది కొసమెరుపు. ఇపుడు ఏ నెట్‌వర్క్‌లో ఏయే ప్లాన్లు ఎలా ఉన్నాయో చూద్దాం. రోజుకు 3జీబీ డేటా వచ్చేలా 4 ప్లాన్లను అందిస్తోంది రిలయన్స్ జియో. అందులో ఒకటి రూ.419 ప్లాన్. దీనితో గనక రీచార్జ్ చేసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది.
Radhe Shyam – RRR: ‘రాధే శ్యామ్’ టార్గెట్ ‘ఆర్ఆర్ఆర్’ మూవీనే..అందుకే ప్లాన్ మార్చిన ప్రభాస్..?
మిగిలిన ప్లాన్లు చుడండి..
అలాగే రూ.601 ప్లాన్ కూడా అంబాటులో ఉంది. దీని ద్వారా డిస్నీ+ హాట్‌స్టార్ ఏడాది సబ్స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. అలాగే అదనంగా 6జీబీ డేటా కూడా వస్తుంది. ఇక రూ.1199 ప్లాన్ ద్వారా రోజుకు 3జీబీ డేటా లభిస్తుంది. 84రోజుల వ్యాలిడిటీ ఉండే ఈ ప్లాన్ ద్వారా అన్లిమిటెడ్ కాల్స్, రోజుకు 100ఎస్ఎంఎస్లు దక్కుతాయి. అలాగే 365 రోజుల వ్యాలిడిటీతో రోజుకు 3జీబీ డేటా వచ్చే రూ.4,199 ప్లాన్ కూడా జియోలో అందుబాటులో ఉంది. ఒకసారి అధికారిక వెబ్ సైట్స్ ని సందర్శించండి.