చాలామందికి కొలెస్ట్రాల్ సమస్య ఉంటుంది. శరీరంలో ఎక్కడికక్కడ పేరుకుపోయిన కొవ్వుని తగ్గించుకోవాలని చేయని ప్రయత్నాలు అంటూ ఉండవు. అందులో ఒకటి టాబ్లెట్ వాడడం. స్టాటిన్స్ తీసుకోవడం వల్ల కొవ్వు తగ్గుతుంది. కానీ తాజాగా తేలిన విషయమేంటంటే టాబ్లెట్స్ వాడడం వలన టైప్ 2 డయాబెటిస్ వస్తుందని తేలింది. 45 ఏళ్ళు పైబడిన 9500మందిపై 15 సంవత్సరాలపాటు క్లినికల్ ఫార్మాలజీ బ్రిటిష్ జర్నల్ అధ్యయనం చేశారు. ఇందులో ఆసక్తికర నిజాలుబయటపడ్డాయి.
కొవ్వు తగ్గించే టాబ్లెట్స్ వేసుకోని వారితో పోలిస్తే.. స్టాటిన్స్ వేసుకునే వారిలో టైప్ 2 డయాబెటిస్ పెరిగింది . ఎందుకంటే స్టాటిన్స్ తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు, ఇన్సులిన్ నిరోధకత పెరుగుతాయి కాబట్టి టైప్ 2 డయాబెటిస్ వస్తుంది .కాబట్టి ఇలాంటి ట్యాబ్లెట్స్‌కి దూరంగా ఉండి సహజ మైన ఆహారం తో ఒంట్లో కొవ్వు శాతం తగ్గించుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.సహజం గా చెడు కొలెస్ట్రాలు తగ్గించే ఆహారం ఏమిటో తెలుసుకుందాం.
బీన్స్లోరాగి, పొటాషియం, మాంగనీసు,భాస్వరం, ఫోలిక్ యాసిడ్లు ఉన్నాయి.బీన్స్‌లో ఉండే పీచు చెడు కొలెస్ట్రాల్ తయారీని ఆపుతుంది.
వీటిలో ఉండే లెసిథిన్ కొవ్వు కరగడం లో సహాయపడుతుంది.
యాపిల్ రక్తంలో కొవ్వు నిల్వల్ని తగ్గించడంలో కీలకపాత్ర వహిస్తుంది అని చెప్పాలి అద్భుతంగా పనిచేస్తుంది. యాపిల్ కాలేయంలో తయారయ్యే చెడు కొవ్వును అదుపుచేస్తుంది. దీనిలో ఉండే మాలిక్ ఆమ్లం, శరీరంలోని కొవ్వును జీర్ణం అయ్యేలా చేస్తుంది.
ద్రాక్షలో ఉండే, టానిన్స్, టానిన్స్‌లు కొవ్వు నిల్వల్ని తక్కువ ఉండేలా చేస్తాయి. ఇందులో ఉండే పొటాషియం శరీరంలో ఏర్పడే విషతుల్యాలు నిర్వీర్యం అయ్యేలా చేస్తుంది.
జామలో విటమిన్ సి, పీచు పదార్థాలు,భాస్వరం, నికోటిన్ ఆమ్లం, శరీరంలో రోగనిరోధక వ్యవస్థను బలపరిచి , కొవ్వును తగ్గించి, గుండె ను కాపాడతాయి.
సబ్జా గింజల పై ఉండే పొట్టు పేగుల్లోకి కొవ్వు చేరకుండా అడ్డుకుంటుంది. సబ్జాచెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించే శక్తి వంతమైన పదార్ధం.
వెలుల్లి అధిక రక్తపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలోశక్తి వంతం గా పనిచేస్తుంది.
పుట్టగొడుగుల్లో ఉండే విటమిన్ బి, సి, ఖనిజ లవణాలు కాల్షియం, కొవ్వును కరిగించడం లో బాగా పనిచేస్తాయి.